Mahindra XUV400 Facelift: కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ వచ్చేస్తుంది - ఫీచర్లు ఎలా ఉండవచ్చు?
Mahindra XUV400: మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఫేస్‌లిఫ్ట్ మోడల్ త్వరలో మనదేశంలో లాంచ్ కానుంది.
Mahindra XUV400 Facelift Launch: మహీంద్రా త్వరలో లాంచ్ చేయనున్న ఎక్స్‌యూవీ400 ఈవీ ఫేస్‌లిప్ట్ ఫీచర్ల వివరాలు బయటకు వచ్చాయి. అధికారిక లాంచ్ తేదీ ఇంకా ప్రకటించనప్పటికీ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ అప్‌డేటెడ్ మోడల్ 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో మార్కెట్లోకి రావచ్చు. మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ ఫేస్‌లిఫ్ట్ మోడల్ రెండు కొత్త ట్రిమ్‌లు, ఈసీ ప్రో, ఈఎల్ ప్రో మోడల్స్‌లో వస్తుందని లీకైన వివరాల ప్రకారం తెలుస్తోంది. అయితే ఇది ఇప్పటికే ఉన్న ఈసీ, ఈఎల్ ట్రిమ్‌లతో వస్తుందా లేకపోతే వాటిని భర్తీ చేస్తుందా అనే సమాచారం అందుబాటులో లేదు.
అప్‌డేట్ ఎలా ఉంటుంది?
అధికారిక లాంచ్‌కు ముందు మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ లోపలి భాగాన్ని చూపించే మొదటి స్పై షాట్ లీక్ అయింది. 10.25 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఇందులో చూడవచ్చు. ఇది అధునాతన వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో 10.25 అంగుళాల ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఇప్పటికే అందుబాటులో ఉన్న అనలాగ్ డయల్‌ను రీప్లేస్ చేస్తుంది. ఈ డయల్ మధ్యలో చిన్న డిజిటల్ ఎంఐడీ కూడా ఉంటుంది. ఇది క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, కొత్త ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, తాజా డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్‌తో వెనుకవైపు ఏసీ వెంట్లను కలిగి ఉంటుంది.
ఫీచర్లు ఎలా ఉన్నాయి?
కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీలో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రివర్సింగ్ కెమెరా వంటి ఫీచర్లు అందుబాటులో ఉండవచ్చని భావిస్తున్నారు.
ఏ ఇంజిన్ ఇస్తున్నారు?
ఇంజిన్ గురించి చెప్పాలంటే కొత్త మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఈవీ ప్రస్తుతం ఉన్న 34.5 కేడబ్ల్యూహెచ్, 39.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌లతోనే రానుందని అంచనా. వీటిలో మొదటి వేరియంట్ 375 కిలోమీటర్లు, రెండో వేరియంట్ 456 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తాయి. రెండు మోడళ్లలో ఫ్రంట్ యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది 150 బీహెచ్‌పీ పవర్, 310 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7.2 కేడబ్ల్యూ ఏసీ ఫాస్ట్ ఛార్జర్‌ను రెండు వేరియంట్లలోనూ అందించనున్నారు. ఎక్స్‌యూవీ400 ఫేస్‌లిఫ్ట్‌లో రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, మూడు డ్రైవ్ మోడ్‌లు, నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు వంటి ఫీచర్లు ఉంటాయి.
మరోవైపు అమెరికన్ దిగ్గజ ఈవీ కంపెనీ టెస్లా అత్యధిక ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తున్నట్లుగా ఉన్న తన మొదటి స్థానాన్ని కోల్పోయింది. దీన్ని చైనాకు చెందిన బీవైడీ సంస్థ స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఈవీ విక్రయాల పరంగా బీవైడీ ప్రపంచంలోనే టాప్‌లో వేసింది. టెస్లా విడుదల చేసిన అమ్మకాల డేటా ప్రకారం 2023 నాలుగో క్వార్టర్‌లో కంపెనీ 4,84,507 యూనిట్లను విక్రయించింది. ఇది మూడో త్రైమాసిక అమ్మకాల కంటే 11 శాతం ఎక్కువ. కానీ అదే త్రైమాసికంలో చైనాకు చెందిన బీవైడీ ఏకంగా 5,26,409 యూనిట్లను విక్రయించింది. దీంతో టెస్లా రెండో స్థానానికి పడిపోయింది.
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!