Upcoming SUV 2025: మహీంద్రా నుంచి టాటా వరకు – ఈ పండుగ సీజన్‌లో రానున్న 4 పవర్‌ఫుల్ SUVలు ఇవే, ₹6 లక్షల నుంచి స్టార్ట్!
2025 Festive Season New Car Launch: ఈ పండుగ సీజన్‌లో, మహీంద్రా, హ్యుందాయ్, మారుతి, & టాటా తమ ప్రసిద్ధ SUV మోడళ్ల అప్‌డేటెడ్ వెర్షన్‌లను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నాయి.

Upcoming SUVs For Festive Season 2025: భారతదేశంలో దసరా, దీపావళి పండుగ సీజన్ కోసం ఆటోమొబైల్ కంపెనీలు ఏడాదంతా ఎదురు చూస్తుంటాయి. ఫెస్టివ్ సీజన్ ప్రారంభం కాగానే కొత్త మోడళ్లను విడుదల చేయడం ప్రారంభిస్తాయి. ఈసారి దసరా - దీపావళి (Dasara - Diwali 2025) మధ్య, 4 కొత్త SUVలు భారత మార్కెట్లోకి ప్రవేశించబోతున్నాయి. ఇవన్నీ పవర్‌ఫుల్ లుక్స్, మోడ్రన్ టెక్నాలజీ & స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ కలయికను అందించగవు.
మహీంద్రా బొలెరో ఫేస్‌లిఫ్ట్ (Mahindra Bolero Facelift 2025)
మహీంద్రా, తన బెస్ట్ సెల్లింగ్ SUV బొలెరోను కొత్త అవతారంలో విడుదల చేయబోతోంది. మీడియా నివేదికల ప్రకారం, కొత్త బొలెరోను ఈ పండుగ సీజన్‌లో (Festive Season 2025) లాంచ్ చేయవచ్చు. ఈసారి, బొలెరోను పాత బాడీ-ఆన్-ఫ్రేమ్ డిజైన్‌కు బదులుగా కొత్త మోనోకోక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. పవర్‌ట్రెయిన్ ఎంపికలలో పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ & ఎలక్ట్రిక్ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. మహీంద్రా బొలెరో ఫేస్‌లిఫ్ట్ ధర ₹10 లక్షల నుంచి ₹12 లక్షల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు.
హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ (Hyundai Venue Facelift 2025)
హ్యుందాయ్ కాంపాక్ట్ SUV వెన్యూ కూడా పండుగ సీజన్‌లో కొత్త రూపంలో వస్తుంది. టెస్టింగ్ సమయంలో భారతీయ రోడ్లపై చాలాసార్లు కనిపించిన కొత్త వెన్యూను, 24 అక్టోబర్ 2025న లాంచ్ చేయవచ్చు. ఈ కారు లుక్స్ ఈసారి గణనీయంగా మారే అవకాశం ఉంది. ఎక్స్‌టర్నల్ & ఇంటర్నల్ రెండింటిలోనూ మోడ్రన్ టచ్‌లు ఉండవచ్చు. కొత్త గ్రిల్ డిజైన్, అప్‌డేట్ చేసిన హెడ్‌ల్యాంప్ సెటప్ & ప్రీమియం ఇంటీరియర్ లేఔట్ వంటి మార్పులను హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ 2025లో చూసే అవకాశం ఉంది. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ కాబట్టి ఇంజిన్ & ట్రాన్స్‌మిషన్ ఎంపికలు మాత్రం మారవని భావిస్తున్నారు. దీని అంచనా ధర ₹7.94 లక్షల నుంచి ₹13.62 లక్షలు.
మారుతి సుజుకి ఎస్కుడో (Maruti Suzuki Escudo)
మారుతి సుజుకీ, తన కొత్త మిడ్-సైజ్ SUV ఎస్కుడోపై చురుగ్గా పని చేస్తోంది. దీనిని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో బలమైన హైబ్రిడ్ & CNG వెర్షన్‌లలో తీసుకురావచ్చు. పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం క్యాబిన్ & ADAS ఫీచర్లను ఈ కారులో ఇస్తుందని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు. దీని లాంచ్‌ను 2025 చివరి నాటికి ప్లాన్ చేస్తున్నారు. అయితే, కంపెనీ ఈ పండుగ సీజన్‌లో మారుతి సుజుకి ఎస్కుడో ప్రివ్యూను చూపించవచ్చు. మారుతి సుజుకి ఎస్కుడో ₹9.75 లక్షల రేంజ్‌లో లాంచ్ కావచ్చని భావిస్తున్నారు.
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ (Tata Punch Facelift 2025)
టాటా మోటార్స్, తన మైక్రో SUV పంచ్‌కు కొత్త రూపాన్ని (ఫేస్‌లిఫ్ట్) ఇవ్వబోతోంది. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ఫ్రంట్ డిజైన్, పెద్ద టచ్ స్క్రీన్ & డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అప్‌డేట్స్ ఉంటాయి. పవర్‌ట్రెయిన్‌లో ఎటువంటి మార్పు ఉండదు. కానీ, ఫీచర్లు & డిజైన్ కారణంగా దీని మార్కెట్ ఆకర్షణ పెరగవచ్చు. దీని అంచనా ధర ₹6 లక్షల నుంచి ప్రారంభం కావచ్చు.






















