Kia Car For Middle Class: ఈ కియా కారు మిడిల్‌క్లాస్ ఫ్యామిలీకి బెస్ట్ - 6 ఎయిర్‌బ్యాగ్‌లున్నా రేటు తక్కువ!
Kia Syros: ఈ కియా కారు రెండు పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్స్‌తో వచ్చింది. ఈ రెండింటిలోనూ మాన్యువల్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఫెసిలిటీ ఉంది, మీ ఇష్టాన్ని బట్టి ఎంచుకోవచ్చు.

2025 Best Kia Car For Middle Class Family: ప్రస్తుతం, కియా కార్లు తెలుగు రాష్ట్రాల్లో తెగ కనిపిస్తున్నాయి. వీటికి భారీ వెయిటింగ్ పిరియడ్ ఉన్నప్పటికీ జనం ఈ బ్రాండ్ కార్లే కావాలంటూ వెంటబడుతున్నారంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. కియా బ్రాండ్‌లో, కియా సైరోస్ (Kia Syros) కూడా సైలెంట్‌గా పాపులర్ అయింది. మీ కుటుంబం కోసం ఒక కారు కొనాలని మీరు ఆలోచిస్తుంటే, మీ బడ్జెట్ గీత దాటని రేటులో & ఫీచర్ల పరంగా రాజీ పడని కార్ కావాలనుకుంటే.. కియా సైరోస్‌ను మీ లిస్ట్‌లో చేర్చుకోవచ్చు. ఇది ఒక కాంపాక్ట్ SUV.
కియా సైరోస్ ధర
తెలుగు రాష్ట్రాల్లో కియా సైరోస్ ఎక్స్-షోరూమ్ ధర (Kia Syros ex-showroom price) రూ. 9.50 లక్షల నుంచి రూ. 17.80 లక్షల వరకు ఉంటుంది. కియా సైరోస్ బేస్ వేరియంట్ ఆన్-రోడ్ ధర (Kia Syros on-road price, Hyderabad) హైదరాబాద్‌లో రూ. 11.20 లక్షలు. ఇందులో... ఎక్స్-షోరూమ్ ధర రూ. 9,49,900, RTO రూ. 1,32,986, కార్ ఇన్సూరెన్స్ రూ. 36,475, ఇతర ఛార్జీలు రూ. 800 కలిసి ఉంటాయి. కియా సైరోస్ బేస్ వేరియంట్ ఆన్-రోడ్ ధర విజయవాడలో (Kia Syros on-road price, Vijawavada) రూ. 11.23 లక్షలు. ఇది మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక స్థోమతకు సరిపోయే & డబ్బుకు తగిన విలువను అందించగల కారుగా నిలుస్తోంది.
కియా సిరోస్ పవర్‌ట్రెయిన్
కియా సైరోస్ కోసం రెండు శక్తిమంతమైన ఇంజిన్ ఆప్షన్స్‌లో (Kia Cyros Engine Options) ఒకదానిని ఎంచుకోవచ్చు. మొదటిది 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ & రెండోది 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్. ఈ రెండు ఇంజిన్ ఆప్షన్లు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ & ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లో లభిస్తున్నాయి. ఈ కాంపాక్ట్ SUV గరిష్టంగా 22 kmpl మైలేజీని అందించగలదు. కాబట్టి, ఇది బడ్జెట్ అనుకూలమైన & ఇంధన-సమర్థవంతమైన ఎంపికగానూ ఉంటుంది.
కియా సైరోస్ ప్రీమియం ఫీచర్లు
కియా సైరోస్‌లో ప్రీమియం ఫీచర్లు (Kia Syros Premium Features) & అధునాతన భద్రత సాంకేతికత కనిపిస్తుంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ & ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి, ఇవి ప్రతి ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి.
ప్రయాణీకుల భద్రత
మీ కుటుంబ సభ్యుల భద్రత (Kia Syros Safety Features) కోసం కియా సైరోస్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీల కెమెరా & లెవెల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి ఫీచర్లను ఫిట్ చేశారు. ఈ ఫీచర్ల కారణంగా కియా సైరోస్ సురక్షితమైన, స్మార్ట్ & ఫ్యామిలీ-ఫ్రెండ్లీ SUV అనిపించుకుంటుంది. కార్‌లో ప్రయాణించే పెద్దల భద్రత విషయంలో కియా సైయోరోస్ 32కి 30.21 స్కోర్ చేసింది. పిల్లల భద్రతలో ఈ కారు 49కి 44.42 మార్కులు సాధించింది.





















