అన్వేషించండి

జావా కొత్త బైక్ 42 All stars లాంచ్‌.. 60కి పైగా మార్పులు, కొత్త డిజైన్ - ధర ఎంతంటే?

జావా 42 ఆల్ స్టార్స్ బైక్ భారత మార్కెట్లోకి లాంచ్‌ అయింది. ఈ బైక్‌లో 60కి పైగా మార్పులు, కొత్త డిజైన్ ఉన్నాయి.

Jawa 42 All stars Price And Specifications Telugu: జావా కంపెనీ, Jawa 42 మోటార్‌ సైకిల్‌లో భారీ మార్పులు చేసింది. కొత్త '42 ఆల్ స్టార్స్' వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ బైక్‌లో 60కి పైగా మార్పులు చేసినట్లు కంపెనీ తెలిపింది. డిజైన్ నుంచి చాసిస్ వరకు అనేక అప్‌డేట్స్ ఇచ్చింది. జావా 42 ఆల్ స్టార్స్ ప్రారంభ ధర రూ.1.80 లక్షలు (ఎక్స్-షోరూమ్). వేరియంట్‌ను బట్టి ధర రూ.1.90 లక్షల వరకు ఉంటుంది. ఈ బైక్ డెలివరీలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్నాయి.

కొత్త లుక్‌లో జావా 42

కొత్త జావా 42లో డిజైన్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. సైడ్ ప్యానెల్స్‌ను రీడిజైన్ చేశారు. వెనుక ఫెండర్‌ను వెడల్పుగా మార్చారు. కొత్త అల్లాయ్ వీల్స్ ఇచ్చారు. అప్‌స్వెప్ట్ ట్విన్ ఎగ్జాస్ట్‌ను కూడా అందించారు.

వెనుక టైర్ పరిమాణాన్ని కూడా పెంచారు. ఇప్పుడు 150/70-17 వెడల్పాటి వెనుక టైర్‌ను ఉపయోగించారు. దీంతో బైక్‌కు మరింత బ్రాడర్‌ లుక్ వచ్చింది. రోడ్డుపై గ్రిప్ కూడా మెరుగుపడే అవకాశం ఉంది.

సీటులోనూ మార్పులు చేశారు. అదనపు కుషనింగ్ ఇచ్చారు. అయితే జావా 42కు ప్రత్యేకమైన ఫ్లాట్ బెంచ్ తరహా సీటు డిజైన్‌ను కొనసాగించారు.

రౌండ్ హెడ్‌ల్యాంప్ & 13.2 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ వంటి పాత డిజైన్ అంశాలను అలాగే ఉంచారు. కొత్త ఎగ్జాస్ట్ డిజైన్ వల్ల నీటిలో బైక్ నడిపే సామర్థ్యం కూడా మెరుగుపడుతుందని జావా చెబుతోంది.

చాసిస్‌లోనూ అప్‌డేట్స్

జావా 42 ఆల్ స్టార్స్‌లో కేవలం లుక్ మాత్రమే మార్చలేదు. ఫ్రేమ్ & స్వింగ్‌ఆర్మ్ స్టిఫ్‌నెస్‌లో కూడా మార్పులు చేశారు. బైక్ బరువు పంపిణీ, రైడింగ్ పొజిషన్, హ్యాండ్లింగ్ & కంఫర్ట్‌పై కూడా పని చేశారు. ఈ మార్పులతో బైక్ మరింత చురుగ్గా, నియంత్రణలో ఉండేలా తయారైందని కంపెనీ చెబుతోంది. అదే సమయంలో కొత్త రైడర్లకు కూడా సులభంగా ఉండే స్వభావాన్ని కొనసాగించింది.

ఇది కూడా చదవండి: బైక్‌ మోడిఫికేషన్స్‌.. మన దేశంలో ఏవి చట్టబద్ధం? ఏవి నిషేధం? ఇలా చేస్తే ఫైన్ తప్పదు!

బ్రేకింగ్ & సస్పెన్షన్

బైక్‌లో ముందు 280 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ ఉంది. వెనుక 240 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్ ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్‌గా అందించారు.

ముందు భాగంలో 35 మిల్లీమీటర్ల టెలిస్కోపిక్ ఫోర్క్స్ ఉన్నాయి. వెనుక గ్యాస్ ఫిల్డ్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. వీటిలో ప్రీలోడ్ అడ్జస్ట్‌మెంట్ సదుపాయం ఉంది.

బైక్ మొత్తం బరువు 175 కిలోలు. వీల్‌బేస్ 1,369 మిల్లీమీటర్లు. గ్రౌండ్ క్లియరెన్స్ 173 మిల్లీమీటర్లు.

ఇంజిన్‌లో మార్పుల్లేవు

కొత్త జావా 42 ఆల్ స్టార్స్‌లో అదే 294.72cc ఇంజిన్ కొనసాగించారు. ఇది సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, DOHC ఇంజిన్. దీనికి 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఈ ఇంజిన్ 7,950 rpm వద్ద 27.19hp పవర్ అందిస్తుంది. 6,000 rpm వద్ద 26.3Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇది కూడా చదవండి: ఇండియాలో కార్ మోడిఫికేషన్స్‌పై రూల్స్ ఇవే.. ఏవి చట్టబద్ధం? ఏవి నేరం?

ధర ఎంతంటే?

జావా 42 ఆల్ స్టార్స్ మొత్తం ఆరు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. బ్లాక్ & ఐవరీ కలర్ వేరియంట్ ధర రూ.1.80 లక్షలు. ఆల్ స్టార్స్ బ్లాక్ & నెబ్యులా బ్లూ వేరియంట్ల ధర రూ.1.90 లక్షలు. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు.

జావా 42 ఆల్ స్టార్స్‌తో కంపెనీ తన ఆల్ స్టార్స్ సిరీస్‌ను పూర్తి చేసింది. ఇప్పటికే 42 FJ & 42 Bobber మోడళ్లు ఈ సిరీస్‌లో ఉన్నాయి. కొత్త 42 All Stars ఈ కుటుంబంలో ఫ్లాగ్‌షిప్ మోడల్‌గా నిలిచింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

EV Charger: ఎలక్ట్రిక్ కారు ఛార్జింగ్‌కు ఎంత కెపాసిటీ ఛార్జర్ కావాలి? కొనేముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
ఇంట్లోనే EV ఛార్జర్... 3.3 kW, 7.2 kW, 11 kWలో మీ కారుకు ఏది సరిపోతుందో తెలుసుకోండి
Denza D9: లగ్జరీ కారుకి కొత్త అర్థం.. 7 సీట్లు, మసాజ్ ఫీచర్‌, 730 కి.మీ. రేంజ్‌తో వచ్చిన 'డెంజా D9'
కదిలే స్టార్‌ హోటల్‌ లాంటి Denza D9.. ఈ కారు మీ దగ్గరుంటే ప్రతి ఒక్కరి కళ్లూ మీ మీదే!
Car Brands: మన రోడ్లపై కనిపించే కార్ల బ్రాండ్లు ఏ దేశానివి? మారుతి నుంచి బీఎండబ్ల్యూ వరకు పూర్తి వివరాలు
భారత్‌లో తిరిగే కార్లన్నీ మన దేశానికి చెందినవి కావు.. ఏ కారు ఏ దేశానిదో తెలుసా?
Bajaj Pulsar N250 SS ఫస్ట్ రైడ్ రివ్యూ: పవర్, టెక్నాలజీ.. కొత్త అప్‌డేట్స్‌తో ఈ బండి మరింత స్పెషల్!
పాత పల్సర్‌కు కొత్త హంగులు.. కొత్త పల్సర్‌ N250 SSలో వచ్చిన 5 కీలక మార్పులేవో మీకు తెలుసా?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Candidates: ఏపీలో రెండోదశ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్థానాలు, అభ్యర్థులు ఖరారు
ఏపీలో రెండోదశ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్థానాలు, అభ్యర్థులు ఖరారు
AP Panchayat Elections 2026 : ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 50 లక్షల నజరానా.. అధికార పార్టీ రాజకీయానికా, గ్రామాల అభివృద్ధికా?
ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 50 లక్షల నజరానా.. అధికార పార్టీ రాజకీయానికా, గ్రామాల అభివృద్ధికా?
Telangana Phone Tapping Case: త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
Viral News: అతడికి 31.. ఆమెకు 61 - పెళ్లి చేసుకోవాలని కెనడా నుంచి భారత్‌కు.. చివర్లో ఊహించని ట్విస్ట్
అతడికి 31.. ఆమెకు 61 - పెళ్లి చేసుకోవాలని కెనడా నుంచి భారత్‌కు.. చివర్లో ఊహించని ట్విస్ట్
AP Panchayat Elections 2026: పల్లె పోరులో వేలం పాటల జోరు.. సర్పంచి పదవి కోసం రూ.2.30 కోట్లు, పోటీతో పెరిగిన డిమాండ్
పల్లె పోరులో వేలం పాటల జోరు.. సర్పంచి పదవి కోసం రూ.2.30 కోట్లు, పోటీతో పెరిగిన డిమాండ్
Denza D9: లగ్జరీ కారుకి కొత్త అర్థం.. 7 సీట్లు, మసాజ్ ఫీచర్‌, 730 కి.మీ. రేంజ్‌తో వచ్చిన 'డెంజా D9'
కదిలే స్టార్‌ హోటల్‌ లాంటి Denza D9.. ఈ కారు మీ దగ్గరుంటే ప్రతి ఒక్కరి కళ్లూ మీ మీదే!
Dry Fruits Benefits : బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్.. ఏవి ఏ సమయంలో తింటే మంచిది? నిపుణుల సూచనలు ఇవే
బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్.. ఏవి ఏ సమయంలో తింటే మంచిది? నిపుణుల సూచనలు ఇవే
Bigg Boss Season 10 Today November 15th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శ్వేత ఎలిమినేట్! టాప్ 3.. లీస్ట్ త్రీ వాళ్లే! సెలబ్రిటీల బెస్ట్ హింట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: శ్వేత ఎలిమినేట్! టాప్ 3.. లీస్ట్ త్రీ వాళ్లే! సెలబ్రిటీల బెస్ట్ హింట్స్!
Embed widget