అన్వేషించండి

Upcoming SUVs: విన్‌ఫాస్ట్ నుంచి మహీంద్రా వరకు - ఈ నెలలో 5 కొత్త కార్లు లాంచ్‌

Upcoming SUVs India In August 2025: వోల్వో, మెర్సిడెస్, మహీంద్రా & విన్‌ఫాస్ట్ నుంచి కొత్త SUVలు, కాన్సెప్ట్ కార్లు ఆగస్టు 2025లో భారత మార్కెట్లో విడుదల కానున్నాయి.

SUV Launch In August 2025: భారతదేశంలోని పాపులర్‌ కార్‌ కంపెనీలు ఈ నెలలో (ఆగస్టు 2025) కొత్త వాహనాలను లాంచ్‌ చేయబోతున్నాయి. SUV & ఎలక్ట్రిక్ విభాగంలో హై రేంజ్‌ డిమాండ్‌కు అనుగుణంగా.. వోల్వో, మెర్సిడెస్, మహీంద్రా & విన్‌ఫాస్ట్ వంటి కంపెనీలు కొత్త మోడళ్ల ఓవర్‌లుక్‌ అందించాయి. మీరు ఆగస్టులో కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ వార్త మీకు బాగా ఉపయోగపడుతుంది.

1. వోల్వో XC60 ఫేస్‌లిఫ్ట్
వోల్వో XC60 ఫేస్‌లిఫ్ట్ ఆగస్టు ప్రారంభంలోనే భారతీయ మార్కెట్లోకి రాబోతోంది. ఈ కారులో కొత్త గ్రిల్ డిజైన్, మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, స్మోక్డ్ టెయిల్-లైట్లు & కొత్త బాడీ కలర్స్ వంటి చిన్నపాటి ఎక్స్‌టీరియర్‌ మార్పులు ఉన్నాయి. దీని ఇంటీరియర్‌లో అతి పెద్ద మార్పు 11.2-అంగుళాల టచ్‌స్క్రీన్, ఇది క్వాల్‌కామ్ కొత్త స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌పై నడుస్తుంది, మునుపటి కంటే రెండు రెట్లు వేగంగా ఉంటుంది. ఇంజిన్‌లో మార్పు లేదు, అదే 2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఇది 250hp పవర్ ఇస్తుంది & 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో స్మూత్‌గా పరుగెడుతుంది. ఇది ఆల్-వీల్ డ్రైవ్ (AWD) SUV అవుతుంది.

2. మెర్సిడెస్-AMG CLE 53 కూపే 
CLE 300 కాబ్రియోలెట్ వెర్షన్‌ కంటే మెరుగ్గా ఉండే ప్రీమియం స్పోర్ట్స్ కారు 'మెర్సిడెస్ AMG CLE 53 కూపే'. ఇది పాన్‌-అమెరికానా గ్రిల్, ఫ్లేర్డ్ ఫెండర్లు, గ్లోస్-బ్లాక్ డిఫ్యూజర్ & నాలుగు ఎగ్జాస్ట్ పైపులతో స్పోర్టీ డిజైన్‌తో వస్తోంది. ఇంటీరియర్‌లో.. 11.9-అంగుళాల టచ్‌స్క్రీన్, 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే & అల్కంతారా మెటీరియల్‌తో (ఇదొక లగ్జరీ మెటీరియల్‌) చేసిన AMG స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంటుది. 64 కలర్ యాంబియంట్ లైటింగ్ & వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే & ఆండ్రాయిడ్ ఆటో సహా అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఉన్నాయి. 

3. కొత్త మహీంద్రా కాంపాక్ట్ SUV 
మహీంద్రా తన కొత్త కాంపాక్ట్ SUVని ఆగస్టు 15న విడుదల చేయబోతోంది, ఇది కంపెనీ కొత్త 'nu' మోనోకోక్ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా తయారైంది. ఈ వాహనం 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉంటుంది & బొలెరో లేదా XUV 3XO కంటే భిన్నమైన డిజైన్ & ఫీచర్లతో లాంచ్‌ అవుతుంది. ఇటీవల దీని టెస్టింగ్ ప్రోటోటైప్ కనిపించింది, దీనిలో థార్ రాక్స్‌ను పోలి ఉండే డిజైన్ కనిపించింది. ఈ కారుకు 1.2-లీటర్ పెట్రోల్ లేదా 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌ ఉండవచ్చు & భవిష్యత్తులో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను కూడా జోడించవచ్చు.

4. మహీంద్రా విజన్ కాన్సెప్ట్ సిరీస్ 
మహీంద్రా, ఆగస్టు 15నే, తన Vision కాన్సెప్ట్ కార్ సిరీస్‌ను ప్రదర్శించబోతోంది. ఈ నాలుగు కాన్సెప్ట్‌లకు SXT, X, T & S అని పేర్లు పెట్టింది. Vision SXT అనేది థార్ లాగా బలమైన SUV కావచ్చు. Vision X అనేది XEV 7e మోడల్‌కు కాంపాక్ట్ వెర్షన్ కావచ్చు. Vision T అనేది ఎలక్ట్రిక్ థార్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌ కావచ్చు & Vision S అనేది స్కార్పియో కొత్త వెర్షన్ అని భావిస్తున్నారు. వాటి పవర్‌ట్రెయిన్, లాంచ్ తేదీ & లక్షణాల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు, కానీ డిజైన్‌ గురించి చాలా స్పష్టంగా తెలుస్తోంది.

5. విన్‌ఫాస్ట్‌ VF7
వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ బ్రాండ్ VinFast, తన మొదటి కారు VF7 తో భారత మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. 4,545 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్ SUV ప్రీమియం క్రాస్-ఓవర్ డిజైన్‌తో వస్తుంది. దీనికి 19-అంగుళాల అల్లాయ్ వీల్స్ & 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి. ఇంటీరియర్‌లో 12.9-అంగుళాల టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, రిక్లైనింగ్ రియర్ సీట్లు & లెవెల్ 2 ADAS తో 7 ఎయిర్‌బ్యాగ్‌లు ఇచ్చారు. ఈ కారుకు 70.8kWh LFP బ్యాటరీ ఉంది, ఇది 7.2kW AC & CCS2 DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ కారు రెండు వెర్షన్లలో వస్తుంది - 204hp FWD & 350hp AWD. వీటి డ్రైవింగ్‌ రేంజ్‌ వరుసగా 450 కి.మీ. & 431 కి.మీ.

టాప్ హెడ్ లైన్స్

రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
రూ. 2 లక్షల డౌన్ పేమెంట్‌తో Tata Nexon కొంటే, EMI ఎంత చెల్లించాలి
గత ఆరు నెలల్లో జనం ఎగబడి కొన్న కార్లు ఇవే - బాలెనో, డిజైర్, విండ్సర్‌కు జేజేలు
పెట్రోల్‌కు బలెనో.. CNGకి డిజైర్.. EVల్లో విండ్సర్ - 2026లో టాప్ సెల్లింగ్‌ కార్లు ఇవే!
టాటా నెక్సాన్ కామో ఎడిషన్‌లో ఆశ్చర్యపరిచే మార్పులు.. కొత్త రంగులు, 12.3 అంగుళాల స్క్రీన్, మరెన్నో!
టాటా నెక్సాన్‌ కామో ఎడిషన్ లాంచ్ - రూ.9.99 లక్షలే! ఏంటి దీని స్పెషాలిటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
Embed widget