Kia Clavis SUV: టెస్టింగ్‌లో కనిపించిన కియా క్లావిస్ - లాంచ్ త్వరలోనే!
Kia New Car: ప్రముఖ కార్ల బ్రాండ్ కియా క్లావిస్ అనే కారును త్వరలో మనదేశంలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఈ కారు ఇటీవలే టెస్టింగ్‌లో కనిపించింది.
Kia Clavis SUV: కియా త్వరలో లాంచ్ చేయనున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ క్లావిస్ మొదటిసారి కొరియాలో టెస్టింగ్‌లో కనిపించింది. ఈ ఎస్‌యూవీ కంపెనీ లైనప్‌లో సోనెట్, సెల్టోస్ మధ్య ఉండనుంది. స్పై షాట్‌లు క్లావిస్ ప్రత్యేకమైన డిజైన్‌తో కాంపాక్ట్ ఎస్‌యూవీ డిజైన్‌ను పొందుతుందని నిర్ధారిస్తుంది.
డిజైన్ ఎలా?
కనిపించే క్లెవిస్ స్లాబ్ సైడెడ్ డోర్‌తో కూడిన పెద్ద గ్లాస్‌హౌస్‌తో రానుంది. చాలా వరకు కారు హైడ్ అయినప్పటికీ క్లావిస్ విదేశాలలో సేల్‌కు అందుబాటులోనే ఉంది. పెద్ద యంగ్ సోల్ క్రాస్‌ఓవర్‌ను పోలి ఉందని ఫొటోల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ టెస్టింగ్ మోడల్ భారతదేశంలో లాంచ్ అయిన వాహనం, ఎంఆర్ఎఫ్ టైర్లను కలిగి ఉంది.
క్లావిస్ యొక్క ప్రధాన సిల్హౌట్‌ను గమనిస్తే కియా సోల్ క్రాస్‌ఓవర్‌ను పోలి ఉంటుందని తెలుస్తోంది. ఇది కొత్త కియా మోడల్‌కు అనేక డిజైన్ ఎలిమెంట్‌లను రివీల్ చేస్తుందని నిశితంగా గమనిస్తే తెలుస్తుంది. ఈ ఎస్‌యూవీ విభిన్నమైన వర్టికల్ ల్యాంప్ సిగ్నేచర్‌తో కూడిన నిలువు హెడ్‌ల్యాంప్‌లను పొందుతుంది. వెనుక డిజైన్ వర్టికల్ టెయిల్ ల్యాంప్‌లు, హారిజంటల్ లైట్ బార్‌తో పెద్ద కియా ఈవీ9 ఎస్‌యూవీని పోలి ఉంటుంది.
కియా క్లావిస్ ఫీచర్లు ఇలా...
స్పై షాట్‌లలో కనిపించే మోడల్ భారతదేశంలో లాంచ్ చేయనున్న మోడల్ అని చెప్పవచ్చు. ఈ ఫొటోల్లో కూల్డ్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా సెటప్, పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, కొన్ని ఇతర సౌకర్యాల ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే క్లావిస్‌కి ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, నాలుగు చక్రాల డిస్క్ బ్రేక్‌లు లభిస్తాయి. ఏడీఏఎస్ అధిక వేరియంట్‌ల్లో కూడా అందుబాటులో ఉంటుంది.
కియా క్లావిస్‌లో ఏం పొందుతారు?
వినిపిస్తున్న కథనాల ప్రకారం కియా క్లావిస్ భారతదేశంలో 2024 చివరి నాటికి లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది 2025 ప్రారంభంలో లాంచ్ కానుంది. ఇందులో మరిన్ని ఇంజిన్ ఆప్షన్లను పొందగలదని భావిస్తున్నారు. ఐసీఈ, ఈవీ, హైబ్రిడ్ ఇంజిన్లతో ఈ కారు రానుందని తెలుస్తోంది. క్లావిస్ ఈవీ కూడా ఐసీఈ మోడల్ లాగా అదే ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. కియా ఇండియా సంవత్సరానికి సుమారు లక్ష యూనిట్ల క్లావిస్‌ను ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది. అందులో 80 శాతం ఐసీఈ శ్రేణిలో ఉంటుంది.
మరోవైపు గతేడాది ఏప్రిల్‌లో మనదేశంలో లాంచ్ అయిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ క్రాస్ఓవర్ ఎస్‌యూవీ విక్రయాల గురించి కంపెనీ సమాచారం ఇచ్చింది. ఈ కారు ఇప్పటికే లక్ష యూనిట్ల బుకింగ్స్‌ను దాటేసింది. కేవలం తొమ్మిది నెలల్లోనే ఎస్‌యూవీ భారత దేశ మార్కెట్లో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న కారుగా నిలిచింది. గ్రాండ్ విటారా కంటే ఫ్రాంక్స్ ఎస్‌యూవీ రెండు అడుగులు ముందుండటం విశేషం. ఎస్‌యూవీ విభాగంలో కంపెనీ వాటా 2022లో 10.4 శాతం ఉండగా, 2023లో 19.7 శాతానికి పెరిగింది. ఈ సేల్స్‌ను దాదాపుగా రెట్టింపు చేయడంలో ఫ్రాంక్స్ కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు.
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!