Mahindra XUV 3XO: కొత్త కారు కొనేవాళ్లకు గుడ్‌న్యూస్ - XUV 3XO రేటు రూ.వేలల్లో తగ్గించిన కంపెనీ, కొత్త ధర ఎంతంటే?
Mahindra XUV 3XO Price Cut: మహీంద్రా XUV 3XO AX5 వేరియంట్ ఇప్పుడు మునుపటి కంటే చౌకగా మారింది. కంపెనీ దాని ధరను వేలల్లో తగ్గించింది.

Mahindra XUV 3XO New Price, Mileage And Features In Telugu: మహీంద్రా XUV 3XO AX5.. డ్యూయల్-టోన్ బంపర్లు, క్రోమ్-షీట్ గ్లోస్-బ్లాక్ గ్రిల్‌తో ఒక ప్రీమియం కార్‌లా కనిపిస్తుంది. C-షేప్ LED DRL లైన్స్ పై స్పోర్టీ LED హెడ్‌ల్యాంప్స్ దీనికి జీవం ఉట్టిపడే అగ్రెసివ్ ఫీల్ ఇస్తున్నాయి. 16 అంగుళాల డైమండ్-కట్ అలాయ్ వీల్స్ & రూఫ్ రైల్ డిజైన్ ఈ సబ్-కాంపాక్ట్ SUV కి ఫుల్ సైజ్ SUV తరహా గాంభీర్యాన్ని ఆపాదించాయి, కస్టమర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఫౌ స్కిడ్ ప్లేట్లు, రియర్ స్పాయిలర్ & కనెక్టెడ్ LED టెయిల్-ల్యాంప్‌లతో XUV 3XO ఉత్సాహభరితమైన & ట్రెండ్‌కు తగ్గ లుక్స్ అందిస్తుంది. మీరు శక్తివంతమైన ఫీచర్లతో నిండిన & మీ బడ్జెట్‌కు సరిపోయే SUV కోసం చూస్తుంటే, మహీంద్రా XUV 3XO AX5 మీకు సరిపోయే ఎంపిక కావచ్చు.
రేటు తగ్గించిన మహీంద్రా
మహీంద్రా కంపెనీ, Mahindra XUV 3XO AX5 వేరియంట్ ధరను రూ. 20,000 తగ్గించింది. దీంతో, ఈ సబ్-కాంపాక్ట్ SUV మరింత తక్కువ ధరకు వస్తుంది & మీ డబ్బుకు తగిన విలువను ఇస్తుంది.
XUV 3XO AX5 ధర ఎందుకు తగ్గింది?
మహీంద్రా, ఇటీవల, XUV 3XO సిరీస్‌లో మరో మూడు కొత్త వేరియంట్‌లను జోడించింది, అవి - REVX M, REVX M (O) & REVX A. ఇవి.. REVX A AX5 & AX5L మధ్య సెగ్మెంట్‌లో ఉంటాయి. ఈ కొత్త వేరియంట్లు AX5 కంటే ఎక్కువ ఫీచర్లు అందిస్తాయి, కానీ AX5L అంత ఖరీదైనవి కాదు. ఈ కారణంగా, AX5 వేరియంట్ రేటును తగ్గించడం ద్వారా, కంపెనీ అన్ని వేరియంట్‌ల మధ్య వ్యత్యాసాన్ని మరింత స్పష్టంగా చూపించింది, తద్వారా కస్టమర్‌లు గందరగోళం లేకుండా సరైన మోడల్‌ను ఎంచుకోవచ్చు.
ఇంజిన్ & పనితీరు
మహీంద్రా XUV 3XO ఇప్పుడు మూడు ఇంజిన్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. వాటిలో మొదటిది 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, ఇది 109 bhp పవర్‌ను & 200 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. రెండో ఎంపిక 1.2 లీటర్ TGDi టర్బో పెట్రోల్ ఇంజిన్, ఇది 129 bhp పవర్‌ను & 230 Nm టార్క్‌ను ఇస్తుంది. మూడో ఎంపిక 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్, ఇది 115 bhp పవర్‌ను & 300 Nm శక్తివంతమైన టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ అన్ని ఇంజిన్ వేరియంట్‌లతో, కస్టమర్ 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ & AMT గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలను పొందుతారు. తద్వారా, డ్రైవింగ్ స్టైల్ & అవసరానికి అనుగుణంగా ఒక ట్రాన్స్‌మిషన్‌ను ఎంచుకోవచ్చు.
AX5 వేరియంట్ ప్రత్యేకత ఏమిటి?
ఈ విభాగంలో ఈ కారును మెరుగ్గా నిలబెట్టే చాలా మంచి లక్షణాలు దీనిలో ఉన్నాయి. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 10.25-అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ & ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి మోడరన్ ఫీచర్లు ఈ సబ్-కాంపాక్ట్ SUV లో చాలా ఉన్నాయి. కుటుంబ సభ్యుల భద్రత కోసం, రియర్ పార్కింగ్ కెమెరా, హిల్ హోల్డ్ & EBDతో ABS వంటి లక్షణాలను కూడా కలిగి ఉంది.
మహీంద్రా ఈ వేరియంట్ ధరను రూ. 20,000 తగ్గించడం ద్వారా, ఈ ప్రయోజనాన్ని నేరుగా కస్టమర్లకు బదిలీ చేస్తోంది. ఈ ప్రయోజనంతో, కస్టమర్లు, అదే బడ్జెట్‌లో మరింత మెరుగైన ట్రిమ్‌ను ఎంచుకోవచ్చు లేదా వారి వాహనానికి కొత్త ఉపకరణాలను జోడించవచ్చు.





















