Skoda Kushaq ఫేస్‌లిఫ్ట్‌లో పెరిగిన AC పవర్ - కొత్త కంప్రెసర్‌తో ఇక చల్లదనం పక్కా, నడివేసవిలోనూ కంఫర్టబుల్ డ్రైవ్
Skoda Kushaq లో ఇప్పటి వరకు కనిపించిన బలహీన AC సమస్యకు 2026 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో పరిష్కారం దొరికింది. కొత్త వేరియబుల్ జియోమెట్రీ కంప్రెసర్, మెరుగైన పైపింగ్‌తో ఇక వేడిలోనూ మంచి కంఫర్ట్ ఉంటుంది.

Skoda Kushaq AC Problem Solved: భారత మార్కెట్‌లో Skoda Kushaq విడుదలైనప్పటి నుంచి డ్రైవింగ్ అనుభవం, సేఫ్టీ, స్టీరింగ్ ఫీల్ విషయంలో మంచి పేరు సంపాదించింది. కానీ ఒక విషయంలో మాత్రం చాలా మంది యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అదే AC పనితీరు. ముఖ్యంగా వేసవి కాలంలో క్యాబిన్‌ను సరైన రీతిలో చల్లబర్చలేకపోతుందనే ఫిర్యాదు ఎక్కువగా వినిపించింది. ఈ సమస్యను Skoda India సీరియస్‌గా తీసుకుని, 2026 Skoda Kushaq Facelift వెర్షన్‌లో AC సిస్టమ్‌ను పూర్తిగా అప్‌గ్రేడ్ చేసింది.
అసలు సమస్య ఏంటి?
ఫేస్‌లిఫ్ట్‌కు ముందు ఉన్న Kushaqలో ఫిక్స్‌డ్ జియోమెట్రీ కంప్రెసర్‌ను ఉపయోగించారు. ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కంప్రెసర్‌ను ఎంపిక చేసినప్పటికీ, భారత వాతావరణ పరిస్థితుల్లో ఇది సరైన కూలింగ్ ఇవ్వలేకపోయింది. ఇదే సమస్య Skoda-VW India 2.0 ప్లాట్‌ఫామ్‌పై వచ్చిన చాలా మోడళ్లలో కనిపించింది.
ఇప్పుడు Skoda ఏం మార్చింది?
2026 Kushaq ఫేస్‌లిఫ్ట్‌లో Skoda వేరియబుల్ జియోమెట్రీ కంప్రెసర్‌ను ప్రవేశపెట్టింది. ఇది అవసరాన్ని బట్టి కూలింగ్ సామర్థ్యాన్ని సర్దుబాటు చేస్తుంది. అంటే తక్కువ వేడి ఉన్నప్పుడు తక్కువగా, తీవ్రమైన వేడిలో ఎక్కువగా పని చేస్తుంది. దీని వల్ల క్యాబిన్ చాలా వేగంగా చల్లబడుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ కొత్త కంప్రెసర్ ధర పాతదాని కంటే కేవలం సుమారు రూ.2,000 మాత్రమే ఎక్కువ.
అంతేకాదు, AC గ్యాస్ పైపింగ్‌ను కూడా ఆప్టిమైజ్ చేశారు. గ్యాస్ ఫ్లో సాఫీగా ఉండేలా పైపింగ్ మార్పులు చేయడంతో కూలింగ్ పనితీరు మరింత మెరుగైంది. ఇది కేవలం చిన్న మార్పులా అనిపించినా, యూజర్ అనుభవంలో మాత్రం పెద్ద తేడా చూపిస్తుంది.
ఇతర Skoda-VW కార్లకు కూడా ఇదే మార్పులా?
ఈ ఏడాది భారత మార్కెట్‌లో Skoda Slavia, Volkswagen Virtus, Volkswagen Taigun మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్‌లు రావొచ్చని అంచనా. ఈ మోడళ్లన్నింటిలోనూ ఇదే అప్‌గ్రేడ్ చేసిన AC సిస్టమ్ ఉండే అవకాశం ఉంది. కొత్త డిజైన్, అదనపు ఫీచర్లు, 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో పాటు ఈ AC మార్పు యూజర్లకు పెద్ద రిలీఫ్ ఇవ్వనుంది.
ధరల వివరాలు (తెలుగు రాష్ట్రాల కోసం)
విజయవాడలో ఆన్ రోడ్ ధర
ఎక్స్-షోరూమ్ ధర: రూ. 10,66,000
ఇండివిడ్యువల్ రిజిస్ట్రేషన్: రూ. 1,89,220
ఇన్సూరెన్స్: రూ. 45,326
ఇతర చార్జీలు: రూ. 11,160
మొత్తం ఆన్ రోడ్ ధర: సుమారు రూ. 13,11,706
హైదరాబాద్‌లో ఆన్ రోడ్ ధర
ఎక్స్-షోరూమ్ ధర: రూ. 10,66,000
ఇండివిడ్యువల్ రిజిస్ట్రేషన్: రూ. 1,99,880
ఇన్సూరెన్స్: రూ. 46,378
ఇతర చార్జీలు: రూ. 11,160
మొత్తం ఆన్ రోడ్ ధర: సుమారు రూ. 13,23,418
మొత్తం మీద, Skoda Kushaqలో ఉన్న బలహీన AC సమస్యను కంపెనీ చివరికి సరిచేసింది. చిన్న అప్‌డేట్‌లా అనిపించినా, భారత వాతావరణానికి అత్యంత అవసరమైన మార్పు ఇది. కొత్త ఫేస్‌లిఫ్ట్‌తో Kushaq కేవలం డ్రైవింగ్‌లోనే కాదు, రోజువారీ కంఫర్ట్‌లోనూ మరింత నమ్మకంగా మారనుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















