Hyundai Creta EV: క్రెటా ఈవీ, నార్మల్ వేరియంట్లలో ఏది బెస్ట్ - ఏం తేడాలు ఉండవచ్చు?
Creta EV Vs Creta ICE: హ్యుందాయ్ క్రెటా ఈవీ ఎలా ఉండనుంది? సాధారణ క్రెటా కంటే ఏం తేడాలు ఉండవచ్చో తెలుసా?
Hyundai Creta EV vs ICE: ఇప్పుడు హ్యుందాయ్ భారతదేశంలో క్రెటా ఈవీని సిద్ధం చేస్తోందనేది ఏమాత్రం రహస్యం కాదు. ఇది ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశంలో లాంచ్ అయిన ఫేస్‌లిఫ్టెడ్ క్రెటాపై బేస్ అయి ఈ ఈవీ ఉంటుంది. అయితే ఈవీ వేరియంట్ కొన్ని ముఖ్యమైన మార్గాల్లో ఈవీ టచ్‌తో క్రెటా ఐసీఈ వేరియంట్ నుంచి భిన్నంగా ఉంటుంది. అయితే ఇది ప్రధానంగా ప్రస్తుత ఫేస్‌లిఫ్టెడ్ క్రెటా రూపాన్ని కలిగి ఉంటుంది.
ఈవీ వేరియంట్‌లో ఏరో ఆప్టిమైజ్డ్ ఫ్రంట్ బంపర్ డిజైన్, గ్రిల్ నుంచి విభిన్నమైన లైటింగ్ సిగ్నేచర్ ఉంటుంది. ఇది 17 అంగుళాల చక్రాలను కూడా పొందుతుంది. ప్రత్యేక ఈవీ టైర్‌లతో పాటు ఏరో ఆప్టిమైజ్ కూడా చేశారు. ఇది రేంజ్‌ని పెంచడంలో సహాయపడుతుంది. దీని సైడ్ ప్రొఫైల్ ఇప్పటికే ఉన్న క్రెటా మాదిరిగానే ఉంటుంది. అయితే ఈవీ బ్యాడ్జ్‌ని జోడించడంతో దాని వెనుక వైపు కొన్ని మార్పులు ఖచ్చితంగా చేయవచ్చు.
ఇంటీరియర్ గురించి చెప్పాలంటే ఈవీకి సంబంధించిన కొన్ని ప్రత్యేక మార్పులు ఇందులో కూడా చూడవచ్చు. ఇందులో ఈవీ గురించిన సమాచారంతో పాటు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా చేర్చవచ్చు. క్రెటా ఈవీకి 45 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ లభిస్తుందని తెలుస్తోంది. దీని రేంజ్ 450 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. ఈ రోజుల్లో ఇది సాధారణంగా ఉంది. ఇందులో వస్తుందని అంచనాలు ఉన్న మరో ఫీచర్ రీజెనరేటివ్ బ్రేకింగ్. పనోరమిక్ సన్‌రూఫ్, కూల్డ్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అన్ని ప్రీమియం ఫీచర్లతో పాటు స్టీరింగ్ ప్యాడిల్స్ ద్వారా కంట్రోల్ అవుతుంది.
దీన్ని క్రెటా ఈవీ లేదా ఎలక్ట్రిక్ అని కూడా పిలవవచ్చు. ఇది ఇప్పటికే ఉన్న ఐసీఈ క్రెటా వైట్‌కు పైన ఉంటుంది. హ్యుందాయ్ రెండు ఛార్జర్ ఆప్షన్లతో రెండు బ్యాటరీ ప్యాక్‌లను కూడా అందించవచ్చు. క్రెటా ఈవీ... టాటా కర్వ్ ఈవీ, మారుతి సుజుకి ఈవీఎక్స్‌లతో పోటీపడుతుంది. క్రెటా ఈవీ ప్రస్తుతం ఉన్న హ్యుందాయ్ డీలర్‌షిప్ నెట్‌వర్క్ ద్వారా విక్రయిస్తారని అంచనా. క్రెటా ఎన్ లైన్ లాంచ్ అయిన తర్వాత క్రెటా ఈవీ మార్కెట్లోకి వస్తుందని అంచనా.