Mahindra Scorpio: స్కార్పియో కొనాలంటే ఇదే రైట్ టైమ్ - వచ్చే నెల నుంచి మరింత కాస్ట్లీ!
Mahindra Scorpio Price Hike: ఇండియాలో మహీంద్రా స్కార్పియో ధర 2025 జనవరి నుంచి పెరగనుంది. ఒకేసారి ఏకంగా మూడు శాతం వరకు దీని ధర పెరగనుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
Mahindra Scorpio Price Hike in January 2024: మహీంద్రా తన వాహనాల ధరలను 2025 జనవరి నుంచి పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల జనవరి నుంచి స్కార్పియో, బొలెరో, థార్ రాక్స్ సహా అన్ని వాహనాల ధరలను మూడు శాతం పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది. అటువంటి పరిస్థితిలో మీరు మహీంద్రా స్కార్పియోను కొనుగోలు చేయాలనుకుంటే ఈ అవకాశం మీ కోసమే అని చెప్పవచ్చు.
భారత మార్కెట్లో మహీంద్రా స్కార్పియో ఎక్స్ షోరూం ధర రూ. 13.85 లక్షల నుంచి రూ. 24.54 లక్షల వరకు ఉంది. ఇది కాకుండా స్కార్పియో క్లాసిక్ ధర రూ.13.62 లక్షల నుంచి రూ.17.42 లక్షల వరకు ఉంది. జనవరి 1వ తేదీ నుంచి స్కార్పియో ధర కూడా పెరగనుంది.
మహీంద్రా స్కార్పియో ఇంజన్, ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మహీంద్రా స్కార్పియోలో 2184 సీసీ ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 130 బీహెచ్‌పీ పవర్‌తో 300 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది. ఈ కారులో 7, 9 సీటర్ ఆప్షన్లు ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా ఈ ఎస్‌యూవీ 15 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
Also Read: టీవీఎస్ ఐక్యూబ్‌పై 100 శాతం క్యాష్‌బ్యాక్ - సూపర్ ఆఫర్ ఇస్తున్న కంపెనీ!
మహీంద్రా స్కార్పియో ఫీచర్ల గురించి చెప్పాలంటే ఈ కారులో 460 లీటర్ల బూట్ స్పేస్, 60 లీటర్ల భారీ ఇంధన ట్యాంక్ ఉంది. దీంతో పాటు పవర్ స్టీరింగ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఏసీ, ఎయిర్‌బ్యాగ్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, అల్లాయ్ వీల్స్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ వంటి ఎన్నో గొప్ప ఫీచర్లు ఎస్‌యూవీలో అందించారు.
మార్కెట్లో పోటీ వీటితోనే...
మహీంద్రా స్కార్పియో మార్కెట్లో ఉన్న ఎంజీ హెక్టర్, టాటా సఫారీ, టాటా హారియర్ వంటి కార్లకు ప్రత్యక్షంగా పోటీని ఇస్తుంది. స్కార్పియో క్లాసిక్‌లో మీరు 7, 9 సీటర్ ఆప్షన్లను పొందుతారు. మహీంద్రా స్కార్పియో క్లాసిక్ గెలాక్సీ గ్రే, డైమండ్ వైట్‌తో సహా అనేక కలర్ ఆప్షన్లతో వస్తుంది.
Also Read: ప్రతి నెలా లక్షల్లో అమ్ముడుపోతున్న బైక్‌లు - ఇండియాలో టాప్-5 కంపెనీలు ఇవే!
Introducing the New Scorpio-N Z8 Select with All-New Midnight Black Colour, Rich Coffee-Black Leatherette Interiors, Diamond Cut Alloy wheels, LED Headlamps, projector Fog Lamps, Adrenox Connect & much more. It's sophistication & power packed into one.#DominationRedefined pic.twitter.com/NgFLpBOhfe
— Mahindra Scorpio (@MahindraScorpio) February 22, 2024
Daring, dark, and boldly unstoppable. The Scorpio Classic Boss Edition is here to own every road.
— Mahindra Scorpio (@MahindraScorpio) October 17, 2024
This special edition features Dark chrome-themed exteriors, Boss Black interiors, a rear-view camera, a classic black chrome front grille, and much more.
Available via accessories… pic.twitter.com/bpNsifoq2L