అన్వేషించండి

Hyundai Car Price Hike June 2026:జూన్‌ నుంచి హ్యుందాయ్ కార్ల ధరల పెంపు! నాలుగోసారి ధరల పెంపునకు కారణాలేంటీ?

Hyundai Car Price Hike:హ్యుందాయ్‌ మోటార్స్ తన మొత్తం పోర్ట్‌పోలియో కార్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. జూన్ 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తున్నట్టు  తెలిపింది. ఇంతకీ ఈ ధరల పెంపునకు కారణాలేంటీ?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జూన్ 1 నుండి హ్యుందాయ్ అన్ని కార్ల ధరలు పెంచుతుంది.
  • ముడి పదార్థాల, రవాణా ఖర్చులు పెరగడం కారణాలుగా పేర్కొంది.
  • కొన్ని మోడళ్లపై గరిష్టంగా 12,800 వరకు ధరలు పెరుగుతాయి.
  • జూన్ 1 లోపు బుకింగ్ చేసుకుంటే ప్రస్తుత ధర వర్తిస్తుంది.

Hyundai Car Price Hike June 2026:భారత్ వాహన రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉన్న హ్యుందాయ్ మోటార్ ఇండియా, తన వినియోగదారులకు షాకిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్1 నుంచి తన అన్ని మోడళ్లపై ధరలను పెంచుతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. గడిచిన రెండు నెలల్లో ధరలు పెరగడం ఇది రెండోసారి కాగా, ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి. ఈ ధరల పెంపు వెనుక ఉన్న ఆర్థిక కారణాలు, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు, సామాన్య కొనుగోలుదారునిపై దీని ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. 

హ్యుందాయ్‌ అధికారిక ప్రకటన ప్రకారం కొత్త ధరలు జూన్ 1 నుంచి అమలులోకి వస్తాయి. ఈ పెంపు అనేది కంపెనీ విక్రయించే ప్రతి మోడల్‌పై వర్తిస్తుంది. అంటే ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ నుంచి ప్రీమియం ఎస్‌యూవీ వరకు అన్ని ఖరీదైనవి కానున్నాయి. 

వేరియంట్, మోడల్‌ను బట్టి గరిష్టంగా 12,800 వరకు ధర పెరగనుంది. హ్యుందాయ్‌ క్రెటా, వెన్యూ, అల్కాజర్‌ వంటి పాపులర్ మోడళ్లపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.  

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కొన్ని ప్రధాన మోడళ్ల ప్రారంభ ధరలను గమనిస్తే... హ్యుందాయ్‌ క్రెటా 10.79 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. హ్యుందాయ్ వెన్యూ 8 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. హ్యుందాయ్‌ అల్కాజర్‌ 14. 50 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. 

కంపెనీ ఈ ధరల పెంపును కేవలం ఒక నిర్ణయంగా కాకుండా, ఒక అనివార్య పరిస్థితిగా అభివర్ణించింది. దీనికి ప్రధానంగా మూడు కారణాలను హ్యుందాయ్‌ పేర్కొంది. 

కార్ల తయారీకి అవసరమయ్యే ముడి పదార్థాల ధరలు గ్లోబల్ మార్కెట్‌లో విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా ఉక్కు అల్యూమినియం, ఇతర లోహాల ధరలు పెరగడం వల్ల తయారీ వ్యయం భారమైంది. గల్ఫ్‌ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ రవాణా కారిడార్లపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. దీని వల్ల లాజిస్టిక్స్‌,రవాణా ఛార్జీలు గణనీయంగా పెరిగాయి. ఇది అంతిమంగా కారు ధరపై ప్రభావం చూపుతోంది. 

కారు కొనాలనుకునే వారు జూన్ 1లోపు బుకింగ్ చేసుకోవడం ద్వారా  అదనపు ధర నుంచి తప్పించుకోవచ్చు. గల్ఫ్ సంక్షోభం వంటి అంతర్జాతీయ అంశాలు పరిష్కారమైతే తప్ప, వాహన ధరలు స్థిరంగా ఉండే సూచనలు ప్రస్తుతానికి కనిపించడం లేదు. హ్యుందాయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇతర కంపెనీలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. 

Frequently Asked Questions

హ్యుందాయ్ కార్ల ధరలు ఎప్పటి నుంచి పెరుగుతాయి?

హ్యుందాయ్ కార్ల కొత్త ధరలు జూన్ 1 నుంచి అమలులోకి వస్తాయి. ఈ పెంపుదల అన్ని మోడళ్లపై వర్తిస్తుంది.

హ్యుందాయ్ కార్ల ధరలు ఎంత వరకు పెరగవచ్చు?

మోడల్ మరియు వేరియంట్‌ను బట్టి గరిష్టంగా రూ. 12,800 వరకు ధర పెరగనుంది. ఇది క్రెటా, వెన్యూ, అల్కాజర్ వంటి పాపులర్ మోడళ్లపై ప్రభావం చూపుతుంది.

కార్ల ధరల పెంపునకు గల కారణాలు ఏమిటి?

ముడి పదార్థాల ధరలు పెరగడం, ముఖ్యంగా ఉక్కు, అల్యూమినియం వంటి లోహాల ధరలు పెరగడం, మరియు గల్ఫ్ సంక్షోభం వల్ల పెరిగిన రవాణా ఛార్జీలు దీనికి ప్రధాన కారణాలు.

ధరల పెంపుదల నుంచి తప్పించుకోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా?

జూన్ 1 లోపు కారును బుక్ చేసుకుంటే, మీరు అదనపు ధరల పెంపుదల నుంచి తప్పించుకోవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hybrid SUV: 1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
Car Coolant: కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
Top Car Exports From India 2026: భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాహనాల గురించి తెలుసా? 
భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాహనాల గురించి తెలుసా?
Alloy Wheel or Steel Wheel: అల్లాయ్ వీల్స్ లేదా స్టీల్ వీల్స్: ఏది మంచిది? ప్రతి విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి!
అల్లాయ్ వీల్స్ లేదా స్టీల్ వీల్స్: ఏది మంచిది? ప్రతి విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget