(Source: ECI | ABP NEWS)
యూత్ కోసం రోడ్ రాకెట్ - Bajaj Pulsar NS400Z లో 5 కీలక హైలైట్స్, కొనే ముందు తప్పక చదవండి!
బజాజ్ పల్సర్ NS400Z కొనే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన 5 విషయాలు - ఇంజిన్, ABS మోడ్స్, బరువు, సీటు ఎత్తు, ధర. ఆ వివరాలను ఇక్కడ చదవండి.

Bajaj Pulsar NS400Z Price Specifications: బజాజ్ పల్సర్ అంటే యువతలో ఒక క్రేజ్. ఇప్పుడు ఆ క్రేజ్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్తూ వచ్చిన బైక్ - Bajaj Pulsar NS400Z. పవర్, ప్రైస్, పెర్ఫార్మెన్స్ అన్నీ కలిపితే ఈ బైక్. ఇది రోడ్‌పై ఒక మాన్‌స్టర్‌లా పరుగులు తీస్తుంది. అయితే, మీరు Bajaj Pulsar NS400Z కొనే ముందు ఈ 5 విషయాలు (ఇంజిన్, ABS మోడ్స్, బరువు, సీటు ఎత్తు, ధర) తప్పక తెలుసుకోవాలి.
1. ఇంజిన్ - డామినార్ నుంచి తీసుకున్న శక్తిమంతమైన హార్ట్
పల్సర్ NS400Zలో 373cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది Dominar 400 నుంచి తీసుకున్నదే. తాజా అప్‌డేట్‌తో ఈ ఇంజిన్ ఇప్పుడు 43hp పవర్ (9,000rpm), 35Nm టార్క్ (7,500rpm) ఇస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్ కూడా ఉంది. అంటే.. గేర్ మార్చడం చాలా కామ్‌గా, ఎక్సైటింగ్‌గా & రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ వెన్న మీద జారిపోతున్నంత స్మూత్‌గా ఉంటుంది.
2. సేఫ్టీ ఫీచర్లు - మూడు ABS మోడ్స్
రైడర్ & కోరైడర్ సేఫ్టీ విషయంలో కూడా బజాజ్ ఎటువంటి రాజీ పడలేదు. NS400Zలో డ్యూయల్ చానెల్ ABS స్టాండర్డ్‌గా వస్తుంది, అంటే బేస్ మోడల్ నుంచే డ్యూయల్ చానెల్ ABS అందుబాటులో ఉంటుంది. రైడింగ్ కండిషన్ ఆధారంగా Road, Rain, Off-road అనే మూడు మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. అదనంగా, మార్చుకోగల ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. అంటే, ఏ పరిస్థితిలో అయినా కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంటుంది.
3. బరువు - పవర్ టు వెయిట్ రేషియో క్లాస్‌లో బెస్ట్
Bajaj Pulsar NS400Z బైక్ కర్బ్ వెయిట్ 174kg మాత్రమే. ఇంత తేలికగా ఉండి ఇంత శక్తి ఇవ్వడం వల్ల, ఈ సెగ్మెంట్‌లో ₹2 లక్షల లోపు (ఎక్స్-షోరూమ్) బైక్స్‌లో బెస్ట్ పవర్ టు వెయిట్ రేషియో కలిగినదిగా పేరు తెచ్చుకుంది. నగరాల్లో, హైవేల్లో - ఎక్కడైనా దీనితో రైడ్ అంటే ఫన్ కచ్చితంగా వస్తుంది.
4. సీటు ఎత్తు - ఎవరైనా సులభంగా హ్యాండిల్ చేయగల బైక్
బజాజ్ పల్సర్ NS400Z సీటు ఎత్తు 807mm మాత్రమే. అంటే ఓ మోస్తరు ఎత్తు ఉన్న రైడర్‌కు కూడా ఇది కంఫర్ట్‌గా ఉంటుంది. ట్రాఫిక్‌లో కూడా బైక్ హ్యాండ్లింగ్ ఈజీగా ఉంటుంది. కంఫర్ట్, కంట్రోల్ రెండూ సమానంగా ఉంటాయి.
5. ధర - విలువకు తగిన ధర
ప్రస్తుతం, తెలుగు రాష్ట్రాల్లో బజాజ్ పల్సర్ NS400Z ₹1.93 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులో ఉంది. GST రీ-స్ట్రక్చరింగ్ తర్వాత కూడా ఈ బండి ధరను కంపెనీ పెంచలేదు. అంటే ఈ ప్రైస్ రేంజ్‌లో ఇంత పవర్‌ఫుల్ బైక్ దొరకడం కష్టం. హైదరాబాద్, విజయవాడ లాంటి తెలుగు నగరాల్లో షోరూమ్ ఆన్-రోడ్ ధరలు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ ఆధారంగా మారుతాయి.
పవర్, ప్రెజెన్స్, ప్రైస్ - ఈ మూడింటినీ సమపాళ్లలో కలిపిన బైక్ Pulsar NS400Z. రోడ్‌పై ఈ బైక్ చూపించే దూకుడు మీ మనసు దోచేస్తుంది. మొదటి బైక్‌గా కొనేవారికైనా, అప్‌గ్రేడ్ చేయాలనుకునేవారికైనా ఇది ఒక "పవర్ ప్యాక్" ఆప్షన్. అయితే కొనేముందు తప్పక టెస్ట్ రైడ్ తీసుకోండి.





















