అన్వేషించండి

New Ethanol Blending Standards: ఇండియాలో ఇంధన విప్లవం - కొత్త ఇథనాల్ బ్లెండింగ్ ప్రమాణాలను నోటిఫై చేసిన కేంద్రం

New Ethanol Blending Standards for E22 to E30 Fuels: దేశంలో క్రూడ్ ఆయిల్ దిగుమతులను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ22 నుండి ఈ30 ఇంధనాల కొత్త క్వాలిటీ ప్రమాణాలను ప్రకటించింది.

India Notifies New Ethanol Blending Standards for E22 to E30: కేంద్ర ప్ర‌భుత్వం.. తన ప్రతిష్టాత్మక ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్‌ను మరింత వేగవంతం చేస్తూ ఈ22, ఈ25, ఈ27, ఈ30 ఇంధనాలకు సంబంధించిన క్వాలిటీ ప్రమాణాలను అధికారికంగా నోటిఫై చేసింది. సాధారణ పెట్రోల్ వాడకం నుండి ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల వైపు మళ్లడానికి పాలసీ మేకర్లు తీసుకున్న తదుపరి కీలక అడుగుగా ఇది నిలిచింది. అంతర్జాతీయంగా జియోపొలిటికల్ టెన్షన్లు, గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌లో ఒడిదొడుకులు ఉన్న సమయంలో ఈ నిర్ణయం రావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ముడి చమురుపై విదేశీ డిపెండెన్సీని తగ్గించాలనే భారత్ బలమైన సంకల్పాన్ని ప్రతిబింబిస్తోంది.

Read Also: Tata Sierra SUVకు గట్టి పోటీ ఇవ్వనున్న Jeep Renegade.. దీని ధర, ఫీచర్లు చూసి కొనేయండి 

అమల్లోకి వచ్చిన బీఐఎస్ నోటిఫికేషన్ ..

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) జారీ చేసిన కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఈ సరికొత్త ఇంధన ప్రమాణాలు మే 15, 2026 నుండి అధికారికంగా అమల్లోకి వచ్చాయి. పాజిటివ్ ఇగ్నిషన్ ఇంజన్ ఆధారిత వాహనాల్లో వాడే మోటార్ గ్యాసోలిన్, అన్‌హైడ్రస్ ఇథనాల్ మిశ్రమాల క్వాలిటీని ఈ నిబంధనలు క్రమబద్ధీకరిస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఇథనాల్ వాడకంలో తదుపరి స్టేజ్ ఎకోసిస్టమ్‌ను రెడీ చేయడానికి ఈ ఫ్యూయల్ క్వాలిటీ ఫ్రేమ్‌వర్క్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఇథనాల్ నార్మ్స్‌తో పాటు డిమెథైల్ ఈథర్ (DME) బ్లెండెడ్ ఎల్‌పీజీ ప్రమాణాలను, మరికొన్ని ఇండస్ట్రియల్ స్పెసిఫికేషన్లను కూడా బీఐఎస్ అప్‌డేట్ చేసింది.

Read Also: నష్టాల నుంచి రికవర్ అవుతున్న Ola Electric .. బ్యాటరీ ఉత్పత్తిపై ఫోకస్, దిగిరానున్న EV ధరలు

డిస్టిల్లర్స్ అసోసియేషన్ హర్షం..

కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని ఆల్ ఇండియా డిస్టిల్లర్స్ అసోసియేషన్ (AIDA) హృదయపూర్వకంగా స్వాగతించింది. ప్రస్తుత మార్కెట్లో ఉన్న మిగులు చక్కెర, ఇథనాల్ ప్రొడక్షన్ కెపాసిటీని సద్వినియోగం చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్ పరిశ్రమకు మధ్యంతర ఉపశమనాన్ని ఇస్తుందని అసోసియేషన్ పేర్కొంది. ఆల్ ఇండియా డిస్టిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఇది ఒక ముఖ్యమైన మైలురాయి అయినప్పటికీ లాంగ్ టర్మ్ విజన్ కోసం ఈ85, ఈ100 లాంటి అధిక ఇథనాల్ మిశ్రమాల వైపు వేగంగా అడుగులు వేయాలని సూచించారు. దేశంలో కొత్తగా అందుబాటులోకి వస్తున్న ప్రొడక్షన్ కెపాసిటీని బట్టి చూస్తే ఇథనాల్ ప్రోగ్రామ్ ఫ్యూచర్ అనేది ఫ్లెక్స్-ఫ్యూయల్ మొబిలిటీపైనే ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

కాలుష్య నియంత్రణ..

ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు (FFVs) దేశంలో ఇథనాల్ వినియోగాన్ని భారీగా పెంచడంలో, ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో ట్రాన్స్‌ఫార్మేషనల్ రోల్ ప్లే చేస్తాయని విజేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు. ఇవి కాలుష్య ఉద్గారాలను తగ్గించడమే కాకుండా దేశీయ బయోఫ్యూయల్స్ మార్కెట్‌కు ఒక సస్టైనబుల్ ఎకోసిస్టమ్‌ను క్రియేట్ చేస్తాయని తెలిపారు. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ కింద భారత్ ఇప్పటికే అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఇప్పుడు ఈ22, ఈ30 ఫ్యూయల్ స్పెసిఫికేషన్ల రోలవుట్ ద్వారా ఇథనాల్ ఆధారిత మొబిలిటీ సొల్యూషన్లలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది.

టాప్ హెడ్ లైన్స్

2026 Honda Elevate facelift లో ఇవి లేవు! ప్రత్యర్థి కార్లలో ఉన్న 6 ఫీచర్లు ఈ కారులో మిస్!
కొత్తగా వచ్చినప్పటికీ Honda Elevate Facelift లో మిస్‌ అయిన ఫీచర్లు ఇవే
2026 Honda Elevate Faceliftలో ఏ వేరియంట్ బెస్ట్? రూ.11.80 లక్షల నుంచి ధరలు.. ఫీచర్లలో భారీ తేడాలు!
2026 Honda Elevate Faceliftలో 5 వేరియంట్లు.. మీ డబ్బుకు విలువ ఇచ్చేది మాత్రం ఇదే!
Triumph Bonneville T40 వర్సెస్‌ Bonneville T4: ఏది కొనాలి?, ధర దగ్గర నుంచి ఫీచర్ల వరకు తేడాలు
Triumph Bonneville T40లో ఉన్నదేంటి? Bonneville T4లో లేనిదేంటి? రూ.25,000 తేడాలో మారిందేంటి?
776cc స్పోర్ట్స్ బైక్ Suzuki GSX-8R.. రూ.80,000 డిస్కౌంట్ ఆఫర్.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే!
Suzuki బైక్‌పై ఏకంగా రూ.80,000 డిస్కౌంట్.. ఈ ఆఫర్ మిస్ అయితే మళ్లీ దొరకదు!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
Embed widget