ఫ్యామిలీ ఇ-స్కూటర్‌గా Honda QC3 లాంచ్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 145 కి.మీ. జర్నీ!
Honda QC3 ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.1.35 లక్షల ధరతో లాంచ్ అయింది. 3kWh బ్యాటరీ, 145 కి.మీ. IDC రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్‌తో వస్తున్న ఈ స్కూటర్ తొలుత ఐదు నగరాల్లో అందుబాటులో ఉంటుంది.

Honda QC3 Price, Range And Features Telugu: హోండా కంపెనీ, మన మార్కెట్‌లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. Honda QC3 పేరుతో ఈ కొత్త ఫ్యామిలీ ఇ-స్కూటర్‌ను తీసుకొచ్చింది. దీని ధర రూ.1.35 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. భారత మార్కెట్లో హోండా నుంచి వచ్చిన మూడో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. ఇంతకుముందు QC1 & Activa e: మోడళ్లను ఈ సంస్థ లాంచ్ చేసింది.
QC3లో 3kWh సామర్థ్యం ఉన్న బ్యాటరీని అందించారు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 145 కి.మీ. IDC రేంజ్‌ను అందిస్తుందని హోండా తెలిపింది. కుటుంబ అవసరాలకు అనుగుణంగా ఈ స్కూటర్‌ను రూపొందించింది. ముఖ్యంగా స్టోరేజ్ విషయంలో హోండా మంచి ప్రాధాన్యత ఇచ్చింది.
32 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్
QC3లో 32 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ ఉంది. దీంతో హెల్మెట్‌తో పాటు ఇతర వస్తువులను కూడా సులభంగా పెట్టుకునే అవకాశం ఉంటుంది. హోండా QC1లో ఉన్న 26 లీటర్ల స్టోరేజ్‌తో పోలిస్తే ఇది ఎక్కువ.
QC3 బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి 2 గంటల 40 నిమిషాలు పడుతుంది.
టెక్నాలజీకి కూడా ప్రాధాన్యత
హోండా QC3లో 5 అంగుళాల TFT డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో టర్న్ బై టర్న్ నావిగేషన్ సదుపాయం కూడా ఉంటుంది. హోండా RoadSync కనెక్టివిటీ వ్యవస్థ ద్వారా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఈ స్కూటర్‌లో హబ్ మౌంటెడ్ మోటార్‌ను అందించారు. ముందు భాగంలో డిస్క్ బ్రేక్ ఉంటుంది. కుటుంబ అవసరాలకు సరిపోయే ప్రాక్టికల్ డిజైన్‌తో పాటు ఆధునిక ఫీచర్లను కూడా ఇందులో అందించారు.
నాలుగు రంగులు
హోండా QC3ను 4 రంగుల్లో అందిస్తోంది, అవి: Matt Photon Gray Metallic, Pearl Precious White, Pearl Shallow Blue & Pearl Siren Blue.
ఇది కూడా చదవండి: 501cc ఇంజిన్, 28hp పవర్‌తో Honda CB500 లాంచ్.. మూడు వేరియంట్లు, వాటి ధరల లిస్ట్
ధర
QC3 ధర రూ.1.35 లక్షలు. ఈ ధర ఎక్స్-షోరూమ్, ఢిల్లీ. స్థానిక తయారీ కారణంగా గతంలో వచ్చిన హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే QC3ను పోటీ ధరకు తీసుకొచ్చినట్లు సంస్థ తెలిపింది.
తొలుత ఐదు నగరాల్లోనే
హోండా QC3 విక్రయాలను తొలుత 5 నగరాలకు పరిమితం చేసింది. ఢిల్లీ, ఆగ్రా, కటక్, సూరత్ & కొల్లాం నగరాల్లో మొదట అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత దశలవారీగా దేశవ్యాప్తంగా విక్రయాలను విస్తరించనుంది.
ఈ ఐదు నగరాల్లో ఉన్న వినియోగదారులు హోండా వెబ్‌సైట్ లేదా సమీపంలోని RedWing డీలర్‌షిప్‌లో QC3ను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ కోసం రూ.5,000 చెల్లించాలి. అయితే డెలివరీలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయాన్ని హోండా ఇంకా వెల్లడించలేదు.
ధర పరంగా QC3కు మార్కెట్లో వివిధ ఎలక్ట్రిక్ స్కూటర్ల నుంచి పోటీ ఉంటుంది. TVS iQube 3.1kWh ధర రూ.1.30 లక్షలు. Bajaj Chetak C3502 ధర రూ.1.44 లక్షలు. Vida VX2 Plus 3.1 ధర రూ.1.03 లక్షలు. Ather Konarc S 161 ధర రూ.1.45 లక్షలు. అన్ని ధరలు ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరలు.
ఇది కూడా చదవండి: రూ.9,990 పెట్టి RE వాటర్‌ప్రూఫ్ రైడింగ్ బూట్స్ కొనొచ్చా? 600km వాడిన తర్వాత ఎలా ఉన్నాయంటే?
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు





















