2025 Hyundai Venue vs Maruti Brezza: ఏ SUV ఉత్తమమైనది? కొనే ముందు వివరాలు తెలుసుకోండి
2025 Hyundai Venue vs Maruti Brezza: 2025 హ్యూందాయ్ వెన్యూ, మారుతి బ్రెజ్జాలో 6 ఎయిర్ బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా ఉన్నాయి. భద్రతలో వెన్యూ ముందంజలో ఉంది. మిగతా ఫీచర్స్, మైలేజ్‌గురించి తెలుసుకుందాం.

2025 Hyundai Venue vs Maruti Brezza: భారతీయ మార్కెట్‌లో సబ్-కాంపాక్ట్ SUV విభాగం ఈ రోజుల్లో వేగంగా పెరుగుతోంది. ఈ విభాగంలో హ్యూందాయ్ వెన్యూ, మారుతి బ్రెజ్జా అనే రెండు పేర్లు ఎక్కువగా చర్చలో ఉన్నాయి. రెండు కంపెనీలు భారతదేశంలోని టాప్ ఆటో బ్రాండ్‌ల్లో ఒకటిగా పరిగణిస్తున్నాయి, అయితే 2025లో ఈ రెండింటిలో ఏ SUV ఎక్కువ మంచిది అనేదే ప్రశ్న. రెండింటి ధర, ఫీచర్లు, భద్రత, మైలేజీని పరిశీలిద్దాం.
వెన్యూ చౌక, బ్రెజ్జా కొంచెం ఖరీదు
హ్యూందాయ్ వెన్యూ 2025 ప్రారంభ ధర రూ. 7.90 లక్షలు (HX2 1.2 పెట్రోల్ MT) నుంచి ప్రారంభమవుతుంది. ఇది మారుతి బ్రెజ్జా కంటే దాదాపు రూ. 36,000 తక్కువ. వెన్యూ టాప్ మోడల్ రూ. 15.69 లక్షలు (HX10 DT డీజిల్ AT) వరకు ఉంటుంది. అదే సమయంలో, మారుతి బ్రెజ్జా ప్రారంభ ధర రూ.8.26 లక్షలు (LXi పెట్రోల్) దాని టాప్ వేరియంట్ రూ. 13.01 లక్షలు (ZXi+ AT DT) వరకు ఉంటుంది. బ్రెజ్జా ప్రత్యేకత ఏమిటంటే, ఇది CNG ఎంపికను కూడా కలిగి ఉంది, ఇది దాని రన్నింగ్ ఖర్చును బాగా తగ్గిస్తుంది. మీరు చవకైన SUVని కోరుకుంటే, వెన్యూ కొంచెం చౌకగా ఉంటుంది, అయితే బ్రెజ్జాలో చాలా రకాలు ఉన్నాయి.
ఇంటీరియర్ -కంఫర్ట్
హ్యూందాయ్ వెన్యూ ఇప్పుడు రెండు పెద్ద 12.3-అంగుళాల (ఒక డ్రైవర్ డిస్‌ప్లే- రెండో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్) డిజిటల్ స్క్రీన్‌లను కలిగి ఉంది. దీనితోపాటు, వెంటిలేటెడ్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్, రియర్ AC వెంట్స్ వంటి ఫీచర్లు వెన్యూని చాలా సౌకర్యవంతంగా చేస్తాయి. కొత్త వెన్యూలో వీల్‌బేస్ 20mm పెరిగింది, దీని వలన వెనుక సీటులో కూర్చునే స్థలం కూడా పెరిగింది. అదే సమయంలో, మారుతి బ్రెజ్జా ఇంటీరియర్ కొంచెం పాతది, ఇది 9-అంగుళాల టచ్‌స్క్రీన్, హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), 360-డిగ్రీ కెమెరా, రియర్ AC వెంట్స్ వంటి అవసరమైన ఫీచర్లను కలిగి ఉంది. బ్రెజ్జా బూట్ స్పేస్ 328 లీటర్లు, మొత్తంమీద, వెన్యూ మరింత ఆధునికమైనది. హై-టెక్ అనుభూతిని ఇస్తుంది, అయితే బ్రెజ్జా సౌకర్యం -స్థలంపై ఎక్కువ దృష్టి పెడుతుంది.





















