అన్వేషించండి

Hyundai Cars April 2026 Offer: హ్యూందాయ్ కార్లపై భారీ ఆఫర్‌! వెన్యూ నుంచి ఎక్సెంట్‌ వరకు పూర్తి జాబితా ఇదే!

Hyundai Cars April 2026 Offer: ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే హ్యూందాయ్ భారతీయ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు అన్ని మోడల్స్‌పై అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హ్యుందాయ్ కార్లపై రూ.1.10 లక్షల వరకు ఆదా అవకాశం.
  • గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా, ఐ20 లపై భారీ తగ్గింపు.
  • ఎక్స్‌టర్, వెన్యూ, క్రెటా ఎస్‌యూవీలపై కూడా ఆఫర్లు ఉన్నాయి.
  • వెర్నా, కోన ఎలక్ట్రిక్ వాహనాలపై అత్యధిక ప్రయోజనాలు లభిస్తున్నాయి.

Hyundai Cars April 2026 Offer: భారతీయ మార్కెట్‌లో కార్లు కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అందుకే కార్లు వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అయితే ఆర్థిక సంవత్సరం చివరిలో అంటే ఫిబ్రవరి, మార్చిలో ఆఫర్స్ ఇవ్వడం సర్వసాధారణమైపోయింది. కానీ ఇప్పుడు హ్యూందాయ్‌ మోటార్ ఇండియా మాత్రం ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఆఫర్ ప్రకటించింది. ఈ నెలలోనే కంపెనీ తన హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌లు, ఎస్‌యూవీలు, ఎలక్ట్రిక్ వాహనాలు దాదాపు అన్ని మోడల్స్‌పై ఏదో ఒక ఆఫర్ రన్ చేస్తోంది. నగదు తగ్గింపు, ఎక్చేంజ్‌ బోనస్‌, స్క్రాపేజ్‌, కార్పొరేట్ డిస్కౌంట్ ఇలా ఏదో పేరుతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.  వీటి ద్వారా దాదాపు 1.10లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఇస్తోంది. 

కొత్తగా కారు కొనాలి ఉన్నా, ఉన్న కారును మార్చేసి కొత్త కారు కొనాలని ఆలోచన ఉన్న వారికి ఇదో మంచి అవకాశం. వచ్చే కొన్ని నెలల్లో కార్లలో విపరీతమైన అప్‌డేట్‌లు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఉన్న స్టాక్‌ను క్లియర్ చేసేందుకు హ్యూందాయ్‌ ఈ ఆఫర్ ప్రకటించింది. తగ్గింపుతో ఉన్న మెడల్స్‌ను అమ్మేయాలని ఆలోచనతో మంచి ప్రజాదరణ ఉన్న మోడల్స్‌పై తగ్గింపు ధరలకే ఇచ్చేస్తోంది. 

గ్రాండ్‌ఐ10 నియోస్‌, ఆరా, ఐ20పై భారీ తగ్గింపు 

తక్కువ బడ్జెట్‌లో కారు కొనాలనే ఆలోచన ఉన్నట్టు అయితే ఈ నెలలోనే హ్యూందాయ్‌ గ్రాండ్‌ ఐ 10 నియోస్‌ ఒక మంచి ఎంపిక కావచ్చు. దీనిపై 68వేల రూపాయల తగ్గింపు ఉంటుంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్‌ ఇంజిన్‌తో పని చేస్తుంది. CNG ఆప్షన్‌తో ఆప్షన్ కూడా ఈ కారులో ఉంది. పెట్రోల్ గురించి భయపడే వాళ్లు ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. హ్యూందాయ్‌ ఆరా సెడాన్‌పై కూడా నెలలో 20,000 వరకు తగ్గింపు లభిస్తోంది. ఇది నియోస్‌లో ఉన్న ఇంజన్ ఆప్షన్‌లనే అందిస్తుంది. కానీ ఎక్కువ బూట్ స్పేస్‌తో వస్తుంది. హ్యూందాయ్‌ ఐ20పై కూడా 58వేల వరకు తగ్గింపు ఇస్తోంది.  దీని స్పోర్ట్స్, ఆస్టా వేరియంట్లు అత్యధిక ప్రయోజనాలను పొందుతున్నాయి. ఐ 20 పెట్రోల్‌ ఇంజిన్, ఎన్‌లైన్ వేరియంట్‌తో  వస్తోంది. 

ఎస్‌యూవీ విభాగంలో ఎక్స్ట్‌ర్‌, వెన్యూ, క్రెటా ఆఫర్లు

ఎస్‌యూవీ విభాగంలో కూడా వినియోగదారులకు మంచి ఆఫర్స్ ఇస్తోంది. హ్యూందాయ్ ఎక్స్ట్‌ర్‌ పాత స్టాక్‌పై 43వేల వరకు తగ్గింపుతో లభిస్తుండగా, కొత్‌త మోడల్‌పై తగ్గింపు తక్కువగా ఉంది. ఇది పెట్రోల్, సీఎన్జీ రెండు ఆప్షన్‌లలోనూ అందుబాటులో ఉంది. హ్యూందాయ్‌ వెన్యూపై ఈసారి సుమారు ఐదు వేల వరకు తగ్గింపు లభిస్తోంది. హ్యూందాయ్‌ క్రెటాపై 55వేల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఇది పెట్రోల్‌ టర్బో-పెట్రోల్‌ , డీజీల్‌ అనే మూడు ఇంజన్ ఆప్షన్‌లలోనూ లభిస్తోంది. దీంతో ఇది మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఒక బలమైన ఎంపికగా నిలుస్తోంది. 

వెర్నా- క్రెటా ఎలక్ట్రిక్‌ వాహనం నుంచి  అత్యధిక ప్రయోజనాలు

అన్ని మోడల్స్‌లో వెర్నా మోడల్‌పై ఎక్కువగా ఇస్తోంది. దీని పాత మోడల్‌పై 1.10 లక్షల వరకు డిస్కౌంట్‌ ఇస్తోంది. ఇది శక్తివంతమైన ఇంజన్, ఆకట్టుకునే ఫీచర్లను కలిగి ఉంది. హ్యూందాయ్‌ క్రెట ఎలక్ట్రిక్‌ కూడా లక్ష వరకు ప్రయోజనాలను అందిస్తోంది. పెట్రోల్‌, డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలనుకునే వారికి ఈ ఆఫర్ ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. 

Frequently Asked Questions

హ్యూందాయ్ ఏయే మోడల్స్‌పై ఆఫర్లు అందిస్తోంది?

హ్యూందాయ్‌ గ్రాండ్‌ ఐ10 నియోస్‌, ఆరా, ఐ20, ఎక్స్ట్‌ర్‌, వెన్యూ, క్రెటా, వెర్నా, మరియు క్రెట ఎలక్ట్రిక్‌ వంటి దాదాపు అన్ని మోడల్స్‌పై ఆఫర్లు ఇస్తోంది.

ఏ మోడల్‌పై అత్యధిక తగ్గింపు లభిస్తోంది?

వెర్నా మోడల్‌పై అత్యధికంగా 1.10 లక్షల వరకు తగ్గింపు లభిస్తోంది. క్రెట ఎలక్ట్రిక్‌పై కూడా లక్ష వరకు ప్రయోజనాలు ఉన్నాయి.

హ్యూందాయ్‌ ఈ ఆఫర్లను ఎందుకు ప్రకటించింది?

రాబోయే నెలల్లో కార్లలో మరిన్ని అప్‌డేట్‌లు వస్తున్నందున, ప్రస్తుత స్టాక్‌ను క్లియర్ చేయడానికి హ్యూందాయ్‌ ఈ ఆఫర్ ప్రకటించింది.

తక్కువ బడ్జెట్‌లో ఏ కారు మంచి ఎంపిక?

తక్కువ బడ్జెట్‌లో కారు కొనాలనుకునేవారికి హ్యూందాయ్‌ గ్రాండ్‌ ఐ10 నియోస్‌ ఒక మంచి ఎంపిక, దీనిపై 68వేల రూపాయల వరకు తగ్గింపు ఉంది.

టాప్ హెడ్ లైన్స్

హ్యుందాయ్ కారు కొనేవాళ్లకు బిగ్‌ అలర్ట్.. సెప్టెంబర్ నుంచి ధరలు పెంపు - ఏ మోడల్‌పై ఎంత పెరుగుతుంది?
కొత్త కారు కొనేవాళ్లకు అలెర్ట్‌ - మరికొన్ని రోజుల్లో రేట్లు పెంచబోతున్న హ్యుందాయ్‌
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని 50 ఏళ్లుగా వాడుతున్న బ్రెజిల్.. ఇప్పుడు అక్కడి కార్లు, బైకుల పరిస్థితి ఏంటి?
బ్రెజిల్‌లో 50 ఏళ్లుగా ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వినియోగం - అక్కడి కార్లు, బైక్‌లకు ఏం కాలేదా?
రోజూ కాలేజీ, ఆఫీస్‌కు వెళ్లిరావడానికి బెస్ట్ ఆప్షన్.. రూ.15,000 లోపే వచ్చే ఎలక్ట్రిక్‌ సైకిళ్లు ఇవే
పెట్రోల్ ఖర్చుకు చెక్.. రూ.15,000 లోపే స్టైలిష్‌ ఎలక్ట్రిక్ సైకిళ్లు, 40km వరకు ప్రయాణం!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
New York India Day Parade:న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
న్యూయార్క్ మాడిసన్ అవెన్యూలో వైభవంగా 44వ ఇండియన్ డే పరేడ్‌!అలరించిన పూజా హెగ్డే, అడవి శేష్‌
Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Embed widget