అన్వేషించండి

SUV సెగ్మెంట్లో నెంబర్ వన్ Hyundai Creta.. టాటా సియెర్రా, విక్టోరిస్‌ను వెనక్కినెట్టేంత ఏముంది

Hyundai Creta | జనవరి 2026లో అత్యధికంగా అమ్ముడైన మిడ్-సైజ్ SUVగా హ్యూందాయ్ క్రెటా నిలిచింది. టాటా సియెర్రా (Tata Sierra), Maruti Vitara, కియా సెల్టోస్ (Kia Seltos) లను అధిగమించి దూసుకెళ్తోంది.

మార్కెట్లోకి ఎన్ని కొత్త SUVలు విడుదలవుతున్నా, భారత్‌లో ఎంత పోటీ పెరిగినా కొన్ని వాటి స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాయి. వాటిలో జనవరి 2026లో విడుదలైన హ్యుందాయ్ క్రెటా మిడ్-సైజ్ SUV విభాగంలో తన స్థానాన్ని పటిష్టం చేసుకుని విక్రయాల్లో దూసుకెళ్తోంది. ఈ నెలలో క్రెటా అత్యధికంగా అమ్ముడైన SUVగా నిలిచింది. మొత్తం 17,921 యూనిట్లు విక్రయాలు జరిగాయి. ఈ అద్భుతమైన పనితీరుతో, క్రెటా, టాటా సియెర్రా, మారుతి విక్టోరిస్, న్యూ జనరేషన్ కియా సెల్టోస్ వంటి ట్రెండింగ్ కార్లను కూడా హ్యూందాయ్ క్రెటా వెనక్కి నెట్టింది. భారత కస్టమర్‌లలో క్రెటా తన క్రేజ్ కాపాడుకుని విక్రయాల్లో దూసుకెళ్తోంది. 

టాటా సియెరా, విక్టోరిస్‌ను అదిగమించిన క్రెటా 

జనవరి 2026లో హ్యుందాయ్ క్రెటా అమ్మకాలు టాటా సియెరా కంటే ఎక్కువగా నమోదయ్యాయి. టాటా సియెర్రా మొత్తం 7,003 యూనిట్లు అమ్ముడుకాగా, హ్యూందాయ్ క్రెటా 10,918 యూనిట్లను ఎక్కువగా విక్రయించి రికార్డ్ క్రియేట్ చేసింది.  మారుతి విక్టోరిస్ 15,240 యూనిట్లు అమ్ముడుపోగా, కియా సెల్టోస్ 10,639 యూనిట్లు విక్రయించింది. ఇవి రెండూ కూడా హ్యూందాయ్ క్రెటాను అధిగమించలేకపోయాయి. క్రెటా స్ట్రాంగ్ బ్రాండ్ ఇమేజ్, పలు వేరియంట్ ఆప్షన్లు, దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద డీలర్ నెట్‌వర్క్ ద్వారా నేరుగా ప్రయోజనం పొందుతోంది.

కొత్త కార్లు వస్తున్నా SUV విభాగంలో జోరు

విక్టోరిస్, సియెరా రెండూ ప్రస్తుతం భారత మార్కెట్‌లో కొత్తవి. అయితే విక్టోరిస్‌ను సెప్టెంబర్ 2025లో, టాటా సియెర్రాను  నవంబర్ 2025లో లాంచ్ చేశారు. అయినప్పటికీ, హ్యుందాయ్ క్రెటా అమ్మకాల్లో సత్తా చాటింది. మారుతి విక్టోరిస్ జనవరి 2026 నాటికి మొత్తం 50,000 యూనిట్లకు పైగా అమ్మకాలతో దూసుకెళ్తోంది. టాటా సియెర్రా అమ్మకాలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. అయితే జనవరి 2026లో మిడ్-సైజ్ SUV విభాగం అమ్మకాలు 70,898 యూనిట్లకు చేరాయి. ఇది సంవత్సరానికి దాదాపు 40 శాతం వృద్ధిని నమోదు చేసింది. 

హ్యుందాయ్ క్రెటా భారత మార్కెట్లో కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హోండా ఎలివేట్‌లకు గట్టి పోటీనిస్తోంది. మరోవైపు, ఇది టాటా సియెరా, రెనాల్ట్ డస్టర్, మహీంద్రా థార్ రాక్స్ వంటి పవర్ ‌ఫుల్  SUVలకు సైతం విక్రయాలలో పోటీనిస్తుంది.

హ్యూందాయ్ క్రెటా  

హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) భారత్‌లో కస్టమర్లను ఆకర్షిస్తున్న మిడ్-సైజ్ SUVలలో ఒకటి. దీని స్టైలిష్ లుక్, అత్యాధునిక ఫీచర్లు, పెర్ఫార్మెన్స్ కారణంగా ఇది మార్కెట్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. హ్యుందాయ్ క్రెటాకు ఇంజిన్, ధర, ఫీచర్లు ఇలా ఉన్నాయి.
 ఇంజిన్, పెర్ఫార్మెన్స్
హ్యూందాయ్ క్రెటా 3 రకాల ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 
1.5 లీటర్ పెట్రోల్: ఇది సిటీ డ్రైవింగ్‌కు చాలా కంఫర్టబుల్ 
1.5 లీటర్ టర్బో పెట్రోల్: ఎక్కువ పవర్, స్పీడ్ కోరుకునే వారికి ఇది సరిపోతుంది
1.5 లీటర్ డీజిల్: మైలేజ్, లాంగ్ డ్రైవ్స్ చేసేవారికి ఇది బెస్ట్.
ట్రాన్స్‌మిషన్: ఇందులో మాన్యువల్, iMT, IVT, DCT వంటి విభిన్న గేర్ బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

ఇంటీరియర్, ఫీచర్లు
క్రెటా లోపల ప్రీమియం లుక్, టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చారు. పెద్ద సన్‌రూఫ్ కారుకు మంచి లగ్జరీ ఫీలింగ్‌ను ఇస్తుంది. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, అదే పరిమాణంలో డిజిటల్ క్లస్టర్ ఉన్నాయి. వేసవి కాలంలో చల్లదనాన్ని ఇచ్చేలా సీట్లు డిజైన్ చేశారు. బ్లూలింక్ ద్వారా కారును మొబైల్ నుంచే కంట్రోల్ చేయవచ్చు.

సేఫ్టీ ఫీచర్లు
కొత్త మోడళ్లలో సేఫ్టీకి హ్యుందాయ్ అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ADAS (Level 2) ఆటోమేటిక్ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్ వంటి 19 రకాల అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా 6 ఎయిర్‌బ్యాగ్స్ వస్తాయి. 4 వీల్స్‌కు డిస్క్ బ్రేక్స్ ఉండటం వల్ల మంచి కంట్రోల్ లభిస్తుంది. 360 డిగ్రీల కెమెరా కారు చుట్టూ ఉన్న దృశ్యాలను చూడటం ద్వారా పార్కింగ్ తేలికచేస్తుంది.  అవుతుంది.

ధర
హ్యుందాయ్ క్రెటా ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 11 లక్షలకు ప్రారంభమై వేరియంట్‌ను బట్టి గరిష్టంగా రూ. 20.15 లక్షల వరకు ఉంటుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు
పెట్రోల్‌కు బలెనో.. CNGకి డిజైర్.. EVల్లో విండ్సర్ - 2026లో టాప్ సెల్లింగ్‌ కార్లు ఇవే!
టాటా నెక్సాన్ కామో ఎడిషన్‌లో ఆశ్చర్యపరిచే మార్పులు.. కొత్త రంగులు, 12.3 అంగుళాల స్క్రీన్, మరెన్నో!
టాటా నెక్సాన్‌ కామో ఎడిషన్ లాంచ్ - రూ.9.99 లక్షలే! ఏంటి దీని స్పెషాలిటీ?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Embed widget