501cc ఇంజిన్, 28hp పవర్‌తో Honda CB500 లాంచ్.. మూడు వేరియంట్లు, వాటి ధరల లిస్ట్
హోండా CB500 మూడు వేరియంట్లలో లాంచ్ అయింది. రూ.2.75 లక్షల నుంచి ధరలు ప్రారంభమవుతాయి. మూడు వేరియంట్ల ఫీచర్లు, ధరలు & విడుదల వివరాలు ఇవే.

Honda CB500 Price, Mileage And Features Telugu: హోండా మోటార్‌సైకిల్ కంపెనీ భారత్‌లోకి మరో కొత్త ఆప్షన్ తీసుకువచ్చింది. హోండా CB500 బైక్‌ను మూడు వేరియంట్లలో లాంచ్ చేసింది. వీటిలో CB500 అల్లాయ్, CB500 స్పోక్ & CB500 స్పోక్ విత్ స్ట్రైప్స్ ఉన్నాయి. మూడు వేరియంట్లలో ఇంజిన్ ఒకటే. అయితే చక్రాల రకం, రంగులు & డిజైన్‌లో మార్పులు ఉన్నాయి. ధర రూ.2.75 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
హోండా CB500లో 501cc సామర్థ్యం ఉన్న సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది ఎయిర్ & ఆయిల్ కూల్డ్ ఇంజిన్. ఈ ఇంజిన్ 28hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 43.3Nm గరిష్ఠ టార్క్‌ను అందిస్తుంది. బైక్‌లో హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
అల్లాయ్ వేరియంట్
CB500 అల్లాయ్ ఈ సిరీస్‌లో ప్రారంభ వేరియంట్. ఇందులో అల్లాయ్ వీల్స్ ఉంటాయి. నలుపు & గ్రే రంగుల్లో ఈ వేరియంట్ అందుబాటులో ఉంటుంది. మూడు వేరియంట్లలో ముందుగా ఇదే మార్కెట్‌లోకి రానుంది.
ఈ వేరియంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, కాన్ఫిగరేషన్‌ను 2027 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో వెల్లడించనున్నారు. అంటే, అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత డెలివరీలు ప్రారంభమవుతాయి.
CB500 అల్లాయ్ ధర రూ.2.75 లక్షలు, ఇది ఎక్స్-షోరూమ్ ధర.
స్పోక్ వేరియంట్
CB500 స్పోక్ వేరియంట్‌లో అల్లాయ్ వీల్స్‌కు బదులుగా క్రాస్-స్పోక్ ట్యూబ్‌లెస్ వీల్స్ ఉంటాయి. ఈ వేరియంట్‌లో సిల్వర్ & రెడ్ రంగులు అందుబాటులో ఉంటాయి. రెండు రంగులకూ మెటాలిక్ ఫినిష్ ఉంటుంది.
ఈ వేరియంట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను 2027 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వెల్లడించనున్నారు. అంటే, 2027 జనవరి నుంచి మార్చి మధ్య సమాచారం అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత డెలివరీలు ప్రారంభమవుతాయి.
CB500 స్పోక్ ధర రూ.3 లక్షలు. ఇది కూడా బెంగళూరులో ఎక్స్-షోరూమ్ ధర.
ఇది కూడా చదవండి: Maruti Fronx టాప్ మోడల్ ధర ఎంత.. డౌన్ పేమెంట్, EMI లెక్కలు తెలుసుకుని కొనండి
CB500 స్పోక్ విత్ స్ట్రైప్స్
CB500 స్పోక్ విత్ స్ట్రైప్స్ ఈ సిరీస్‌లో టాప్ వేరియంట్. ఇందులోనూ క్రాస్-స్పోక్ ట్యూబ్‌లెస్ వీల్స్ ఉంటాయి. ఈ వేరియంట్‌లో పీక్ బ్లాక్ రంగును అందిస్తున్నారు. ఇంధన ట్యాంక్‌పై ప్రత్యేక పిన్‌స్ట్రైప్స్ ఉంటాయి.
డిజైన్ పరంగా ఈ వేరియంట్ ప్రత్యేకంగా కనిపించనుంది. దీని పూర్తి వివరాలు కూడా 2027 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో వెల్లడవుతాయి. అదే సమయంలో డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
CB500 స్పోక్ విత్ స్ట్రైప్స్ ధర రూ.3.02 లక్షలు.
మూడు వేరియంట్లలోనూ కొన్ని ప్రధాన ఫీచర్లు ఒకేలా ఉంటాయి. హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్, స్లిప్పర్ క్లచ్, అనలాగ్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉన్నాయి. హోండా రోడ్‌సింక్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. అన్ని లైట్లూ LEDతోనే వస్తాయి.
ఇది కూడా చదవండి: Tata Sierra డార్క్ ఎడిషన్ లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్-షోరూమ్, ఆన్ రోడ్ ధర వివరాలు
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















