అన్వేషించండి

Axar Patel Car Collection 2026: అక్షర్ పటేల్ గ్యారేజీలో ఖరీదైన లగ్జరీ కార్లు: కోట్లు విలువ చేసే టాప్ 3 మోడల్స్ ఇవే!

Axar Patel Car Collection 2026: భారత క్రికెటర్ అక్షర్ పటేల్ లగ్జరీ ఎస్‌యూవీల (SUVs) పట్ల తనకున్న మక్కువను చాటుకున్నారు. ఆయన గ్యారేజీలో ఉన్న అత్యంత ఖరీదైన, పవర్‌ఫుల్ టాప్ 3 కార్ల వివరాలు..

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అక్షర్ పటేల్ వద్ద రూ. 3.5 కోట్లు విలువైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఉంది.
  • విలాసవంతమైన, ఆఫ్-రోడ్ సామర్థ్యం గల ఈ కారు ఆయన అభిమాన వాహనం.
  • కుటుంబ ప్రయాణాలకు, సౌకర్యానికి ల్యాండ్ రోవర్ డిస్కవరీని ఎక్కువగా ఉపయోగిస్తారు.
  • స్పోర్టీ లుక్, పర్ఫార్మెన్స్ కోసం మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జీ జీఎల్ఏ35 ఎంచుకున్నారు.

Axar Patel Car Collection 2026: టీమ్ ఇండియా నమ్మదగ్గ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ మైదానంలో ఎంత ప్రశాంతంగా ఉంటారో, ఆయన కార్ల ఎంపిక కూడా అంతే హుందాగా ఉంటుంది. హంగు ఆర్భాటాలకు వెళ్లకుండా కంఫర్ట్, పర్ఫార్మెన్స్ ఇచ్చే లగ్జరీ ఎస్‌యూవీలను ఆయన ఎక్కువగా ఇష్టపడతారు. ప్రస్తుతం అక్షర్ పటేల్ గ్యారేజీలో ఉన్న వాహనాలు ఆయన అభిరుచికి అద్దం పడుతున్నాయి. వివిధ రిపోర్టుల ప్రకారం అక్షర్ వద్ద ఉన్న టాప్ 3 కార్ల విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ (Range Rover Autobiography)

అక్షర్ పటేల్ కార్ల కలెక్షన్‌లో అత్యంత ఖరీదైనది, విలాసవంతమైనది రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ. దీని ధర సుమారు రూ. 3.5 కోట్లు పైమాటే. రాజసం ఉట్టిపడే ఈ కారు ప్రయాణంలో అద్భుతమైన సౌకర్యాన్ని అందిస్తుంది. ఆఫ్-రోడ్ సామర్థ్యంతో పాటు అత్యున్నత స్థాయి లగ్జరీ ఫీచర్లు ఈ ఎస్‌యూవీ ప్రత్యేకత. సెలిబ్రిటీల ఫేవరెట్ ఛాయిస్ అయిన ఈ కారు అక్షర్ కలెక్షన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

ల్యాండ్ రోవర్ డిస్కవరీ (Land Rover Discovery)

అక్షర్ పటేల్ కొనుగోలు చేసిన మొట్టమొదటి లగ్జరీ ఎస్‌యూవీలలో ల్యాండ్ రోవర్ డిస్కవరీ ఒకటి. ఇది ఇప్పటికీ ఆయన గ్యారేజీలో కీలకమైన వాహనంగా ఉంది. విశాలమైన క్యాబిన్, ఏ రకమైన రోడ్డుపైనైనా సునాయాసంగా ప్రయాణించే శక్తి దీని సొంతం. ప్రాక్టికాలిటీ, లగ్జరీ కలబోతగా ఉన్న ఈ కారు ఫ్యామిలీ ట్రిప్స్ కోసం అక్షర్ ఎక్కువగా వాడుతుంటారు.

మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జీ జీఎల్ఏ35 (Mercedes-Benz AMG GLA35)

లగ్జరీతో పాటు కాస్త స్పోర్టీ లుక్ కోసం అక్షర్ ఈ మెర్సిడెస్ ఏఎమ్‌జీ మోడల్‌ను ఎంచుకున్నారు. ఇతర ఎస్‌యూవీలు సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తే, ఈ ఏఎమ్‌జీ వెర్షన్ మాత్రం స్పీడ్, థ్రిల్ అందిస్తుంది. పవర్‌ఫుల్ ఇంజిన్, అగ్రెసివ్ లుక్‌తో ఉండే ఈ కారును అక్షర్ స్వయంగా డ్రైవ్ చేయడానికి ఇష్టపడతారు. దీని పెర్ఫార్మెన్స్ యువ క్రికెటర్ వ్యక్తిత్వానికి సరిగ్గా సరిపోతుంది. అక్షర్ పటేల్ వద్ద ఉన్న కార్ల సంఖ్య తక్కువే కావొచ్చు, కానీ ప్రతీ కారు ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో కొన్నట్లు కనిపిస్తుంది. రగ్గడ్ డిస్కవరీ, లగ్జరీ ఆటోబయోగ్రఫీ, స్పోర్టీ ఏఎమ్‌జీ కార్లు ఆయన అభిరుచిని చాటుతున్నాయని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

Frequently Asked Questions

అక్షర్ పటేల్ కు ఎలాంటి కార్లు ఇష్టం?

అక్షర్ పటేల్ హంగు ఆర్భాటాలకు వెళ్లకుండా కంఫర్ట్, పర్ఫార్మెన్స్ ఇచ్చే లగ్జరీ ఎస్‌యూవీలను ఎక్కువగా ఇష్టపడతారు.

అక్షర్ పటేల్ వద్ద ఉన్న అత్యంత ఖరీదైన కారు ఏది?

అక్షర్ పటేల్ కార్ల కలెక్షన్‌లో అత్యంత ఖరీదైనది, విలాసవంతమైనది రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ. దీని ధర సుమారు రూ. 3.5 కోట్లు పైమాటే.

అక్షర్ పటేల్ ఫ్యామిలీ ట్రిప్స్ కోసం ఏ కారును ఎక్కువగా ఉపయోగిస్తారు?

ప్రాక్టికాలిటీ, లగ్జరీ కలబోతగా ఉన్న ల్యాండ్ రోవర్ డిస్కవరీ కారును ఫ్యామిలీ ట్రిప్స్ కోసం అక్షర్ ఎక్కువగా వాడుతుంటారు.

అక్షర్ పటేల్ తన కారును స్వయంగా డ్రైవ్ చేయడానికి ఏ మోడల్‌ను ఇష్టపడతారు?

లగ్జరీతో పాటు స్పోర్టీ లుక్ కోసం మెర్సిడెస్ బెంజ్ ఏఎమ్‌జీ జీఎల్ఏ35 ను ఎంచుకున్నారు. పవర్‌ఫుల్ ఇంజిన్, అగ్రెసివ్ లుక్‌తో ఉండే ఈ కారును అక్షర్ స్వయంగా డ్రైవ్ చేయడానికి ఇష్టపడతారు.

టాప్ హెడ్ లైన్స్

ట్రయంఫ్ ట్రాకర్ 400 పెర్ఫార్మెన్స్‌ టెస్ట్.. యాక్సిలరేషన్‌, బ్రేకింగ్ వ్యవస్థల నిజమైన పనితీరు ఇదే!
100 కి.మీ. వేగం 7.55 సెకన్లలోనే.. Triumph Tracker 400 సూపర్‌ పెర్ఫార్మెన్స్‌!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
తక్కువ ధరకే టాటా ఎలక్ట్రిక్ కార్లు.. BaaSతో దిగొచ్చిన ధరలు, పూర్తి లెక్క ఇదిగో
టాటా EVలపై భారీ తగ్గింపు.. కొత్త స్కీమ్‌తో రూ.7.30 లక్షల వరకు ఆదా!
ట్రాఫిక్‌ చలానాలు చెల్లించకపోతే వాహన సేవలకు బ్రేక్, లైసెన్స్‌పై వేటు, కరెంటు కట్‌!
ట్రాఫిక్ చలానా కట్టలేదా? ఇక కరెంట్ బిల్లు మోతే!.. ఈ రెండిటికీ ఏంటి సంబంధం?

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
Embed widget