కొత్త GST తర్వాత Kawasaki KLX230 మీద భారీ డిస్కౌంట్ - ఇప్పుడు కేవలం రూ 1.84 లక్షలకే!
Kawasaki KLX230 బైక్ ధర భారీగా తగ్గింది. ఇప్పుడు ఎక్స్ షోరూమ్ ధర రూ 1.84 లక్షలు మాత్రమే. శక్తిమంతమైన 233 సిసి ఇంజిన్ తో హీరో ఎక్స్‌పల్స్ 210 కు టఫ్ పోటీగా లాంచ్ అయింది.

Kawasaki KLX230 New GST Price Cut: అడ్వంచర్ బైకర్స్ కోసం గుడ్ న్యూస్. కావాసాకి, తన KLX230 డ్యుయల్ స్పోర్ట్ బైక్ ధరను గణనీయంగా తగ్గించింది. గతంలో 3.30 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ అయిన ఈ బైక్ ఇప్పుడు కేవలం రూ. 1.84 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులోకి వచ్చింది. ఈ భారీ ధర తగ్గింపుతో - Hero Xpulse 210, KTM 250 Adventure, Suzuki V-Strom 250 బైక్‌లకు టఫ్ కాంపిటీషన్ ఇవ్వబోతుంది.
ఇంజిన్ & పనితీరు
Kawasaki KLX230 లో 233 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 18.1 bhp పవర్, 18.3 Nm టార్క్ ఇస్తుంది. ఈ ఇంజిన్ సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఆఫ్-రోడింగ్ చేయాలనుకునే యువత కోసం ఈ బైక్ బాగా సూటవుతుంది.
డిజైన్ & కంఫర్ట్
KLX230 డిజైన్ పూర్తిగా యుటిలిటేరియన్ స్టైల్‌లో ఉంది. హై-సెట్ ఫ్రంట్ ఫెండర్, మినిమలిస్ట్ ఫెయరింగ్, కాంపాక్ట్ టెయిల్ సెక్షన్‌తో ఈ బైక్ అడ్వెంచర్ లుక్ ఇస్తుంది. లాంగ్ & ఫ్లాట్ సీట్ ఉండటం వల్ల రైడర్ సులభంగా వెయిట్ షిఫ్ట్ చేయగలడు. 880 mm సీట్ హైట్, 139 కిలోల కర్బ్ వెయిట్‌తో ఇది యూత్‌కి మరింత సౌకర్యం కలిగిస్తుంది.
సస్పెన్షన్ & బ్రేకింగ్
Kawasaki KLX230 లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, లింక్డ్ మోనోషాక్ రియర్ సస్పెన్షన్ ఉన్నాయి. డిస్క్ బ్రేకులు రెండు వైపులా ఉండటంతో స్టాపింగ్ పవర్ కూడా బలంగా ఉంటుంది. అదనంగా 21 అంగుళాల ఫ్రంట్, 18 అంగుళాల రియర్ వైర్-స్పోక్డ్ వీల్స్‌తో ఇది మరింత ఆఫ్-రోడ్ ఫ్రెండ్లీగా మారింది.
గ్రాఫిక్స్ & ఫీచర్లు
కొత్తగా రిఫ్రెష్ చేసిన బాడీ గ్రాఫిక్స్‌తో Kawasaki KLX230 మరింత స్టైలిష్‌గా కనిపిస్తోంది. సింగిల్ ఛానల్ ABS సిస్టమ్ ఉండటం వల్ల యువ రైడర్స్‌కి మరింత కంట్రోల్ ఇస్తుంది. కావాసాకి, ఈ మోటార్ సైకిల్‌ను రెండు కలర్ ఆప్షన్స్‌లో అందిస్తోంది.
KLX230R S వెర్షన్
ట్రయల్ మిషన్‌గా ప్రత్యేకంగా డిజైన్ చేసిన KLX230R S ను మాత్రం సాధారణ రోట్లపై తిప్పడానికి వీల్లేదు (not road-legal). ఈ బండి లైమ్ గ్రీన్ కలర్‌లో మాత్రమే లభిస్తుంది. 270 mm గ్రౌండ్ క్లియరెన్స్, 900 mm సీట్ హైట్ ఉండటం వల్ల హార్డ్‌కోర్ ఆఫ్-రోడర్స్‌కి ఇది సూపర్ బైక్.
యువతకు మంచి ఛాయిస్
ధర తగ్గింపుతో Kawasaki KLX230 ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన డీల్ అవుతుంది. అడ్వెంచర్ రైడింగ్ అంటే ఇష్టపడే యువతకు ఇది బెస్ట్ ఆప్షన్. ప్రాక్టికల్‌గా, శక్తిమంతమైన ఇంజిన్‌తో ఈ బైక్ Hero Xpulse 210 కి డైరెక్ట్ రైవల్‌గా నిలవబోతోంది.





















