Kia Clavis: కియా మైక్రో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ త్వరలో - బడ్జెట్ ధరలో మంచి కారు!
Kia New Car: కియా మైక్రో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ క్లావిస్ త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది.
Kia Clavis SUV: కియా మోటార్స్ భారతీయ మార్కెట్ కోసం ఒక అద్భుతమైన విజన్‌ని వెల్లడించింది. సెల్టోస్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ విజయాన్ని చూసిన కంపెనీ ఇటీవల మిడ్ లైఫ్ అప్‌డేట్‌ను ఇచ్చింది. దీని తర్వాత 2024 జనవరిలో సోనెట్ ఫేస్‌లిఫ్ట్ షోరూమ్‌లకు చేరుకుంటుంది. ఇది కాకుండా హ్యుందాయ్ ఎక్స్‌టర్ వంటి మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ వాహనం కూడా లాంచ్ కానుంది. కంపెనీ ఇటీవలే భారతదేశంలో 'కియా క్లావిస్' పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. దీనిని కంపెనీ రాబోయే ఎలక్ట్రిక్ మైక్రో ఎస్‌యూవీ కోసం ఉపయోగించవచ్చు.
డీజిల్ ఇంజిన్ కూడా...
మీడియా నివేదికల ప్రకారం కియా సాంప్రదాయ డీజిల్ ఇంజిన్‌కు తర్వాతి వెర్షన్‌గా కొత్త హైబ్రిడ్ టెక్నాలజీని లాంచ్ చేయనున్నట్లు సూచిస్తుంది. బ్రాండ్‌కు సంబంధించిన మొత్తం అమ్మకాలలో 40 శాతం వాటా కలిగిన డీజిల్ వాహనాలకు డిమాండ్ పెరగడంతో కియా డీజిల్ మోడళ్లను పరిచయం చేయడానికి కట్టుబడి ఉంది.
ప్రపంచవ్యాప్తంగా దక్షిణ కొరియా ఆటోమేకర్ ఇప్పటికే హైబ్రిడ్ సెగ్మెంట్‌లో కే8 సెడాన్, నిరో క్రాస్ఓవర్, కార్నివాల్ ఎంపీవీ, సోరెంటో, స్పోర్టేజ్ ఎస్‌యూవీల వంటి హైబ్రిడ్ వాహనాలతో బలమైన ఉనికిని కలిగి ఉంది. ఈ వాహనాలు 1.6 లీటర్ డైరెక్ట్ ఇంజక్షన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతాయి. ఇది కాంపాక్ట్ బ్యాటరీతో కూడిన ఎలక్ట్రిక్ మోటార్‌తో పెయిర్ కానుంది.
కియా తన బలమైన హైబ్రిడ్ టెక్నాలజీని భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. లోకలైజేషన్ ద్వారా ధరను తగ్గించడం అనేది దీనిపై దృష్టి సారించడానికి ఒక ముఖ్యమైన కారణం. కియా భారతదేశంలో బలమైన హైబ్రిడ్ టెక్నాలజీతో సెల్టోస్, కారెన్స్, కొత్త సబ్ 4 మీటర్ మోడల్‌ను లాంచ్ చేయనున్నట్లు మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.
కియా క్లావిస్ ఇలా...
భారతదేశంలో కియా మొట్టమొదటి మోడల్ అయిన క్లావిస్ (ఏవై అనే కోడ్ నేమ్)తో కియా హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్‌ను అందించాలని భావిస్తున్నారు. కియా సెల్టోస్ లాగానే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో కూడిన ఈ ఎలక్ట్రిక్ మైక్రో ఎస్‌యూవీ కూడా వార్తల్లో ఉంటుందని భావిస్తున్నారు. కియా సోల్ డిజైన్ నుంచి ప్రేరణ పొంది కియా క్లావిస్ విలక్షణమైన పొడవైన, బాక్సీ స్టాన్స్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
మరోవైపు కియా అప్‌డేట్ చేసిన సోనెట్‌ను 2024 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందని, ఆ తర్వాత కొత్త తరం కియా కార్నివాల్, కియా ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేయనున్నట్లు అధికారికంగా తెలిపింది. కొత్త సోనెట్ కోసం బుకింగ్ విండో డిసెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభం అయింది. కస్టమర్లు రూ. 25,000 టోకెన్ అమౌంట్ చెల్లించి దీన్ని బుక్ చేసుకోవచ్చు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!