అన్వేషించండి

Honda Activa 125 vs TVS NTORQ 125:హోండా యాక్టివా 125 vs టీవీఎస్‌ ఎన్ టార్క్‌ 125 మధ్య తేడాలు ఏంటీ? మీకు ఏది సరైన వాహనమో తెలుసుకోండి?

Honda Activa 125 vs TVS NTORQ 125:హోండా యాక్టివా 125, టీవీఎస్‌ ఎన్ టార్క్ 125 మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలను తెలుసుకోండి. ధర, మైలేజ్, ఇంజన్ సామర్థ్యం, ఫీచర్లపరంగా ఏ స్కూటర్ ఉత్తమమో చూడండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కుటుంబాల అవసరాలకు హోండా యాక్టివా 125, టీవీఎస్ ఎన్ టార్క్ 125 పోటీ.
  • యాక్టివా 125 క్లాసిక్ డిజైన్, ఎన్ టార్క్ 125 స్పోర్టీ లుక్ కలిగి ఉన్నాయి.
  • ఎన్ టార్క్ 125 అధిక పవర్, మెరుగైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది.
  • మైలేజ్ సుమారు 47kmpl, ధరలో టీవీఎస్ ఎన్ టార్క్ 125 చౌకగా ఉంది.

Honda Activa 125 vs TVS NTORQ 125:భారత్‌లో ఫ్యామిలీ వినియోగదారులు ఈ మధ్య కాలంలో కుటుంబంలోని అందరూ డ్రైవ్ చేసేందుకు వీలుగా స్కూటర్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే క్రమంగా స్కూటర్లకు ప్రాధాన్యత పెరుగుతోంది. అందుకే హోండా యాక్టివా 125, టీవీఎస్‌ ఎన్‌ టార్క్‌ 125 మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. మీరు కొత్తగా స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నట్టు అయితే ఈ రెండింటి మధ్య పోలికలు, తేడాలు తెలుసుకోవడం చాలా అవసరం. అప్పుడే మీ అవసరాలకు తగ్గట్టు వాహనాన్ని ఎంచుకోవచ్చు. లేకుంటే కచ్చితంగా ఈ విషయంలో మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది.           

ఒకప్పుడు కేవలం ఆపీస్‌ అవసరాలకే పరిమితమైన స్కూటర్లు, ఇప్పుడు స్టైల్‌కు, టెక్నాలజీకి కేరాఫ్ అడ్రెస్‌గా మారాయి. ఈ క్రమంలో మార్కెట్‌ లీడర్‌ హోండా నుంచి వచ్చిన యాక్టివా 125, యువతను ఉర్రూతలూగిస్తున్న టీవీఎస్‌ ఎన్ టార్క్‌ 125 మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. 

Honda Activa 125 vs TVS NTORQ 125:హోండా యాక్టివా 125 vs టీవీఎస్‌ ఎన్ టార్క్‌ 125 మధ్య తేడాలు ఏంటీ? మీకు ఏది సరైన వాహనమో తెలుసుకోండి?

హోండా యాక్టివా 125 ఒక క్లాసిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది హోందాగా కుటుంబంలోని అందరికీ నచ్చేలా ఉంటుంది. దీని ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌, సిగ్నేచర్‌ స్టైల్ నగర ప్రయాణాలు ఒక ప్రీమియం లుక్ ఇస్తుంది. 

Honda Activa 125 vs TVS NTORQ 125:హోండా యాక్టివా 125 vs టీవీఎస్‌ ఎన్ టార్క్‌ 125 మధ్య తేడాలు ఏంటీ? మీకు ఏది సరైన వాహనమో తెలుసుకోండి?

దీనికి పూర్తిగా భిన్నంగా టీవీఎస్‌ ఎన్ టార్క్ 125 ఉంటుంది. ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రేరేపిత స్పోర్టీ డిజైన్, షార్ప్‌ లైన్స్‌ దీని సొంతం. ఇది కేవలం ప్రయాణం కోసమే కాదు, రోడ్డుపై ఒక స్టేట్‌మెంట్‌ ఇవ్వాలనుకునే యువత కోసం రూపొందించారు. 

Honda Activa 125 vs TVS NTORQ 125:హోండా యాక్టివా 125 vs టీవీఎస్‌ ఎన్ టార్క్‌ 125 మధ్య తేడాలు ఏంటీ? మీకు ఏది సరైన వాహనమో తెలుసుకోండి?

ఇంజిన్ సామర్థ్యం, పనితీరు

ఇంజిన్‌పరంగా చూస్తే రెండూ 125సీసీ విభాగంలోనే ఉన్నా, వాటి స్వభావం వేరు. హోండా యాక్టివా 125 వాహనం 123.92 సీసీ ఇంజన్‌తో 8.42 పీఎస్‌ పవర్‌, 10.5ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది. దీని ఇంజన్‌ చాలా రిఫైన్డ్‌గా ఉండి, సైలెంట్‌ స్టార్ట్ సిస్టమ్‌తో వస్తుంది. 

Honda Activa 125 vs TVS NTORQ 125:హోండా యాక్టివా 125 vs టీవీఎస్‌ ఎన్ టార్క్‌ 125 మధ్య తేడాలు ఏంటీ? మీకు ఏది సరైన వాహనమో తెలుసుకోండి?

టీవీఎస్‌ ఎన్ టార్క్ 125 వాహనం 124. 8 సీసీ ఇంజన్‌తో 9.5 పీఎస్ పవర్, 10.6ఎన్‌ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. యాక్టివాతో పోలిస్తే ఇది మరింత శక్తివంతమైంది. వేగంగా పుంజుకుంటుంది. 

Honda Activa 125 vs TVS NTORQ 125:హోండా యాక్టివా 125 vs టీవీఎస్‌ ఎన్ టార్క్‌ 125 మధ్య తేడాలు ఏంటీ? మీకు ఏది సరైన వాహనమో తెలుసుకోండి?

ఫీచర్లు, టెక్నాలజీ 

టెక్నాలజీ విషయంలో ఎన్‌టార్క్‌ ముందంజలో ఉంది. ఎన్ టార్క్‌లో బ్లూటూత్‌ కనెక్టివిటీ, నావిగేషన్ అసిస్ట్, కాల్/ ఎస్‌ఎంఎస్ అలర్ట్స్‌ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. యాక్టివాలో ఇవి కనిపించవు. ఎన్ టార్క్‌లో 20 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్‌ ఉండగా, యాక్టివాలో 18 లీటర్లు మాత్రమే ఉంది. రెండింటిలోనూ ఎక్స్‌టర్నల్‌ ఫ్యూయల్‌ ఫిల్లింగ్, యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్ట్, డిజిటల్ కన్సోల్‌ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. 

Honda Activa 125 vs TVS NTORQ 125:హోండా యాక్టివా 125 vs టీవీఎస్‌ ఎన్ టార్క్‌ 125 మధ్య తేడాలు ఏంటీ? మీకు ఏది సరైన వాహనమో తెలుసుకోండి?

మైలేజ్‌లో ఎవరు కింగ్?

సాధారణంగా భారతీయ వినియోగదారుడు మొదట అడిగే ప్రశ్న మైలేజ్ ఎంత అని. అయితే హోండా యాక్టివా 125, టీవీస్ ఎన్ టార్క్ 125 రెండూ కూడా దాదాపు 47kmpl మైలేజీని అందిస్తున్నాయి. అయితే హైవే ప్రయాణాల్లో ఎన్ టార్క్ 53.4kmplవరకు మైలేజీని ఇవ్వగలదు. 

Honda Activa 125 vs TVS NTORQ 125:హోండా యాక్టివా 125 vs టీవీఎస్‌ ఎన్ టార్క్‌ 125 మధ్య తేడాలు ఏంటీ? మీకు ఏది సరైన వాహనమో తెలుసుకోండి?

బడ్జెట్‌ విషయానికి వస్తే టీవీఎస్ కాస్త చౌకగా కనిపిస్తోంది. టీవీఎస్ ఎన్ టార్క్ 125 ఎక్స్ షోరూమ్ ధర సుమారు 81, 750 రూపాయలు ఉంది. హోండా యాక్టివా 125 ప్రారంభ ధర 89, 406 రూపాయలుగా ఉంది. 

Honda Activa 125 vs TVS NTORQ 125:హోండా యాక్టివా 125 vs టీవీఎస్‌ ఎన్ టార్క్‌ 125 మధ్య తేడాలు ఏంటీ? మీకు ఏది సరైన వాహనమో తెలుసుకోండి?

Frequently Asked Questions

కుటుంబ వినియోగదారులకు ఏ స్కూటర్ మంచిది?

కుటుంబంలోని అందరికీ నచ్చే క్లాసిక్ డిజైన్ తో హోండా యాక్టివా 125 వస్తుంది. టీవీఎస్ ఎన్ టార్క్ 125 యువతను ఆకట్టుకునే స్పోర్టీ డిజైన్ తో వస్తుంది.

రెండు స్కూటర్ల ఇంజిన్ సామర్థ్యం ఎలా ఉంది?

హోండా యాక్టివా 125, 123.92 సీసీ ఇంజన్ తో 8.42 పీఎస్ పవర్ ను అందిస్తుంది. టీవీఎస్ ఎన్ టార్క్ 125, 124.8 సీసీ ఇంజన్ తో 9.5 పీఎస్ పవర్ ను అందిస్తుంది.

టెక్నాలజీ ఫీచర్లలో ఏది ముందుంది?

టీవీఎస్ ఎన్ టార్క్ 125 బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ అసిస్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లతో ముందంజలో ఉంది. యాక్టివాలో ఈ ఫీచర్లు లేవు.

మైలేజ్ లో ఏ స్కూటర్ ఉత్తమమైనది?

రెండు స్కూటర్లు దాదాపు 47kmpl మైలేజీని అందిస్తాయి. అయితే, హైవే ప్రయాణాల్లో టీవీఎస్ ఎన్ టార్క్ 125 53.4kmpl వరకు మైలేజీ ఇవ్వగలదు.

ధర పరంగా ఏది చౌకైనది?

టీవీఎస్ ఎన్ టార్క్ 125 సుమారు 81,750 రూపాయల ఎక్స్-షోరూమ్ ధరతో వస్తుంది. హోండా యాక్టివా 125 ప్రారంభ ధర 89,406 రూపాయలు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Electric Cars Under 50k Downpayment: 50వేల డౌన్‌పేమెంట్‌, 10వేల EMIతో ఈ ఈవీలు ఇంటికి తెచ్చుకోవచ్చు!
50వేల డౌన్‌పేమెంట్‌, 10వేల EMIతో ఈ ఈవీలు ఇంటికి తెచ్చుకోవచ్చు!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
BYD Denza N8 EV: ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
ఒకసారి ఛార్జ్ చేస్తే 1003 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే కారు! కొత్త చర్చ దారి తీస్తున్న డెంజా N8 మైండ్‌బ్లోయింగ్ ఫీచర్స్‌!
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Embed widget