Remove Fog From Windscreen: కారు విండ్ స్క్రీన్ నుంచి ఫాగ్ రిమూవ్ చేయడం ఎలా? - ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Car Driving Tips in Winter: చలికాలంలో కారు డ్రైవ్ చేసేటప్పుడు విండ్ షీల్డ్‌పై పొగ మంచు పేరుకుపోతే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
How To Remove Fog From Windscreen: దేశవ్యాప్తంగా ప్రస్తుతం తీవ్రమైన చలి ఉంది. ఈ చలికాలంలో ప్రజలు ప్రయాణాలను ఇష్టపడతారు. కానీ ఈ సీజన్‌లో ప్రయాణించడం అంత సులభం కాదు. ఎందుకంటే శీతాకాలంలో విజిబిలిటీ తగ్గుతుంది. వాహనం గ్లాస్‌పై పొగమంచు కారణంగా రహదారి స్పష్టంగా కనిపించదు. దీని కోసం డ్రైవర్ విండ్‌స్క్రీన్‌పై పొగమంచును మళ్లీ మళ్లీ శుభ్రం చేయాలి.
కిటికీల నుంచి పొగమంచును తొలగించడానికి ప్రజలు పదే పదే కారు నుంచి దిగడానికి చాలా సమయం గడుపుతారు. కానీ ఈరోజు మేము ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చెబుతున్నాం. దీంతో విండ్‌స్క్రీన్‌పై పొగమంచు కేవలం ఒక్క నిమిషంలో క్లియర్ అవుతుంది. దీని కోసం మీరు కారు నుంచి బయటకు కూడా వెళ్లవలసిన అవసరం లేదు.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
శీతాకాలంలో కిటికీల నుంచి పొగమంచును ఎలా తొలగించాలి?
కారు విండ్‌స్క్రీన్‌పై పొగమంచును తొలగించడానికి మీరు కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మాన్యువల్ మోడ్‌లో కారును నడిపే వారి కోసం ఇవి ఉపయోగపడతాయి.
- కారు గ్లాస్ నుంచి పొగమంచు తొలగించడానికి, ముందుగా కారును ఇన్నర్ సర్క్యులేషన్ లేదా ఔటర్ సర్క్యులేషన్ మీద ఉంచాలి.
- దీని తర్వాత ఏసీని ఆన్ చేయండి.
- అప్పుడు కారు టెంపరేచర్‌ను కొద్దిగా హీటర్ వైపుకు తిప్పండి.
- దీని తరువాత కారులో ఎయిర్‌ను ఫుల్ మోడ్‌లో ఉంచండి.
- ఇలా చేయడం వల్ల కారులో వేడిగానీ, చలిగానీ ఉండదు. అలాగే విండ్‌స్క్రీన్‌పై ఉన్న పొగమంచు కూడా కేవలం ఒక్క నిమిషంలో మాయమైపోతుంది.
మీ కారుకు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటే దీని కోసం మీరు నేరుగా కారు ఉష్ణోగ్రతను పెంచాలి. దీంతో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉన్న కార్లలో డీఫాగర్ మోడ్ కూడా ఉంటుంది. ఈ ప్రక్రియతో పొగమంచును సులభంగా తొలగించవచ్చు. కారుపై పేరుకుపోయిన పొగమంచును తొలగించడం కూడా చాలా ముఖ్యం. తద్వారా మీరు ప్రమాదాన్ని నివారించవచ్చు.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
Driving in dense fog? These tips should help!
— Sunderdeep - Volklub (@volklub) January 16, 2024
- Prefer low beam
- Switch on the fog lamps
- Try not to exceed 25 kmph
- Prefer looking down at the road and keep one hand on the handbrake (I do that while driving an AT)
- If reflectors are there with white markings, just… pic.twitter.com/9sgZsxEUem
A dirty, greasy windscreen is a danger to your driving, it inhibits visibility. The greasiness can be a result of touching the windscreen, off-gassing from the interior plastics and use of dashboard sprays. So how can you clean it properly and also prevent fogging:... pic.twitter.com/guBKEyNWcD
— Vanilla (@VanillaCars) April 25, 2022