Scrambler 400 XC Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్‌తో పోలిస్తే ట్రయంఫ్ స్క్రాంబ్లర్ రేటు ఎలా ఉంది?, పైసా వసూల్ అవుతుందా?
Triumph Scrambler 400 XC Bike: ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 XC ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్ మోడల్ ధర వెల్లడైంది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో ఇదే తరహా బైక్‌తో పోలిస్తే ఈ రేటు నయమో, కాదో తెలుసుకుందాం.

Triumph Scrambler 400 XC Bike Price And Features: ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియా, ఇటీవలే, తమ మోస్ట్ ఎవెయిటెడ్ బైక్ "స్క్రాంబ్లర్ 400 XC"ని భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బండి ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను (Triumph Scrambler 400 XC ex-showroom price) రూ. 2.94 లక్షలుగా నిర్ణయించారు. ఇది, స్క్రాంబ్లర్ 400 X బైక్ రేటు కంటే రూ. 27,000 ఎక్కువ. అయితే, ఈ అదనపు ధరకే Scrambler 400 XC లో ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్ & కొన్ని స్టాండర్డ్ యాక్సెసరీలను కంపెనీ అందిస్తోంది. దీంతో ఈ బండి ప్రత్యేకతలు పెరిగాయి.
స్క్రాంబ్లర్ 400 XC ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్ ధర ఎంత?
ట్రయంఫ్ మోటార్ సైకిల్స్, తన స్క్రాంబ్లర్ 400 XC బైక్ కోసం ట్యూబ్ లెస్ స్పోక్ వీల్స్ ధరలను ఇటీవలే ప్రకటించింది.
కంపెనీ వెల్లడించిన ప్రకారం, ఈ చక్రాలు భారతదేశంలో తయారు కావు, విదేశాల నుంచి దిగుమతి అవుతాయి.
టైగర్ 900 ర్యాలీ ప్రో & స్క్రాంబ్లర్ 1200 X వంటి హై-ఎండ్ బైక్‌లకు చక్రాలను తయారు చేసే పాత OEM (ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్)నే వీటిని ఉత్పత్తి చేస్తోంది.
స్క్రాంబ్లర్ 400 X బైక్ కోసం ఈ చక్రాలను విడిగా కొనుగోలు చేయాలనుకుంటే, ముందు చక్రం కోసం రూ. 34,876 & వెనుక చక్రం కోసం రూ. 36,875 చెల్లించాలి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ట్యూబ్ లెస్ స్పోక్ వీల్స్ ధరతో పోలిస్తే...
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవల తన ప్రస్తుత కస్టమర్ల కోసం ట్యూబ్ లెస్ స్పోక్ వీల్స్ ధరలను పెంచింది.
ఇప్పుడు కొత్త ధర రూ. 40,655. ఈ ధరలో వీల్ సెట్ మాత్రమే ఉంటుంది.
ఇన్‌స్టాలేషన్ ఖర్చు & ఇతర అవసరమైన భాగాల కోసం విడిగా చెల్లించాలి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ట్యూబ్ లెస్ స్పోక్ వీల్స్ రేట్లతో పోలిస్తే ట్రయంఫ్ ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్ చౌకగా ఉంటాయి.
అదే సమయంలో, నాణ్యత & మన్నిక పరంగా కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ కంటే తక్కువేమీ కాదని OEMని బట్టి స్పష్టమవుతుంది.
ట్యూబ్ లెస్ స్పోక్ వీల్స్ బైక్‌ల విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ట్రయంఫ్ గట్టి పోటీదారుగా మారింది.
స్క్రాంబ్లర్ 400 XC డబ్బుకు తగిన విలువ ఇస్తుందా?
ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 XC రేటు (రూ. 2.94 లక్షలు ఎక్స్-షోరూమ్) కాస్త పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నప్పటికీ, చెల్లించే డబ్బుకు తగిన విలువైన బైక్‌గా యూజర్లు చెబుతున్నారు.
కొత్తగా వచ్చిన అప్‌డేట్ ఏమిటంటే... ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్ ఫీచర్ ఫ్యాక్టరీ నుంచే అందుబాటులో ఉంటుంది. ఇతర చాలా బ్రాండ్‌లలో వీటిని ఆప్షనల్ యాక్సెసరీలుగా విక్రయిస్తారు.
స్క్రాంబ్లర్ 400 XC కఠినమైన & అడ్వెంచర్ రెడీ డిజైన్ ఈ బండికి యునిక్ లుక్స్ ఇస్తోంది. పైగా.. తక్కువ నిర్వహణ ఖర్చు, మెరుగైన నిర్మాణ నాణ్యత & స్ట్రాంగ్ బాడీ, భద్రత కోసం అందించిన స్టాండర్డ్ యాక్సెసరీలు ఈ బైక్‌ను మరింత ప్రత్యేకంగా మార్చాయి.





















