Jeep New SUV: కాంపాక్ట్ ఎస్‌యూవీపై వర్క్ చేస్తున్న జీప్ - క్రెటా, సెల్టోస్‌తో పోటీ!
Jeep SUV: ప్రముఖ కార్ల కంపెనీ జీప్ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీపై పని చేస్తుందని తెలుస్తోంది.
Jeep Compact SUV: జీప్ ఇండియా కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీపై పని చేస్తుంది. ఇది కంపెనీ పోర్ట్‌ఫోలియోలో మిడ్ సైజ్ ఎస్‌యూవీ కంపాస్ కంటే కాస్త కింది స్థాయిలో ఉంటుంది. కొత్త ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోని హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్ వంటి ఇతర కార్లతో పోటీపడుతుంది. దీన్ని సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్‌ను రూపొందించిన స్టెల్లాంటిస్ సీఎం ప్లాట్‌ఫారమ్‌పైనే రూపొందించారు.
సిట్రోయెన్ ప్లాట్‌ఫారమ్‌పై...
అమెరికన్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్‌తో కలిసి జీప్ కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోకి ప్రవేశించవచ్చని వార్తలు వస్తున్నాయి. వారి లోకలైజ్డ్ సీఎంపీ (కామన్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్) జీప్ దాని ఎస్‌యూవీని తక్కువ ధరకు లాంచ్ చేయడానికి సహాయపడుతుంది. ఈ ప్లాట్‌ఫారమ్ 5, 7 సీటర్ ఆప్షన్లకు అనుగుణంగా మరింత పెద్దదిగా ఉంటుంది. రాబోయే ఎస్‌యూవీ ఆర్కిటెక్చర్‌ను సిట్రోయెన్‌తో షేర్ చేసుకోనున్నారు. అయితే జీప్ ఎస్‌యూవీ పూర్తిగా కొత్త డిజైన్‌తో రానుంది.
అనేక ఫీచర్లతో...
2025లో సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్‌కు పెద్ద అప్‌డేట్ చేయనుందని వార్తలు వస్తున్నాయి. అప్‌డేట్ అయిన మోడల్ మెరుగైన నాణ్యమైన మెటీరియల్స్, మరిన్ని ఫీచర్లు ఉన్న ఇంటీరియర్‌లను పొందుతుంది. జీప్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రీమియం మోడల్‌గా వస్తుంది. మరింత ప్రీమియం, ఫీచర్ లోడెడ్ క్యాబిన్‌తో తీసుకురానున్నారు.
జీప్ కాంపాక్ట్ ఎస్‌యూవీ 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుందని భావిస్తున్నారు. ఇది సీ3 ఎయిర్‌క్రాస్‌కు పవర్‌ని ఇస్తుంది. ఈ ఇంజన్ 109 బీహెచ్‌పీ వరకు పవర్‌ని, 205 ఎన్ఎం వరకు పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఉన్నాయి.
లాంచ్ ఎప్పుడు?
కొత్త జీప్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కచ్చితమైన లాంచ్ టైమ్‌లైన్ వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే ఈ కొత్త ఎస్‌యూవీ 2025-26 నాటికి లాంచ్ కానుందని భావిస్తున్నారు. దీని ధర రూ. 15 లక్షల నుంచి రూ. 18 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది కంపాస్ (రూ. 20.69 లక్షల నుంచి రూ. 32.27 లక్షల మధ్య) కంటే చాలా చవకైన ఆప్షన్.