అన్వేషించండి

Real Life Finance Story: నెల జీతం రూ.34 వేలే, రూ.7 లక్షల కారును లోన్‌ తీసుకోకుండా కొన్నాడు - ఎలా ప్లాన్‌ చేశాడంటే?

Car Savings Plan: ఇండోర్‌కు చెందిన ఒక టెక్నీషియన్‌, నెలకు కేవలం రూ.34,000 సంపాదిస్తూ, మూడు సంవత్సరాల్లో రూ.7 లక్షల కారును ఒక్క రూపాయి అప్పు కూడా లేకుండా కొనుగోలు చేశాడు.

Buy A Car Without Loan: కారు కొనాలంటే ఒక పెద్ద జీతం అవసరమా?, లేదా బ్యాంక్‌లో నుండి లోన్‌ తీసుకోవాల్సిందేనా?. ఇవన్నీ అవసరం కాదు, అక్కరలేదు. ఒక చిన్న ప్రణాళిక, క్రమబద్ధమైన పొదుపు, కొద్దిగా ఓపిక ఉంటే చాలు - మీరు కూడా లోన్‌ లేకుండానే కొత్త కారు కొంటారు.

సరిగ్గా ఇదే నిరూపించాడు ఇండోర్‌కు చెందిన ఒక 27 ఏళ్ల టెక్నీషియన్‌. అతని నెల జీతం రూ.34,000 మాత్రమే. అయినా, పక్కా ప్లాన్‌తో, అతను మూడు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా లోన్‌ తీసుకోకుండా రూ. 7 లక్షల విలువైన కారు కొనుగోలు చేశాడు. చార్టెడ్‌ అకౌంటెంట్‌ అభిషేక్‌ వాలియా ఈ కథనాన్ని తన లింక్డిన్‌ అకౌంట్‌లో షేర్‌ చేశారు, ఇప్పుడా పోస్ట్‌ వైరల్‌గా మారింది. స్ఫూర్తిదాయకమైన నిజ జీవిత పాఠంగా ప్రశంసలు అందుకుంటోంది.

సాధారణమైన ప్రణాళిక - అద్భుతమైన ఫలితం
వాలియా చెప్పిన వివరాల ప్రకారం, ఆ టెక్నీషియన్‌ వద్ద అప్పటికే రూ. 1 లక్ష రికరింగ్‌ డిపాజిట్‌ (RD)లో ఉంది. అతనికి క్రెడిట్‌ కార్డు కూడా లేదు, నిజానికి ఇదే పెద్ద ప్లస్‌ పాయింట్‌గా మారింది. అంటే, అతనికి క్రెడిట్‌ కార్డ్‌ అప్పులు లేవు. అతను, మూడేళ్ల క్రితం నుంచి, ప్రతి నెలా రూ. 6,000 ను షార్ట్‌ టెర్మ్‌ డెట్‌ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేశాడు. నెలకు మరో రూ. 2,000 చొప్పున, కార్‌ కోసం ప్రత్యేకంగా ఓ రికరింగ్‌ డిపాజిట్‌లో వేయడం ప్రారంభించాడు.

సంపాదన నుంచి పొదుపు చేయడం ప్రారంభించిన ఆ టెక్నీషియన్‌, వారాంతాల్లో ఫ్రీలాన్స్‌ వైరింగ్‌ పనులు చేస్తూ ప్రతి నెలా అదనంగా రూ. 5,000 సంపాదించాడు.

మూడు సంవత్సరాల తర్వాత...

ఇలా క్రమశిక్షణతో పొదుపు చేస్తూ, అతను మూడేళ్లలో రూ. 2.5 లక్షలను మ్యూచువల్‌ ఫండ్స్‌ ద్వారా, రూ. 2.10 లక్షలను RDల ద్వారా పొదుపు చేశాడు. అదనంగా, ఫ్రీలాన్స్‌ పనుల ద్వారా రూ. 2 లక్షలు, మూడేళ్లలో దీపావళి బోనస్‌గా రూ. 50,000, పాత స్కూటర్‌ అమ్మడం ద్వారా మరో రూ. 10,000 సంపాదించాడు. మొత్తంగా, అతని దగ్గరకు రూ. 7.10 లక్షలు వచ్చి చేరింది. ఆ డబ్బుతో, ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా కొత్త కారును కొనుగోలు చేశాడు. 

"చిన్న జీతగాడికి ఇది పెద్ద విజయం. ఇది చిన్న జీతంతో ఇది సాధ్యమే. కానీ, పెద్ద డిసిప్లిన్‌, ఖచ్చితమైన ప్రణాళిక అవసరం’’ - అభిషేక్‌ వాలియా

మీరూ ఇలా చేయవచ్చు
ఈ కథనం, సొంత కారు కల ఉన్న మన లాంటి చిరుద్యోగులకు & అల్పాదాయ వ్యక్తులకు ఒక మంచి పాఠం. వెయ్యి ఉద్యోగాలు మారినా, లక్షల జీతం వచ్చినా లాభం లేదు – మన అసలైన లక్ష్యం ఏమిటో తెలుసుకుని, దానికి తగ్గట్టు వాస్తవికమైన ప్రణాళిక వేసుకుంటే చాలు, లక్ష్య సాధన పూర్తవుతుంది.

కారు కొనాలంటే లోన్‌ తీసుకోవడం తప్పనిసరి కాదు
మీ ఆదాయాన్ని బట్టి పొదుపును ప్రారంభించండి. పొదుపు చేసే అలవాటు తెచ్చుకోండి. అవసరమైతే అదనపు ఆదాయం కోసం చిన్న చిన్న పనులు చేయండి. మూడు సంవత్సరాలు గట్టిగా ఓపిక పట్టిన మనిషి, ఈ రోజు మంచి కారులో తిరుగుతున్నాడు – ఎలాంటి EMI లేకుండా!.

ఓ మంచి మాటను గుర్తు పెట్టుకుందా
పెద్ద కలలు సాకారం కావాలంటే పెద్ద జీతం అవసరం లేదు - చిన్న చిత్తశుద్ధి, క్రమబద్ధమైన ప్రణాళిక, ఓపిక చాలు. మీరు కోరుకునే కారుకు మీరు యజమాని అవుతారు. ఇప్పుడు మిగిలింది... మీరు ఎప్పుడు మొదలు పెడతారన్నదే.

టాప్ హెడ్ లైన్స్

MG Motor Car Price Hike: ఈ 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
MG Motors 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
Buying New Car: దీపావళికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా! డిసెంబర్‌ బెనిఫిట్స్ తెలుసుకుంటే బెటర్
దీపావళికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా! డిసెంబర్‌ బెనిఫిట్స్ తెలుసుకుంటే బెటర్
Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Diwali Offers: హోండా, వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ సెడాన్లపై దీపావళి బంపర్ ఆఫర్లు.. రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్‌
ఈ దీపావళికి హైయెస్ట్‌ ఆఫర్లు అందిస్తున్న 5 సెడాన్లు.. రూ.1.25 లక్షల వరకు ఆదా!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seifert, Phillips Carnage:  ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Lokesh Visits Raptadu Victim: రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
MG Motor Car Price Hike: ఈ 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
MG Motors 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
Anakapalli Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Dastagiri Intercepts Jagan: వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
Embed widget