(Source: ECI | ABP NEWS)
రెట్రో లుక్‌లో మాన్‌స్టర్ పవర్ - Kawasaki Z900RS 2026లో కొత్త అప్‌డేట్స్
2026 Kawasaki Z900RS కొత్త అప్‌డేట్స్‌తో వచ్చింది. 948cc ఇంజిన్, IMU ఆధారిత ఎలక్ట్రానిక్స్, క్విక్ షిఫ్టర్, క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఇందులో ప్రత్యేకం.

Updated Kawasaki Z900RS Unveiled: బైక్ లవర్స్ కోసం కవాసకి మరోసారి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. 2026 మోడల్‌గా Kawasaki Z900RS అప్‌డేట్ వెర్షన్‌ను ఆవిష్కరించింది. ఈ బైక్ క్లాసిక్ Z1 లుక్‌ను కొనసాగిస్తూ, మోడరన్ టెక్నాలజీతో మరింత పవర్‌ఫుల్‌గా మారింది.
ఇంజిన్ & పెర్పార్మెన్స్ - 948cc మాన్‌స్టర్ పవర్
Z900RSలో, ప్రస్తుతం ఉన్న అదే 948cc ఇన్‌లైన్-ఫోర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ కొనసాగుతుంది. అయితే 2026 అప్‌డేటెడ్ వెర్షన్‌లో ఎలక్ట్రానిక్ థ్రోటిల్ వాల్వ్స్‌ను కవాసకి జోడించింది. ప్రతి గేర్‌లో రీవైజ్డ్ గేర్ రేషియోలు ఇచ్చి రైడింగ్ ఫీలింగ్‌ను మరింత స్మూత్‌గా చేసింది. ఇప్పుడు ఈ ఇంజిన్ 116hp (9,300rpm) పవర్, 98Nm (7,700rpm) టార్క్ ఇస్తుంది. పాత మోడల్‌తో పోలిస్తే 5hp ఎక్కువ శక్తి. అంటే, యాక్సిలరేషన్ మరింత షార్ప్, రోడ్‌పై కిక్ మరింత బలంగా ఉంటుంది.
ఎగ్జాస్ట్ సౌండ్ - క్లాసిక్ టోన్‌కి రిఫైన్ టచ్
Z900RSలో ఉన్న మెగాఫోన్-స్టైల్ ఎగ్జాస్ట్‌ను కవాసకి మళ్లీ డిజైన్ చేసింది. హెడర్ పైప్స్ కొత్త ఆకారంలో ఉండటం వల్ల సౌండ్ మరింత రిఫైన్డ్‌గా, బాస్ టోన్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ సౌండ్‌నే ఈ బైక్ ఐడెంటిటీగా భావించే ఫ్యాన్స్‌కి ఇది మంచి అప్‌డేట్.
ఎలక్ట్రానిక్స్ - IMU ఆధారిత స్మార్ట్ సేఫ్టీ సిస్టమ్
కొత్తగా IMU (Inertial Measurement Unit) ఆధారంగా పని చేసే ఎలక్ట్రానిక్స్ ప్యాక్ ఈ బైక్‌లో ప్రధాన ఆకర్షణ. ఇందులో Kawasaki Cornering Management Function (KCMF) ఉంది, ఇది మలుపుల్లో బైక్‌ను స్థిరంగా ఉంచుతుంది. అదే విధంగా బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, క్రూజ్ కంట్రోల్ ఇప్పుడు స్టాండర్డ్‌గా వస్తున్నాయి. అంటే, దీర్ఘ రైడ్స్‌లో కూడా ఫ్యాటిగ్ లేకుండా ప్రయాణించవచ్చు.
సస్పెన్షన్ & బ్రేకింగ్ - ప్రీమియం ఫీల్
సస్పెన్షన్ సెటప్‌లో 41mm USD ఫోర్క్స్ ముందు భాగంలో, మోనోషాక్ వెనుక భాగంలో ఉన్నాయి. బ్రేకింగ్ సెటప్‌లో 300mm ట్విన్ డిస్కులు ముందు, 250mm డిస్క్ వెనుక ఉన్నాయి.
SE వెర్షన్‌లో మాత్రం ఇది మరింత ప్రీమియమ్ స్థాయిలో ఉంటుంది – Brembo కాలిపర్స్, స్టీల్-బ్రేడెడ్ బ్రేక్‌లైన్స్, Öhlins S46 రియర్ షాక్ వంటివి ఉన్నాయి. ఇది రైడింగ్ ఫీల్‌కి గల్జరీ టచ్ ఇస్తుంది.
డిజైన్ & కలర్ ఆప్షన్స్
క్లాసిక్ Z1B స్పూర్తితో రూపొందించిన Candy Tone Red కలర్‌లో స్టాండర్డ్ వెర్షన్‌గా వస్తుంది. SE వెర్షన్‌లో మాత్రం Metallic Spark Black కలర్‌కి ఆరెంజ్ ఫ్యూయల్ ట్యాంక్ కలిపి ఆకర్షణీయంగా డిజైన్ చేశారు. మొత్తానికి ఇది పాత స్కూల్ డిజైన్‌కి కొత్త టెక్ ఫ్యూజన్.
ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతుంది?
2026 Kawasaki Z900RS యూరప్ మార్కెట్‌లో ఇప్పటికే ఆవిష్కరించారు, ధరను ఇంకా ప్రకటించలేదు. అయితే ఇండియన్ బైక్ ప్రియుల కోసం ఇది త్వరలోనే మన దేశంలోకి రాబోతోందని అంచనా.
Kawasaki Z900RS అంటే క్లాసిక్ లుక్, మోడరన్ టెక్నాలజీ కలయిక. బలమైన ఇంజిన్, స్మార్ట్ ఎలక్ట్రానిక్స్, ప్రీమియం హ్యాండ్లింగ్ - ఇవన్నీ కలిపి ఈ బైక్‌ని నిజమైన “మోడరన్ రెట్రో మాన్‌స్టర్”గా మార్చాయి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















