అన్వేషించండి

ఒకే ఇంజిన్‌, ఒకే గేర్‌బాక్స్‌ - కానీ Kia Syros కంటే Kia Sonet ఎందుకు ఎక్కువ మైలేజ్‌ ఇస్తుంది?

ఒకే తరహా 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌, సేమ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఉన్నప్పటికీ... Kia Sonet వాస్తవ ప్రపంచ మైలేజ్‌లో Kia Syros ను ఓడించింది. కారణం ఏంటో తెలుసుకోండి.

Kia Syros vs Kia Sonet Mileage Review: కియా ఇండియా మార్కెట్‌లో రెండు డీజిల్‌ కంపాక్ట్‌ SUVలను విక్రయిస్తోంది, అవి - కియా సైరోస్‌ & కియా సోనెట్‌. ఈ రెండు మోడళ్లలో ఒకేలాంటి 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ (114 bhp, 250 Nm) & 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఉన్నాయి. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రెండింటికీ ARAI మైలేజ్‌ రేటింగ్‌ వేరు. సోనెట్‌ 18.6 కి.మీ./లీటర్‌ (Kia Sonet Diesel Mileage) ఇస్తే, సైరోస్‌ 17.65 కి.మీ./లీటర్‌కి (Kia Syros Diesel Mileage) మాత్రమే రేటింగ్‌ పొందింది.

ARAI రేటింగ్‌లో ఈ తేడా ఎందుకు?

సైరోస్‌ కొత్త మోడల్‌ అయినప్పటికీ, సోనెట్‌ కంటే దాదాపు 95 కిలోలు ఎక్కువ బరువు ఉంటుంది. సోనెట్‌తో పోలిస్తే సైరోస్‌ మైలేజ్‌ కొంచెం తక్కువగా నమోదు కావడానికి ఇదే ప్రధాన కారణం. మరోవైపు, సైరోస్‌ ఎక్కువ సౌకర్యాన్ని (ప్రత్యేకంగా వెనుక సీటు కంఫర్ట్‌) ప్రాధాన్యంగా చూసే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది.

రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ ఫలితాలు

నవీ ముంబై పరిసరాల్లో కియా సైరస్‌ & కియా సోనెట్‌ రెండింటినీ సమాన పరిస్థితుల్లో పరీక్షించారు. ఒక్కో వాహనంలో ఒక డ్రైవర్‌ మాత్రమే ఉండగా, ఎయిర్‌ కండిషనింగ్‌, ఆడియో సిస్టమ్‌, వైపర్స్‌ వంటి అన్ని సాధారణ ఫీచర్లు ఆన్‌లోనే ఉంచి టెస్ట్‌ చేశారు.

ఫలితాలు ఇలా వచ్చాయి:

సిటీ టెస్ట్‌లో: సోనెట్‌ డీజిల్‌ ఆటోమేటిక్‌ వేరియంట్‌ ఒక లీటర్‌తో సైరస్‌ కంటే 3 కి.మీ. ఎక్కువ దూరం ప్రయాణించింది.

హైవే టెస్ట్‌లో: ఇక్కడ కూడా సోనెట్‌ ముందంజలో నిలిచింది, ఈసారి 5.2 కి.మీ. తేడా.

మొత్తం కలిపి (సగటున) చూసుకుంటే, సోనెట్‌ రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ సైరస్‌ కంటే 4.1 కి.మీ./లీటర్‌ ఎక్కువగా నమోదైంది.

ఈ లెక్క ప్రకారం, కియా సోనెట్‌ తన 45 లీటర్ల ఫ్యూయల్‌ ట్యాంక్‌తో, సైరోస్‌ కంటే దాదాపు 185 కి.మీ. (45 x 4.1) ఎక్కువ దూరం ప్రయాణించగలదు. డీజిల్‌ వాహనం కొనుగోలు చేయదలచిన వారికి ఇది ఒక కీలక నిర్ణయాంశం.

టెస్టింగ్‌ విధానం

ఈ పరీక్షల్లో, ఎక్స్‌పర్ట్స్‌, కియా వాహనాల ట్యాంకులు పూర్తిగా నింపి, కంపెనీ సూచించిన టైర్‌ ప్రెజర్‌ పాటించి డ్రైవింగ్‌ చేశారు. నగర, హైవే మార్గాల్లో సగటు వేగంతో ప్రయాణం జరిగింది. సరైన లెక్క కోసం, మళ్లీ ఆయా కార్ల ట్యాంక్‌లను ఫుల్‌గా నింపి ఇంధన వినియోగాన్ని మరోమారు లెక్కించారు.

తేలిన విషయం

కియా సోనెట్‌ ARAI రేటింగ్‌ కంటే రియల్‌ వరల్డ్‌ మైలేజ్‌ సుమారు 2.3 కి.మీ. తక్కువగా ఉంది. కియా సైరోస్‌ విషయంలో తేడా మరింత ఎక్కువగా ఉంది, ఇది 5.45 కి.మీ. తక్కువగా వచ్చింది.

కియా సైరోస్‌ సౌకర్యం, ప్రీమియం ఫీల్‌ అందించడంలో ముందుంటే.. సోనెట్‌ మాత్రం మైలేజ్‌ పరంగా గెలిచింది. కాబట్టి ఎవరికి ఏ ప్రాధాన్యం ఉందో, ఆ ప్రకారం కారును కొనుగోలు చేయవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

కొత్త మారుతి కారు కొనాలనుకుంటున్నారా? వెంటనే బుక్ చేసుకోండి, మరోసారి ధరల పెంపు!
మారుతి సుజుకీ గట్టి షాక్‌ ఇవ్వబోతోంది, కొత్త కారు కొనేవాళ్ల జేబుకు చిల్లు!
నార్టన్ అట్లాస్ ఫస్ట్ రైడ్ - 585cc ట్విన్ ఇంజిన్, ప్రీమియం ఫీచర్లతో ఈ బండి మామూలుగా లేదుగా!
585cc నార్టన్ అట్లాస్ రివ్యూ - అడ్వెంచర్ టూరింగ్‌లో కింగ్‌ సైజ్‌, రైడింగ్ అనుభవం అదరహో!
India Public EV Charging Stations: ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరణకు కేంద్రం భారీ ప్లాన్! 52వేలకుపైగా స్టేషన్లు ఉన్నట్టు వివరణ!
ఈవీ ఛార్జింగ్ నెట్‌వర్క్ విస్తరణకు కేంద్రం భారీ ప్లాన్! 52వేలకుపైగా స్టేషన్లు ఉన్నట్టు వివరణ!
రాయల్‌ ఎన్‌ఫీల్డ్ రైడర్లకు బిగ్ అలర్ట్‌! 350సీసీ బైక్‌కు ఫ్రీగా గేర్ పొజిషన్ ఇండికేటర్‌! మీ బైక్‌కు వస్తుందో లేదో చెక్ చేయండి!
రాయల్‌ ఎన్‌ఫీల్డ్ రైడర్లకు బిగ్ అలర్ట్‌! 350సీసీ బైక్‌కు ఫ్రీగా గేర్ పొజిషన్ ఇండికేటర్‌! మీ బైక్‌కు వస్తుందో లేదో చెక్ చేయండి!

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
TDP YSRCP Political Row: అమరరాజా గిగా పోరు - తెలంగాణ సిగలో రత్నం.. ఏపీ రాజకీయాల్లో పెట్టుబడుల చిచ్చు!
అమరరాజా గిగా పోరు - తెలంగాణ సిగలో రత్నం.. ఏపీ రాజకీయాల్లో పెట్టుబడుల చిచ్చు!
US Iran Conflict: టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
టెహ్రాన్‌పై విరుచుకుపడుతున్న అమెరికా ఆర్మీ.. కువైట్, జోర్డాన్, బహ్రెయిన్‌లపై ఇరాన్‌ ప్రతీకారం
Rahul Gandhi Protest: ప్రధానమంత్రి నివాసానికి రాహుల్, ప్రియాంక ఎలా దూసుకొచ్చారు? వారిని మార్గమధ్యలోనే ఎందుకు అడ్డుకోలేదు?
ప్రధానమంత్రి నివాసానికి రాహుల్, ప్రియాంక ఎలా దూసుకొచ్చారు? వారిని మార్గమధ్యలోనే ఎందుకు అడ్డుకోలేదు?
AP, Telangana Rains Alert: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. రైతులకు ఉపశమనం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. రైతులకు ఉపశమనం, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Embed widget