Best Mileage Car of India: భారత్‌లో అత్యధిక మైలేజ్ ఇచ్చే కారు Maruti Celerio- ధర, ఫీచర్లు చూసి కొనేయండి
Maruti Celerio CNG: 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టచ్‌స్క్రీన్, అత్యధిక మైలేజీ ఇచ్చే కార్లలో మారుతి సెలెరియో మొదటి స్థానంలో నిలిచింది. పవర్ విండోస్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయి.

Best Mileage Car of India | ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద కారు, బైక్ మార్కెట్‌లలో భారత్ ఒకటి. మరోవైపు అదే స్థాయిలో కంపెనీల మధ్య పోటీ ఉంటుంది. లుక్ పరంగా కొన్ని బెస్ట్ అయితే, మైలేజీ పరంగా, బూట్ స్పేస్ పరంగా కొన్ని కార్లు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. అత్యధిక మైలేజ్ ఇచ్చే కారు విషయానికి వస్తే, Maruti Celerio నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుంది. మీరు రోజువారీ జర్నీ కోసం తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే కారు కోసం చూస్తున్నారా, అయితే Maruti Celerio మీకు సరైన కారు కావచ్చు. ఈ కారు CNG మోడ్‌లో 35 km/ kg వరకు మైలేజ్ ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది.. ఈ కారు ధర, సేఫ్టీ ఫీచర్లు, ఇతర స్పెసిఫికేషన్‌ల గురించి ఇక్కడ తెలుసుకోండి.
Maruti Celerio ధర ఎంత?
Maruti Celerio కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.70 లక్షల నుండి ప్రారంభమవుతుంది. సెలెరియో VXI CNG వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.98 లక్షలు కాగా, ఈ Celerio కారు మైలేజ్, ఫీచర్ల గురించి తెలుసుకున్నాక కొనాలా వద్దా అని మీరు డిసైడ్ కావొచ్చు.
Maruti Celerio ఎంత మైలేజ్ ఇస్తుంది?
మైలేజ్ విషయానికి వస్తే మారుతి Celerio పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ఒక లీటరుకు 25.24 కిలోమీటర్లు, ఆటోమేటిక్ వేరియంట్ అయితే 26.68 కిలోమీటర్లు, CNG వేరియంట్ ఒక కేజీకి 34.43 కిలోమీటర్ల మైలేజీ మైలేజ్ ఇస్తుంది. ఈ మైలేజీ వివరాలు మారుతి సెలెరియోను భారత్‌లో అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన CNG కార్లలో ఒకటిగా చేస్తుంది. రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి తక్కువ ఖర్చులో పని పూర్తవుతుంది. పైగా మీ జేబుపై అంత భారం పడకుండా చేస్తుంది..
Maruti Celerio ఇంజిన్ వివరాలు
మారుతి సెలెరియో ఇంజిన్ విషయానికి వస్తే.. Celerio 1.0 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ కారు 66 bhp శక్తిని, 89 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో వస్తుంది. అయితే CNG వేరియంట్‌లో 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఈ ఇంజిన్ సిటీతో పాటు హైవే జర్నీలోనూ అద్భుతమైన బ్యాలెన్సింగ్, బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. మార్కెట్‌లో మారుతి Celerio.. టాటా టియాగో (Tata Tiago)కు గట్టి పోటీ ఇస్తుంది. ఇది దాని బిల్డ్ క్వాలిటీకి కస్టమర్లను ఆకర్షిస్తోంది.
మారుతి సెలెరియో కారు ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఫీచర్ల పరంగా Celerio దాని ధరకు తగినట్లు బెస్ట్ అనిపిస్తుంది. ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు (వేరియంట్‌ను బట్టి), 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో (Android Auto), ఆపిల్ కార్ ప్లే (Apple CarPlay), పవర్ విండోస్, ఎలక్ట్రిక్ ORVMలు, రివర్స్ పార్కింగ్ సెన్సర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ భద్రతా పరంగా చూసుకున్నా మారుతి సెలెరియో లేటేస్ట్ సేఫ్టీ రూల్స్‌కు అనుగుణంగా ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
























