Ola Roadster On Loan: రూ.10 వేల డౌన్‌పేమెంట్‌తో ఓలా రోడ్‌స్టర్ బైక్ కొంటే నెలకు ఎంత EMI కట్టాలి?
Ola Roadster On X Bank Loan EMI: ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్ 4.5 kWh బ్యాటరీ ప్యాక్, 9.1 kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చింది. బిగ్ బ్యాటరీ ప్యాక్‌తో 500km రేంజ్ ఇవ్వగలదు.

Ola Roadster On X Plus Price, Bank Loan, EMI Details: బెస్ట్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో సంచలనం సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ, తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ రోడ్‌స్టర్ ఎక్స్ డెలివెరీలను ఈ నెల 23 నుంచి (23 మే 2025) ప్రారంభించింది. ఈ కంపెనీ, ఎంట్రీ లెవల్ X సిరీస్‌లో రోడ్‌స్టర్ ఎక్స్ (Roadster X), రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ (Roadster X Plus) మోడళ్లను విడుదల చేసింది. ఇవి రెండూ కూడా మైలేజ్‌లో మాన్‌స్టర్ బైక్‌లు. కంపెనీ డేటా ప్రకారం, ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ బ్యాటరీని పూర్తిగా రీఛార్జ్ చేస్తే, ఈ బైక్ 501 కిలోమీటర్ల రైడింగ్ రేంజ్ (Ola Roadster X Plus Electric Bike Range) ఇస్తుంది. ఈ బైక్ కొన్న వ్యక్తి రోజుకు సగటును 50 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తారు అనుకుంటే, ఈ టూవీలర్‌ను ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత 10 రోజుల వరకు ఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా ప్రయాణించవచ్చు. లేదా, సింగిల్ ఛార్జ్‌తో హైదరాబాద్ - విజయవాడ మధ్య దాదాపుగా ఒక రౌండ్ కొట్టి రావచ్చు. ఈ ఓలా బైక్ ఓలా జెన్ 3 ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందింది.
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్ ధర
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ బైక్ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో మార్కెట్‌లోకి వచ్చింది. అవి - 4.5 kWh బ్యాటరీ ప్యాక్ & 9.1 kWh బ్యాటరీ ప్యాక్. ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ 4.5 kWh బ్యాటరీ ప్యాక్ బైక్ ఎక్స్-షోరూమ్ ధర (Ola Roadster X Plus 4.5 kWh ex-showroom price) రూ. 1.35 లక్షలు కాగా; ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ 9.1 kWh బ్యాటరీ ప్యాక్ బండి ఎక్స్-షోరూమ్ ధర (Ola Roadster X Plus 9.1 kWh ex-showroom price) రూ. 2 లక్షలు.
తెలుగు రాష్ట్రాల్లో ఆన్-రోడ్ ధర
ఎక్స్-షోరూమ్ రేటు, బండి రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఇతర ఖర్చులు కలుపుకుని... ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ 4.5 kWh బ్యాటరీ ప్యాక్ బైక్ ఆన్-రోడ్ ధర (Ola Roadster X Plus 4.5 kWh on-road price) రూ. 1.47 లక్షలు కాగా; 9.1 kWh బ్యాటరీ ప్యాక్ బండి ఆన్-రోడ్ ధర (Ola Roadster X Plus 9.1 kWh on-road price) రూ. 2.18 లక్షలు అవుతుంది.
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ బైక్ ఫీచర్లు
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ బైక్‌కు 11 kW పీక్ పవర్ మోటార్ ఉంది, ఇది కేవలం 2.7 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 9.1 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఈ బండి 501 km రేంజ్ ఇవ్వగలదని కంపెనీ ప్రకటించింది. ఈ బైక్‌లో మూడు రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి, పరిస్థితులను బట్టి రైడింగ్‌ను మోడ్‌ను మార్చుకోవచ్చు.
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ బైక్ ఫైనాన్స్ ప్లాన్
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ బైక్ కొనాలనే కోరిక మీకు ఉన్నా, అంత డబ్బు మీ దగ్గర లేకపోతే, ఈ బండిని ఫైనాన్స్‌లోనూ (Ola Roadster X Plus Finance Plan) తీసుకోవచ్చు. మీ దగ్గర కేవలం రూ. 10,000 ఉంటే చాలు, ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ బైక్‌ను ఇంటికి తీసుకువెళ్లవచ్చు. మిగిలిన డబ్బాను బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ సర్దుబాటు చేస్తుంది. ఆ డబ్బును సులభమైన EMIల్లో తిరిగి కట్టేస్తే సరిపోతుంది.
ప్రతి నెలా EMI ఎంత అవుతుంది?
తెలుగు నగరాల్లో, ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ప్లస్ 4.5 kWh బ్యాటరీ ప్యాక్ బైక్ కొనడానికి మీరు రూ. 10,000 డౌన్ పేమెంట్ చేస్తే, మిగిలిన రూ. 1.37 లక్షలను బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ నుంచి రుణంగా తీసుకోవచ్చు. మీరు 9% వార్షిక వడ్డీ రేటుతో ఈ లోన్ తీసుకున్నారనుకుంటే, 3 సంవత్సరాల పాటు రూ. 4,256 EMI చెల్లించాలి. 4 సంవత్సరాల కాలానికి లోన్ తీసుకుంటే, నెలనెలా రూ. 3,331 EMI కట్టాలి.





















