అన్వేషించండి

మోడ్రన్‌ ఆటిట్యూడ్‌తో రాబోతున్న Mahindra Thar 3-Door ఫేస్‌లిఫ్ట్ - నయా డిజైన్, అదిరే ఫీచర్స్!

New Thar Features: మహీంద్రా థార్ 3-డోర్ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ త్వరలో రానుంది. కొత్త ఫీచర్లు, పెద్ద టచ్‌స్క్రీన్, అప్‌డేటెడ్‌‌ ఇంటీరియర్ & కొత్త డిజైన్స్‌ ఈ ఫేస్‌లిఫ్ట్‌లో ఉంటాయి.

Mahindra Thar 3-Door Facelift Features: మహీంద్రా, తన మోస్ట్‌ పాపులర్‌ & పవర్‌ఫుల్‌ SUV థార్ 3-డోర్‌ను కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈసారి దాని ఫీచర్లు & ఇంటీరియర్‌తో మోత మోగిపోనుంది, చాలా మార్పులు జరిగాయి. ఈ కంపెనీ, Thar Roxx 5-door నుంచి చాలా అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను తీసుకుని వాటిని 3-డోర్ థార్‌లో అమర్చింది. రాక్స్ & థార్ రెండూ వేర్వేరు మోడల్స్‌ అయినప్పటికీ, 5-డోర్ రాక్స్‌ వచ్చిన తర్వాత 3-డోర్ థార్ అమ్మకాలు ప్రభావితమయ్యాయి. దీంతో, 3-డోర్‌ తిరిగి పుంజుకోవడానికి ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కంపెనీ లాంచ్‌ చేయనుంది.  

ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌లో మార్పులు
ఫేస్‌లిఫ్టెడ్ మహీంద్రా థార్ 3-డోర్ బయటి భాగం మునుపటి కంటే మరింత తాజాగా & ఆధునికంగా కనిపిస్తుంది. దీనికి కొత్త బంపర్ డిజైన్, కొత్త గ్రిల్, అప్‌డేట్‌ చేసిన హెడ్‌ల్యాంప్‌లు & కొత్త అల్లాయ్ వీల్స్ బిగిస్తారు. ఈ మార్పులు ఈ SUV ని మరింత స్టైల్‌గా కనిపించేలా చేస్తాయి, అదే సమయంలో దాని ఆఫ్-రోడింగ్ కెపాసిటీ ఏమాత్రం తగ్గదు.     

ఇంటీరియర్ మరింత ప్రీమియం
New Thar 3-Door లోపలి భాగంలోనూ అతి పెద్ద మార్పులు కనిపిస్తాయి. దీనికి రాక్స్ లాగా కొత్త స్టీరింగ్ వీల్ & సెంటర్ కన్సోల్ ఇవ్వవచ్చు. పవర్ విండో స్విచ్‌లు ఇప్పుడు తలుపులపై ఉంటాయి & ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ పరిమాణం కూడా మునుపటి కంటే పెద్దదిగా ఉంటుంది. ఇంకా, అనేక కొత్త కంఫర్ట్ ఫీచర్లు & టెక్నాలజీని ఇందులో చేరుస్తారు. ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ మునుపటి కంటే ఎక్కువ సౌకర్యవంతమైన సీట్లు & ప్రాక్టికల్‌ ఫీచర్లను కలిగి ఉంటుంది, తద్వారా ఇది ఆఫ్-రోడింగ్‌కు మాత్రమే కాకుండా రోజువారీ ఉపయోగం కోసం కూడా మరింత ఆకర్షణీయంగా మారుతుంది.       

ఇంజిన్ & పనితీరు
మహీంద్రా థార్ 3-డోర్ ఫేస్‌లిఫ్ట్‌లో, ఇంజిన్ లైనప్‌లో ఎటువంటి మార్పు ఉండదు. ఇది మునుపటి లాగే 1.5-లీటర్ డీజిల్ (RWD మోడల్), 2.0-లీటర్ పెట్రోల్ & 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌లతో పని చేస్తుంది. ఈ SUV కొనేవాళ్లకు మాన్యువల్ & ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు రెండూ అందుబాటులో ఉంటాయి. 4x4 వేరియంట్లు కూడా కొనసాగుతాయి, ఇది ఆఫ్-రోడింగ్ సాహసికులకు ప్రత్యేకం.        

ధర వివరాలు
ఫేస్‌లిఫ్టెడ్ థార్ 3-డోర్ ధర ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. అయితే, 5-డోర్ థార్ రాక్స్ & స్టాండర్డ్ 3-డోర్ థార్ మధ్య సమతౌల్యాన్ని కొనసాగిస్తూ కంపెనీ దీనిని పరిచయం చేస్తుంది. ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణ రాష్ట్రాల్లో 3-డోర్ థార్ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 11.50 లక్షల (Mahindra Thar 3-Door price, Hyderabad Vijayawada) నుంచి ప్రారంభం అవుతుంది. 5-డోర్ థార్ రాక్స్ ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 12.99 లక్షల (Thar Roxx 5-door price, Hyderabad Vijayawada) నుంచి ప్రారంభం అవుతుంది.     

టాప్ హెడ్ లైన్స్

2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
అడ్వెంచర్ బైక్ Honda XR300Lను ఫైనాన్స్‌లో తీసుకుంటారా? ఈజీ EMI ఆఫర్లు రెడీగా ఉన్నాయి!
కేవలం రూ.25,000 కట్టి కొత్త Honda XR300L బైక్ సొంతం చేసుకోవచ్చు.. మీ నెలవారీ EMI ఎంతంటే?
రూ.3.60 లక్షల డౌన్‌పేమెంట్‌తో 2026 Honda Elevate ZX వేరియంట్‌ మీ సొంతం.. నెలవారీ EMI ఎంతంటే?
2026 Honda Elevate టాప్‌ వేరియంట్‌ ZX.. ఈజీ EMIల్లోనూ కొనేయొచ్చు, పెద్దగా ఆర్ధిక భారం లేకుండా!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Embed widget