అన్వేషించండి

రూ.9,990 పెట్టి RE వాటర్‌ప్రూఫ్ రైడింగ్ బూట్స్ కొనొచ్చా? 600km వాడిన తర్వాత ఎలా ఉన్నాయంటే?

రాయల్ ఎన్‌ఫీల్డ్ వాండరర్ వాటర్‌ప్రూఫ్ బూట్స్‌పై పూర్తి సమీక్ష ఇది. రక్షణ, సౌకర్యం, వాటర్‌ప్రూఫ్ పనితీరు, టూరింగ్ సామర్థ్యంలో ఇవి ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Royal Enfield Wanderer Waterproof Boots: వర్షాకాలంలో బైక్‌పై ప్రయాణించేవారికి సరైన రైడింగ్ గేర్ చాలా ముఖ్యం. ముఖ్యంగా పాదాలు, చీలమండలకు రక్షణ ఇచ్చే బూట్స్ అవసరం. ఈ నేపథ్యంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ వాండరర్ వాటర్‌ప్రూఫ్ బూట్స్‌ను టూరింగ్ రైడర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు.

ఈ బూట్స్ సాధారణ మోటార్‌సైకిల్ బూట్స్‌కు, కఠినమైన టూరింగ్ బూట్స్‌కు మధ్యస్థంగా ఉండేలా కనిపిస్తాయి. బయట భాగంలో ప్రధానంగా లెదర్‌ను ఉపయోగించారు. నిర్మాణం గట్టిగా ఉంటుంది. అడుగు భాగంలో మంచి పట్టును అందించే సోల్‌ ఉంది. నీరు లోపలికి రాకుండా ప్రత్యేక పొరతో పాటు సీమ్‌లకు సీలింగ్‌ ఇచ్చారు.

600km వాడిన తర్వాత..

మొదటిసారి వేసుకున్నప్పుడు బూట్స్ చాలా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తాయి. సౌకర్యం విషయంలో పెద్ద సమస్య లేకపోయినా కాళ్ల కదలిక కొంత పరిమితంగా ఉంటుంది. పూర్తిగా మెత్తబడేందుకు కొంత సమయం పడుతుంది. సుమారు 500 నుంచి 600 కిలోమీటర్లు బైక్‌ నడిపిన తర్వాత బూట్స్‌ బాగా ఉపయోగంలోకి వచ్చాయి. ఆ తర్వాత వీటిలో కాళ్లను కదపడం సులభమైంది. నడిచేటప్పుడు కూడా సహజంగా అనిపించాయి.

బైక్‌ నడిపేటప్పుడు మాత్రం ఈ బూట్స్ మంచి భద్రతా భావనను ఇస్తాయి. పాదాలు & చీలమండల చుట్టూ గట్టి పట్టును అందిస్తాయి. మడమ, ముందు పాద భాగం & చీలమండల వద్ద టీపీఆర్ రక్షణ ఉంది. గేర్ మార్చేటప్పుడు, వెనుక బ్రేక్ ఉపయోగించేటప్పుడు ఎలాంటి ఇబ్బంది కనిపించలేదు. ఫుట్‌పెగ్‌లపై నిలబడి రైడ్ చేసినా బూట్స్ గట్టిగా సహకరిస్తాయి. బరువుగా అనిపించకుండా మంచి రక్షణను అందిస్తాయి.

తేలికపాటి ఆఫ్‌రోడ్ ప్రయాణాలకు కూడా ఇవి సరిపోతాయి. చిన్న మట్టి రోడ్లు, కంకర మార్గాలు లేదా అప్పుడప్పుడు వచ్చే కఠినమైన రోడ్లపై ఉపయోగించవచ్చు. అయితే సవాళ్లు నిండిన ఆఫ్‌రోడ్ ట్రయల్స్‌కు మాత్రం ఇవి సరైన ఎంపిక కావు. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకమైన ఆఫ్‌రోడ్ బూట్స్ మరింత రక్షణను అందిస్తాయి.

ఇది కూడా చదవండి: RE Guerrilla 450 మైలేజ్‌ టెస్ట్‌: లీటర్‌ పెట్రోల్‌తో సిటీ ట్రాఫిక్‌లో, హైవేపై ఎంత దూరం నడిచింది?

వాటర్‌ప్రూఫింగ్‌ పనితీరు 

వాటర్‌ప్రూఫ్ పనితీరు విషయంలో మాత్రం కొన్ని పరిమితులు ఉన్నాయి. నగరంలో తక్కువ దూరం ప్రయాణించినప్పుడు బూట్స్ మంచి పనితీరు చూపించాయి. వర్షంలోనూ నీరు లోపలికి రాలేదు. 50 నుంచి 60 కిలోమీటర్ల ప్రయాణాల్లో కూడా లోపలి పొర నీటిని సమర్థంగా అడ్డుకుంది.

అయితే, చాలా ఎక్కువ దూరం ప్రయాణించినప్పుడు పరిస్థితి మారింది. తడిసిన వాతావరణంలో సుమారు 300 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత బూట్స్‌లోకి నీరు చేరడం మొదలైంది. వర్షం తీవ్రత, బూట్స్‌పై పడే నీటి పరిమాణాన్ని బట్టి ఫలితం మారవచ్చు. ఉపయోగించిన సందర్భంలో.. ఎడమ బూట్‌తో పోలిస్తే కుడి బూట్‌లోకి ఎక్కువ నీరు చేరింది.

లోపలికి నీరు చేరిన తర్వాత ఇవి పూర్తిగా ఆరేందుకు కూడా కొంత సమయం పడుతుంది. అందుకే నగర ప్రయాణాలు, తక్కువ దూరం వీకెండ్‌ టూర్లకు ఇవి మరింత అనుకూలంగా కనిపిస్తాయి. వర్షాకాలంలో ఎక్కువ దూరం వెళ్లే టూర్లకు మాత్రం మరింత మెరుగైన వాటర్‌ప్రూఫ్ రక్షణ ఉన్న బూట్స్‌ను పరిశీలించడం మంచిది.

మొత్తంగా చూస్తే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ వాండరర్ బూట్స్‌లో రక్షణ, సౌకర్యం & స్టైల్‌ వంటివి ఉన్నాయి. మొదట కొంత గట్టిగా అనిపించినా 500 నుంచి 600 కిలోమీటర్ల తర్వాత మంచి సౌకర్యాన్ని అందిస్తాయి. వీటి ధర రూ.9,990. నగర ప్రయాణాలు, సాధారణ టూరింగ్ & తేలికపాటి ఆఫ్‌రోడ్ రైడింగ్‌కు ఇవి ఉపయోగకరమైన ఎంపిక అవుతాయి.

ఇది కూడా చదవండి: ప్రతిరోజూ ఆఫీస్‌కు వెళ్లే వారికి బెస్ట్ స్కూటీలు ఇవే.. టాప్ 5 లిస్ట్ చూసి డిసైడ్ అవ్వండి

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
Second-hand Car: రూ.7 లక్షల నుంచి Kia Sonet facelift.. సెకండ్‌హ్యాండ్‌లో కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి!
సెకండ్ హ్యాండ్ కియా సోనెట్ కొనాలనుకుంటున్నారా? ఈ రెండు సమస్యలను ముందే చెక్ చేయండి!
Vibration-Free Bikes: లాంగ్ రైడ్స్‌కు బెస్ట్ బైక్స్‌.. అతి తక్కువ వైబ్రేషన్లు ఇచ్చే స్మూత్ ఇంజిన్, మంచి కంఫర్ట్ ఇచ్చే 5 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!
హైవేపై గంటల తరబడి ప్రయాణించినా వైబ్రేషన్లు, అలసట తక్కువే.. 300cc విభాగంలో బెస్ట్ 5 బైక్స్
Driving In Fog: వింటర్ ఫాగ్‌లో కారు నడిపేటప్పుడు హజార్డ్ లైట్లు ఆన్ చేస్తున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ చిన్న పొరపాట్లు మీ ప్రయాణాన్ని ప్రమాదంలో పడేస్తాయి!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila Demands Apology: తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
తండ్రి వయసున్న వ్యక్తికి శుభలేఖ ఇస్తే చెట్టాపట్టాల్ అంటారా?.. వైఎస్ జగన్‌కు షర్మిల సూటి ప్రశ్నలు!
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
మార్కెట్‌లోకి వచ్చి ఆరు నెలలు కూడా కాలేదు.. Bajaj Pulsar 180కి మళ్లీ బ్రేక్‌!
యూత్‌ఫుల్‌ బైక్‌ బజాజ్ పల్సర్ 180 ఇక కనిపించదా? ఐదేళ్లలో రెండోసారీ అదే పరిస్థితి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Embed widget