Honda Unicorn EMI: రూ. 5000 EMI తో Honda Unicorn సొంతం చేసుకోండి! విజయవాడ, హైదరాబాద్ ఆన్-రోడ్ ధర & మైలేజ్ వివరాలు!
Honda Unicorn Finance Plan: హైదరాబాద్/విజయవాడలో హోండా యునికార్న్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,20 లక్షలు. దీని కొనుగోలు చేస్తే, ఆన్-రోడ్ ధర దాదాపు రూ.1.56 లక్షలు అవుతుంది.

Honda Unicorn Price, Mileage And Features In Telugu: హోండా పాపులర్ బైక్ యునికార్న్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఈ బైక్‌కు మన తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. యువత, పెద్దవాళ్లు - అందరికీ చక్కగా సరిపోయే డిజైన్ దీని సొంతం. ప్రస్తుత మార్కెట్‌లో TVS Apache RTR 160 & Bajaj Pulsar 150 వంటి బైక్‌లతో యూనికార్న్ పోటీ పడుతుంది. ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో హోండా యునికార్న్ ధర రూ. 1,20 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
మీరు హోండా యూనికార్న్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, పూర్తి డబ్బు ఒకేసారి చెల్లించాల్సిన అవసరమే లేదు. చాలా కొద్ది డబ్బును డౌన్‌పేమెంట్ చేసి EMIలో కూడా ఈ బండి కొనవచ్చు, ఓనర్ కావచ్చు.
విజయవాడలో, హోండా యునికార్న్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,19,327. రిజిస్ట్రేషన్ కోసం దాదాపు రూ. 16,000, ఇన్సూరెన్స్ కోసం దాదాపు రూ. 13,000, ఇతర అవసరమైన ఖర్చులు చెల్లించిన తర్వాత, బెజవాడలో ఈ బైక్ ఆన్-రోడ్ ధర (Honda Unicorn on-road price, Vijayawada) దాదాపు రూ. 1.56 లక్షలు.
హైదరాబాద్‌లోనూ యూనికార్న్ బేస్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,19,327. అయితే, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ వంటి ఖర్చులు కాస్త మారతాయి. ఫైనల్‌గా, భాగ్యనగరంలో ఈ మోటర్ సైకిల్‌ను దాదాపు 1.50 లక్షల ఆన్-రోడ్ రేటుకు (Honda Unicorn on-road price, Hyderabad) కొనవచ్చు.
రూ. 5000 EMIతో యూనికార్న్ ఓనర్ కావచ్చు
మీరు ఈ బైక్‌ను, హైదరాబాద్‌లో, లోన్ మీద కొనుగోలు చేయాలంటే కనీసం రూ. 10,000 డౌన్ పేమెంట్ చెల్లించాలి. దీని తర్వాత, మీరు రూ. 1.40 లక్షలకు ఫైనాన్స్ (లోన్) తీసుకోవాలి. మీరు 9 శాతం వడ్డీ రేటుతో 3 సంవత్సరాల కాలానికి ఈ లోన్ తీసుకుంటే, మంత్లీ EMI రూ. 4,929 అవుతుంది. అంటే, నెలకు రూ. 4,929 చొప్పున 36 నెలల పాటు కట్టాలి. ఈ కాలంలో మీరు మొత్తం రూ. 37,719 వడ్డీని బ్యాంక్‌కు చెల్లించాలి. ఇదే లోన్‌ను, ఇదే వడ్డీ రేటుతో రెండేళ్లలో తీర్చేయాలనుకుంటే నెలకు రూ. 6,870 EMI బ్యాంక్‌కు కట్టాలి.
హోండా యునికార్న్ ఫీచర్లు
హోండా యునికార్న్‌లో LED హెడ్‌లైట్, సింగిల్ ఛానల్ ABS, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వివిధ రంగు ఎంపికలు & సౌకర్యవంతమైన సీటింగ్ వంటి లక్షణాలు ఉన్నాయి. హోండా యునికార్న్ అనేది యూత్ బైక్ అయినప్పటికీ, పెద్దవాళ్లు కూడా సులభంగా, స్టైల్‌గా నడపొచ్చు.
పవర్‌ట్రెయిన్
హోండా యునికార్న్ 162.71cc సింగిల్-సిలిండర్, 4-స్ట్రోక్, BS-VI ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 13 bhp పవర్‌ను & 14.58 Nm టార్క్‌ను ఇస్తుంది. ఈ ఇంజిన్‌ను 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో యాడ్ చేశారు, ఇది స్మూత్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఈ మోటార్ సైకిల్ గరిష్ట వేగం గంటకు 106 కిలోమీటర్లు.
మైలేజ్
హోండా యూనికార్న్ బైక్ ఇంధన సామర్థ్యంలోనూ గొప్పగా పని చేస్తుంది. దీని ARAI సర్టిఫైడ్ మైలేజ్ లీటరుకు 60 కిలోమీటర్లు. దీనికి 13 లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంది. మీరు ఈ ట్యాంక్ నింపితే, నిరాటంకంగా 780 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అంటే, ఈ బైక్‌ను సుదూర ప్రయాణాలకు కూడా ఉపయోగించవచ్చు.





















