Hyundai Venue Facelift 2022: కొత్త వెన్యూ వచ్చేసింది - రూ.7.5 లక్షల్లోనే - మొదటిసారి ఆ ఫీచర్‌తో!
హ్యుండాయ్ తన కొత్త వెన్యూ కారును మనదేశంలో లాంచ్ చేసింది. అదే హ్యుండాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్.
![Hyundai Venue Facelift 2022: కొత్త వెన్యూ వచ్చేసింది - రూ.7.5 లక్షల్లోనే - మొదటిసారి ఆ ఫీచర్‌తో! Hyundai Venue Facelift Launched in India Price Specifications Features Hyundai Venue Facelift 2022: కొత్త వెన్యూ వచ్చేసింది - రూ.7.5 లక్షల్లోనే - మొదటిసారి ఆ ఫీచర్‌తో!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/16/05fb88f0f09b5718e70d46d835d67048_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
హ్యుండాయ్ వెన్యూ ఫేస్ లిఫ్ట్ మోడల్ మనదేశంలో లాంచ్ అయింది. వెన్యూ మనదేశంలో 2019 మేలో లాంచ్ అయింది. దీనికి మంచి ఆదరణ దక్కింది. మూడు సంవత్సరాల తర్వాత కూడా వెన్యూ మంచి డిమాండ్‌లో ఉంది. దీంతో ఫేస్ లిఫ్ట్ మోడల్‌ను కంపెనీ తీసుకువచ్చింది.
ఇందులో కొత్త ఫీచర్లు కూడా అందించారు. ముందువైపు డిజైన్ కొత్తగా ఉండనుంది. పారామెట్రిక్ జ్యుయెల్ గ్రిల్, డీఆర్ఎల్స్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, కార్నరింగ్ ల్యాంప్స్, ఆటో ఫోల్డ్ అవుట్ సైడ్ మిర్రర్స్, పడుల్ ల్యాంప్స్, వెనకవైపు కొత్త డిజైన్, కొత్త ల్యాంప్స్, ఎల్ఈడీ స్ట్రిప్‌లతో డిజైన్ అదరగొట్టారు.
ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే... బ్లాక్ ఇంటీరియర్ థీమ్, ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం, సౌండ్ నేచర్ ఫీచర్, ఆటో ఎయిర్ ప్యూరిఫయర్, స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెనకవైపు రెండు రిక్లెయినర్ సీట్లు, ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, డిజిటల్ డిస్‌ప్లే, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, వెనకవైపు ఏసీ వెంట్లు, ముందూ వెనకా టైప్-సీ యూఎస్‌బీ చార్జర్లు, రిమోట్ ఇంజిన్ స్టార్ట్ విత్ స్మార్ట్ కీ, పుష్ స్టార్ట్ స్టాప్ బటన్, క్రూజ్ కంట్రోల్, పార్కింగ్ అసిస్ట్, వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్ అసిస్ట్, ఏబీఎస్, ఈబీడీ, ఎలక్ట్రిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఉన్నాయి.
అలెక్సా, గూగుల్ అసిస్టెంట్లను సపోర్ట్ చేసే హోం టు కార్ అసిస్టెంట్ కూడా మొదటిసారి ఇందులో అందించారు. హిందీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లను ఇది సపోర్ట్ చేయనుంది. ఫైండ్ మై కార్, డోర్ అన్ లాక్ చేయడం, లాక్ చేయడం, రిమోట్ క్లైమెట్ కంట్రోల్, రిమోట్ వెహికిల్ స్టేటస్ చెక్, టైర్ ప్రెజర్ సమాచారం, ఫ్యూయల్ లెవల్ ఇన్ఫర్మేషన్, టైమ్ ఫెన్సింగ్ అలెర్ట్, ఐడిల్ టైమ్ అలెర్ట్, స్పీడ్ అలెర్ట్ సమాచారాలను కూడా ఇవి అందించనున్నాయి.
హ్యుండాయ్ వెన్యూ ఫేస్ లిఫ్ట్ ధర
ఇందులో మూడు వేరియంట్లు ఉన్నాయి. 1.2 ఎంపీఐ పెట్రోల్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ ధర రూ.7,53,100గా నిర్ణయించారు. 1.0 టర్బో జీడీఐ పెట్రోల్ ఐఎంటీ వేరియంట్, యూ2 1.5 సీఆర్‌డీఐ డీజిల్ వేరియంట్ ధరలను రూ.9.99 లక్షలుగానూ నిర్ణయించారు. ఇవన్నీ ఎక్స్-షోరూం ధరలే. పోలార్ వైట్, టైఫూన్ సిల్వర్, డెనిమ్ బ్లూ, ఫాంటం బ్లాక్, టైటాన్ గ్రే, ఫీరీ రెడ్, డ్యూయల్ టోన్ ఫీరీ రెడ్ కలర్ ఆప్షన్లలో ఈ కారు కొనవచ్చు.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)