మహీంద్రా XUV 7XO లాంచ్‌కు అంతా సిద్ధం - ప్రీమియం ఇంటీరియర్‌తో మిడ్‌సైజ్ SUV రెడీ
మహీంద్రా XUV 7XO మరికొన్ని గంటల్లో లాంచ్ కానుంది. కొత్త ఎక్స్‌టీరియర్, ప్రీమియం ఇంటీరియర్, XUV700 ఇంజిన్ ఆప్షన్లు, ధర అంచనాలు, పోటీ కార్ల వివరాలు తెలుసుకోండి.

Mahindra XUV 7XO Launch: మహీంద్రా కార్ల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహీంద్రా XUV 7XO ఈ రోజు (05 జనవరి 2025) అధికారికంగా ఆవిష్కరణకు సిద్ధమైంది. దాదాపు నాలుగున్నరేళ్ల క్రితం మార్కెట్‌లోకి వచ్చిన XUV700కు ఇది ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అవుతుంది. ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే 2025 డిసెంబర్ 15 నుంచే ప్రారంభం కాగా, ఇప్పుడు పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చాయి.
కొత్త ఎక్స్‌టీరియర్ డిజైన్ ఎలా ఉండబోతోంది?
XUV 7XOని బయట నుంచి చూసినప్పుడు XUV700 డిజైన్ గుర్తుకు వస్తూనే ఉంటుంది. అయితే, డిజైన్‌లో కీలకమైన మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. ముందు భాగంలో పూర్తిగా కొత్త గ్రిల్ డిజైన్, నిలువు ఆకారంలోని స్టైలిష్ ఎలిమెంట్స్‌తో పాటు మధ్యలో మహీంద్రా ‘ట్విన్ పీక్స్’ లోగో ఉంటుంది. కొత్త హెడ్‌ల్యాంప్స్‌లో ట్విన్-పాడ్ సెటప్, షార్ప్ LED DRLs ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
ముందు బంపర్ మరింత అగ్రెసివ్‌గా ఉండగా, ఎయిర్ డ్యామ్ కూడా కొత్తగా డిజైన్ చేశారు. సైడ్ ప్రొఫైల్‌లో 18 ఇంచుల కొత్త అలాయ్ వీల్స్ టాప్ వేరియంట్లలో అందించే అవకాశం ఉంది. వెనుక భాగంలో కొత్త LED టెయిల్ ల్యాంప్స్, రీడిజైన్ చేసిన టెయిల్‌గేట్, రియర్ బంపర్ మార్పులు కనిపిస్తాయి. కొత్త కలర్ ఆప్షన్లు కూడా XUV 7XOతో తీసుకురానున్నారు.
ఇంటీరియర్‌లో ఏమేం మార్పులు ఉంటాయి?
ప్రీమియం ఫీల్ ఇచ్చే ఇంటీరియర్ XUV 7XO ప్రధాన బలం. సాఫ్ట్-టచ్ మెటీరియల్స్‌తో పాటు ట్రిపుల్ స్క్రీన్ లేఅవుట్ ఇందులో ప్రత్యేక ఆకర్షణ. 12.3 ఇంచుల మూడు డిస్ప్లేలు - డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్, ప్యాసింజర్ స్క్రీన్ - హై-డెఫినిషన్, ఫాస్ట్ రెస్పాన్స్‌తో ఉండనున్నాయి.
ఫ్రంట్ ప్యాసింజర్ సీటుకు ఎలక్ట్రానిక్ ‘బాస్ మోడ్’ అందించనున్నారు. దీనివల్ల వెనుక సీట్లో కంఫర్ట్ మరింత పెరుగుతుంది. కొత్త రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్, పియానో బ్లాక్ ఫినిష్, టాన్-బ్లాక్ కలర్ థీమ్ డాష్‌బోర్డ్‌కు ప్రీమియం టచ్ ఇస్తాయి. పానోరామిక్ సన్‌రూఫ్, డ్యుయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, సరౌండ్ వ్యూ కెమెరాలు, లెవల్-2 ADAS వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.
ఇంజిన్, గేర్‌బాక్స్ వివరాలు
XUV 7XOలో XUV700లో ఉన్న ఇంజిన్ ఆప్షన్లనే కొనసాగిస్తారు. 2.0 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ 200hp శక్తి, 380Nm టార్క్ అందిస్తే, 2.2 లీటర్ల టర్బో డీజిల్ ఇంజిన్ 185hp శక్తి, 450Nm టార్క్ ఇస్తుంది. డీజిల్ వేరియంట్‌లో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా అందించే అవకాశం ఉంది. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు కొనసాగుతాయి.
ధర అంచనాలు, పోటీ కార్లు
మహీంద్రా XUV 7XO ధర రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల (ఎక్స్-షోరూమ్ ధర) మధ్య ఉండొచ్చని అంచనా. ప్రస్తుతం XUV700 బేస్ వేరియంట్ రూ.14.60 లక్షలు, టాప్ వేరియంట్ రూ.23.71 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర)గా ఉంది. లాంచ్ తర్వాత XUV 7XOకి Hyundai Alcazar, MG Hector. Tata Safari ప్రధాన పోటీదారులుగా నిలవనున్నాయి.
మొత్తంగా చూస్తే, డిజైన్, టెక్నాలజీ, కంఫర్ట్, శక్తిమంతమైన ఇంజిన్‌లతో మహీంద్రా XUV 7XO మిడ్‌సైజ్ SUV సెగ్మెంట్‌లో కొత్త ఉత్సాహం తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















