Mahindra SUV EV: మూడు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో దిగనున్న మహీంద్రా, గట్టి ప్లానే వేసిందిగా!
భారతీయ కార్ల తయారీ బ్రాండ్ మహీంద్రా మనదేశంలో త్వరలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను లాంచ్ చేయనుంది.
మహీంద్రా త్వరలో ఎలక్ట్రిక్ కార్ల తయారీపై గట్టిగా దృష్ణి పెట్టనుంది. త్వరలో లాంచ్ చేయనున్న మూడు ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను ప్రదర్శించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల్లో కొత్త ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫాంలు అందించనున్నారు. దీనికి సంబంధించిన టీజర్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. ఈ టీజర్‌లో దీని డిజైన్‌ను చూడవచ్చు.
వీటిని జులైలో మన ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మహీంద్రా లాంచ్ చేసిన ఎస్‌యూవీలతో ఏమాత్రం సంబంధం లేకుండా పూర్తి కొత్తగా ఈ కొత్త ఎస్‌యూవీలు రానున్నాయి. ఈ టీజర్‌లో సీ ఆకారంలోని డీఆర్ఎల్స్ ఉన్నాయి. అయితే కాన్సెప్ట్ విజువల్స్ మాత్రం వేర్వేరు సైజుల్లో ఉన్నాయి. కాబట్టి ఒక్కో కాన్సెప్ట్ డిజైన్ ఒక్కో డిజైన్‌తో ఉండనుందని అంచనా వేయవచ్చు.
ఎక్స్‌యూవీ900, ఎక్స్‌యూవీ700, ఎక్స్‌యూవీ400ల్లో ఒకదానికి ఎలక్ట్రిక్ వేరియంట్ రానుందని వార్తలు వస్తున్నాయి. అయితే త్వరలో రానున్న మూడిట్లో ఇది ఉండనుందా... అది పూర్తిగా ప్రత్యేకంగా రానుందా అని మాత్రం తెలియరాలేదు.
అయితే, మహీంద్రా కేవలం టీజర్‌ను మాత్రమే ప్రదర్శించింది. కేవలం డిజైన్ తప్ప, ఈ కార్ల పేర్లు కానీ, దానికి సంబంధించిన వివరాలు కానీ తెలియరాలేదు. ఈ కొత్త ఎలక్ట్రిక్ వాహనాల కాన్సెప్ట్‌ను ఇంగ్లండ్‌లోని మహీంద్రా అడ్వాన్స్‌డ్ డిజైన్ స్టూడియోలో దీన్ని రూపొందించారు. దీని స్టైలింగ్ మాత్రం కేక అనిపించేలా ఉంది.
మహీంద్రా దృష్టి ప్రస్తుతం ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల పైనే ఉంది. కాబట్టి ఈ మూడు ఎలక్ట్రిక్ వాహనాలు మహీంద్రాకు ఎంతో కీలకమైనవి. విడుదల అయిన టీజర్ వీడియో ప్రకారం చూస్తే... దీని వెనకవైపు పెద్ద సి ఆకారపు డిజైన్ ఉంది. ఇది ఎక్స్‌యూవీ700 తరహాలో ఉంది. దీనికి సంబంధించిన వివరాలు లాంచ్ దగ్గరపడేకొద్దీ తెలుస్తాయి. అయితే ప్రస్తుతం మనదేశంలో మాత్రం కొన్ని ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
View this post on Instagram