అన్వేషించండి

Honda SP 125 vs Hero Glamour: 125సీసీ సెగ్మెంట్‌లో మైలేజ్‌ వార్‌! హోండా ఎస్పీ 125 వర్సెస్‌ హీరో గ్లామర్‌! సామాన్యుడికి ఏది బెటర్?

Honda SP 125 vs Hero Glamour: మధ్యతరగతి వాహనదారులు ఫేవరెట్‌ 125cc సెగ్మెంట్‌లో హోండా ఎస్పీ 125, హీరో గ్లామర్‌ మధ్య మైలేజ్ యుద్ధం నడుస్తోంది. టెక్నాలజీ, ఖర్చు, రీసేల్ వాల్యూపరంగా ఏది మంచిదో చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 125సీసీ బైకుల మైలేజ్, పవర్ పోటీలో హోండా, హీరో.
  • హోండా SP 125 సాంకేతికంగా మెరుగైన, అధిక మైలేజీ బైక్.
  • హీరో గ్లామర్ తక్కువ ధర, తక్కువ నిర్వహణ, దృఢమైన బైక్.
  • హోండా SP ఎక్కువ మైలేజ్, గ్లామర్ తక్కువ ధర ప్రయోజనాలు.

Honda SP 125 vs Hero Glamour: దేశంలో ఒక సామాన్యుడు, లేదా మధ్యతరగతి ఉద్యోగి టూ వీలర్ కొనాలని అనుకున్నప్పుడు అతని మెదడులో మెదిలే మొదటి ప్రశ్న మైలేజ్‌ ఎంత ఇస్తుంది? గతంలో కేవలం 100సీసీ బైకులకే పరిమితమైన ఈ మైలేజీ చర్చ ఇప్పుడు 125సిసి సెగ్మెంట్‌కు మారింది. స్టైలిష్‌ లుక్స్, కొంచెం ఎక్కువ పవర్‌, అదే సమయంలో జేబుకు చిల్లు పడకుండా ఉండే మైలేజీ ఇవి నేటి కస్టమర్ కోరుకుంటున్న అంశాలు. ఈ పోటీలో ప్రధానంగా వినిపించే రెండు పేర్లు హోండా ఎస్పీ 125, హీరో గ్లామర్‌ 125. 

ఈ ఆర్టికల్‌లో ఈ రెండు బైకుల మధ్య ఉన్న సాంకేతిక వ్యత్యాసాలు క్లెయిమ్‌ చేసిన మైలేజీకి రియల్‌ వరల్డ్‌ మైలేజీకి ఉన్న తేడాలు, మీ కష్టార్జితానికి తగిన విలువను ఇచ్చే బైక్ ఏదో లోతుగా చూద్దాం. 

టెక్నాలజీతో కూడిన రిఫైన్‌మెంట్‌ హోండా ఎస్పీ 125

హోండా ఎస్పీ 125 ప్రస్తుతం మార్కెట్‌లో ఒక అడ్వాన్స్‌డ్‌ ప్యాకేజీలా కనిపిస్తుంది. దీని విజయం వెనుక ఉన్న ప్రధాన కారణం దాని ఇంజిన్ టెక్నాలజీ, మీకు వైబ్రేషన్‌ లేని స్మూత్‌ రైడింగ్‌ అనుభవం కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో 123. 94cc eSP ఇంజిన్ ఉంది. 

ఇందులోని PGM-FIసిస్టమ్‌ సెన్సార్ల ద్వారా పెట్రోల్‌ను ఇంజిన్‌కు సరఫరా చేస్తుంది. దీని వల్ల పెట్రోల్ వృథా కాదు. కంపెనీ 63కిలోమీటర్‌ మైలేజీ అని చెబుతున్నప్పటికీ రియల్ వరల్డ్‌ టెస్టులో సిటీలో 58 నుంచి 62కిమీటర్ వరకు మైలేజ్ వస్తోంది. 

మస్కుల్ రైడ్‌ హీరో గ్లామర్‌ 125

హీరో గ్లామర్‌ దశాబ్దాలుగా భారతీయ రోడ్లపై నమ్మకానికి మారుపేరుగా నిలిచింది. ముఖ్యంగా బడ్జెట్‌ విషయంలో రాజీ పడలేని వారికి ఇది ప్రాధాన్యత. హీరో పేటెంటెడ్‌ i3S దీనికి ప్రధాన బలం. ట్రాఫిక్ సిగ్నల్‌ వద్ద బైక్‌ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిన, క్లచ్‌ నొక్కగానే స్టార్ట్ అవుతుంది దీని వల్ల ఇంధనం ఆదా అవుతుంది. 

ఇది చూడటానికి మస్కులర్‌గా ఉంటుంది. దీని వెడల్పైన సీటు ఫ్యామిలీతో ప్రయాణించే వారికి మంచి కంఫర్ట్‌ను ఇస్తుంది. కంపెనీ 65కిలోమీట్‌ అని క్లెయిమ చేసినా, ఇది సిటీలో 52నుంచి 55 కిలోమీటర్ల మైలేజీ మాత్రమే లభిస్తోంది. 

రెండు బైకుల మధ్య ఉన్న ప్రధాన తేడాలు 

ఫీచర్లు   హోండా ఎస్పీ 125 హీరో గ్లామర్‌ 125
ఇంజిన్ 123.94cc   124.7cc
గరిష్ట పవర్ 10.87PS 10.53PS
రియల్ వరల్డ్ మైలేజ్‌ 59-63kmpl   52-58kmpl
ట్యాంక్‌ కెపాసిటీ 11 లీటర్లు 10 లీటర్లు 
ప్రారంభ ధర రూ. 88, 528   రూ. 81, 063

బైక్ కొనేటప్పుడే కాదు, దాని అమ్మేటప్పుడు వచ్చే విలువ కూడా ముఖ్యమే. 

హోండా ఇంజిన్లు మన్నిక వల్ల 3 ఏళ్ల తర్వాత కూడా 60-65 శాతం రీసేల్ వాల్యూ లభిస్తుంది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడిగా భావించవచ్చు. హీరో గ్లామర్ స్పేర్ పార్ట్స్‌ ధరలు చాలా తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా రిపేర్‌ చేయించుకునే సదుపాయం ఉండటం దీనికి ప్లస్ ప్రారంభ ధరలోనే మీరు ఏడెనిమిది వేలు ఆదా చేసుకోవచ్చు.

ఎవరికి ఏ బైక్ మంచిది?

హోండా ఎస్పీ 125 బైక్‌తో మీకు లేటెస్ట్ టెక్నాలజీ, అత్యుత్తమ మైలేజీ, స్మూత్‌ రైడింగ్ కావాలనుకుంటే ధర కొంచెం ఎక్కువైనా మైలేజ్‌ ద్వారా ఆ డబ్బు వెనక్కి వస్తుంది. హీరో గ్లామర్‌ ప్రారంభంలో తక్కువ బడ్జెట్‌ ఉండి. తక్కువ మెయింటెనెన్స్‌ ఖర్చులతో నడిచే బలమైన బైక్ కావాలనుకుంటే కొనుక్కోవవచ్చు.  

Frequently Asked Questions

హోండా ఎస్పీ 125 విజయం వెనుక ప్రధాన కారణం ఏమిటి?

దాని ఇంజిన్ టెక్నాలజీ హోండా ఎస్పీ 125 విజయం వెనుక ఉంది. ఇది వైబ్రేషన్ లేని స్మూత్ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

హీరో గ్లామర్ 125లోని i3S టెక్నాలజీ ప్రయోజనం ఏమిటి?

i3S టెక్నాలజీ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బైక్ ఆటోమేటిక్‌గా ఆగి, క్లచ్ నొక్కగానే స్టార్ట్ అయ్యేలా చేస్తుంది. దీని వల్ల ఇంధనం ఆదా అవుతుంది.

హోండా ఎస్పీ 125 బైక్ రీసేల్ విలువ ఎలా ఉంటుంది?

హోండా ఇంజిన్ల మన్నిక వల్ల, హోండా ఎస్పీ 125 బైక్ 3 ఏళ్ల తర్వాత కూడా 60-65 శాతం రీసేల్ వాల్యూను అందిస్తుంది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడిగా భావించవచ్చు.

తక్కువ బడ్జెట్ ఉన్నవారికి ఏ బైక్ మంచి ఎంపిక?

ప్రారంభంలో తక్కువ బడ్జెట్ ఉండి, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులతో నడిచే బలమైన బైక్ కావాలనుకుంటే హీరో గ్లామర్ 125 మంచి ఎంపిక.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
పాత Monster కంటే Ducati Monster V2 లో ఏంటి ప్రత్యేకత? ఈ 5 హైలైట్స్‌ తెలుసుకోండి
మీరు యూత్‌ అయితే, Ducati Monster V2 గురించి ఈ 5 విషయాలు మీకు తెలుసా?
టెస్లా మోడల్ Y నిజంగానే 500km రేంజ్‌ ఇస్తుందా? రోడ్డుపైకి వస్తే గానీ అసలు సంగతి తెలీలేదు
టెస్లా మోడల్ Y కెపాసిటీ ఇంతేనా? అసలు రేంజ్ తెలిస్తే షాక్‌ అవుతారు!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget