అన్వేషించండి

మహీంద్రా విజన్ ఎస్ డీజిల్ ఆటోమేటిక్ ఎస్‌యూవీ ఫీచర్లు, బిగ్ లాంచింగ్ ఎప్పుడంటే..

మహీంద్రా విజన్ ఎస్ చిన్న డిఫెండర్ లాంటి డిజైన్ కలిగి ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో XUV 3XO, థార్ నుండి కొన్ని ఫీచర్లు ఇందులో యాడ్ కానున్నాయి.

భారత్‌లో కస్టమర్లు అత్యంత నమ్మకం ఉంచే బ్రాండ్లలో ఒకటైన మహీంద్రా త్వరలో మరిన్ని SUVలను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. 2026 SUV బ్రాండ్ కోసం మహీంద్రా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్న కొన్ని మహీంద్రా ఎస్‌యూవీలు 2027లో లాంచ్‌ అవుతాయి. ఈ ఏడాది చివరికల్లా దీన్ని అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త కార్లలో విజన్ S బిగ్ లాంచింగ్‌గా చెప్పవచ్చు. విజన్ ఎస్ 4 మీటర్ల కంటే తక్కువ పొడవుతో ఉండే స్ట్రాంగ్ డీజిల్ SUV అవుతుంది.

విజన్ S బాక్సీ స్టైలింగ్ 

ఇది చిన్నగా, నాలుగు మీటర్ల కంటే తక్కువ పొడవుతో ఉండి శక్తివంతమైన SUV గా మారనుంది. ముఖ్యంగా బాక్సీ స్టైలింగ్ అలాగే స్పేర్ వీల్ బయటకు వస్తుంది. ఎత్తుగా ఉండి ఫ్లాట్ బోనెట్‌ను కలిగి ఉంటుంది. ఇది సబ్ 4 మీటర్ డిఫెండర్ వంటి అన్ని ఆఫ్-రోడర్‌లను గుర్తుచేస్తుంది. 


మహీంద్రా విజన్ ఎస్ డీజిల్ ఆటోమేటిక్ ఎస్‌యూవీ ఫీచర్లు, బిగ్ లాంచింగ్ ఎప్పుడంటే..

పవర్‌ట్రెయిన్ ఎంపికలు

ఈ SUV కోసం ఎంచుకున్న పవర్‌ట్రెయిన్ పెట్రోల్, డీజిల్ ఉన్నాయి. డీజిల్ ఒక చిన్న SUVగా టార్గెట్ పెట్టుకుంది. విజన్ S డీజిల్‌లో XUV 3XOకి సమానమైన డీజిల్ ఇంజిన్ వస్తుందని భావిస్తున్నారు. అదే 1.5 లీటర్ డీజిల్ థార్‌కు కూడా ఇంజిన్ పవర్ సపోర్ట్ చేస్తుంది. విజన్ S థార్ 3 డోర్‌తో దాదాపు ఒకే సైజులో ఉంటుంది. కానీ 5 డోర్లతో మరింత ఎత్తుగా ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్ XUV 3XOలో తరహా యూనిట్‌గా ఉంటుంది.


మహీంద్రా విజన్ ఎస్ డీజిల్ ఆటోమేటిక్ ఎస్‌యూవీ ఫీచర్లు, బిగ్ లాంచింగ్ ఎప్పుడంటే..

విజన్ ఎస్ ఇంటీరియర్, స్పేస్

మహీంద్రా విజన్ ఎస్ ఇంటీరియర్ కాన్సెప్ట్‌ను పాలో అవుతుంది. పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో సెంటర్ కన్సోల్ ఉంటుంది. కానీ మహీంద్రా XUV7XO లేదా XEV లాగ కాకుండా, ఇక్కడ మరిన్ని కంట్రోల్స్ టచ్‌స్క్రీన్‌లోకి వస్తాయి. ఇది థార్ 3 డోర్ కంటే విశాలంగా వస్తుంది. మహీంద్రా XUV 3XO కంటే ఎత్తుగా ఉంటుంది. ఈ SUV 2027 లోపు లాంచ్ చేయాలని మహీంద్రా పనిచేస్తోంది. ఇది రాక్స్ లేదా స్కార్పియో N కంటే తక్కువగా ఉంటూ, స్ట్రాంగ్‌గా కనిపిస్తూ సబ్ 4 మీటర్ SUV పరంగా ఒక కొత్త విభాగాన్ని కస్టమర్లకు అందిస్తుంది.

మహీంద్రా నుండి రాబోతున్న విజన్ ఎస్ (Vision S) ఎస్‌యూవీ కస్టమర్లకు క్లాసిక్ ఆఫ్-రోడ్ ఎక్స్‌పీరియన్స్ అందించేలా రూపొందిస్తున్నారు. థార్ రాక్స్ తరహాలోనే ఇందులో అట్రాక్టివ్ LED DRLలు, ఫ్రంట్ గ్రిల్ కింద రాడార్ యూనిట్ ఉండనున్నాయి.  ఇది ADAS ఫీచర్లను కన్ఫామ్ చేస్తుంది. అధిక గ్రౌండ్ క్లియరెన్స్, పెద్ద వీల్స్, ఇండిపెండెంట్ సస్పెన్షన్ వంటి టెక్నాలజీతో ఈ కారు గుంతల రోడ్లపై సైతం అద్భుతంగా ప్రయాణిస్తుంది.

ఇక డిజైన్ విషయానికి వస్తే, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, స్ట్రెయిట్ రూఫ్‌లైన్ దీనికి మోడ్రన్ లుక్ ఇస్తున్నాయి. టెయిల్‌గేట్‌పై అమర్చిన స్పేర్ వీల్ దీని ఆఫ్-రోడ్ శైలిని మరింత స్ట్రాంగ్ చేస్తుంది. ఇంటీరియర్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్ స్క్రీన్ డాష్‌బోర్డ్, సాఫ్ట్ టచ్ మెటీరియల్‌తో కూడిన ప్రీమియం క్యాబిన్ ఉంటుందని కంపెనీ చెబుతోంది. భవిష్యత్తులో హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో కూడా ఇది అందుబాటులోకి రావచ్చు. లాంచ్ అయితే కనుక ఇది టాటా సియెర్రాకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Vijayawada Utsav Dasara: మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
మైసూర్ దసరా తరహాలో విజయవాడ ఉత్సవ్ - ఇంద్రకీలాద్రి నవరాత్రులకు నేషనల్ బ్రాండింగ్ ఇచ్చేలా భారీ ప్లాన్!
Embed widget