అన్వేషించండి

Honda City Facelift Spied: హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ అదిరిపోయే లుక్‌తో వచ్చేస్తోంది: లాంచ్‌కు ముందే లీకైన ఫోటోలు

Honda: హోండా ఇండియా తన పాపులర్ సెడాన్ సిటీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేసేందుకు రెడీ అవుతుండగా, టెస్టింగ్ సమయంలో ఎటువంటి కవర్లు లేకుండా ఈ కారు తొలిసారి కెమెరాకు చిక్కింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌లో LED హెడ్‌ల్యాంప్స్, కొత్త గ్రిల్‌తో డిజైన్ మార్పులు.
  • లోపల కొత్త అప్‌హోల్స్టరీ, పెద్ద టచ్‌స్క్రీన్, ADAS ఫీచర్లు జోడించారు.
  • 1.5L పెట్రోల్ ఇంజిన్‌తో పాటు హైబ్రిడ్ ఆప్షన్‌తో మార్కెట్‌లోకి వస్తోంది.

Honda City Facelift Spied in India: ఇండియ‌న్ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రీమియం సెడాన్ అంటే గుర్తొచ్చే పేరు హోండా సిటీ. ఇప్పుడు ఈ కారును సరికొత్త హంగులతో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో తీసుకురావడానికి హోండా కార్స్ ఇండియా సిద్ధమైంది. అఫీషియల్ లాంచ్‌కు ముందే ఈ కారు ఎటువంటి మ్యాస్కింగ్ లేకుండా రోడ్లపై కనిపిస్తూ ఆటోమొబైల్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. లీకైన లేటెస్ట్ ఫోటోలను చూస్తే ఈ కారు డిజైన్ లో జరిగిన మార్పులు క్లియర్ గా అర్థమవుతున్నాయి. హోండా బ్రాండ్‌లో ఇది అత్యంత కీలకమైన మోడల్ కావడం, అలాగే ఇందులో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్ ఉండటంతో ఈ కొత్త అప్‌డేట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

డిజైన్ లో కొత్త మార్పులు..

కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ ముందు భాగంలో ప్రధానంగా మార్పులు కనిపిస్తున్నాయి. కొత్తగా డిజైన్ చేసిన ఎల్‌ఈడీ (LED) హెడ్‌ల్యాంప్స్, వాటిలోనే ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్స్ (DRLs) కారుకు మంచి లుక్ ఇస్తున్నాయి. గ్రిల్ డిజైన్ కూడా మారింది, బోనెట్ మీద బ్రాండ్ కి సంబంధించిన సరికొత్త 'H' లోగో స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త బంపర్ వల్ల కారు వైడ్ గా, షార్ప్ గా కనిపిస్తోంది. పక్క నుంచి చూస్తే పాత మోడల్‌కు దగ్గరగానే ఉన్నట్లు అనిపించినా, అలాయ్ వీల్స్ డిజైన్ మాత్రం అప్‌డేట్ అయింది. వెనుక వైపు టెయిల్ ల్యాంప్స్ తో పాటు బంపర్ లో కూడా చిన్నపాటి మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఓవరాల్ గా కారు గతంలో కంటే ఇంకాస్త స్టైలిష్ గా తయారైంది.

ఇంటీరియర్ , ఫీచర్లు..

కారు లోపల కూడా హోండా భారీ మార్పులే చేస్తోంది. సెడాన్ ఇంటీరియర్ లో కొత్త అప్‌హోల్స్టరీ, మరింత పెద్దదైన టచ్‌స్క్రీన్ డిస్ప్లే వచ్చే ఛాన్స్ ఉంది. క్యాబిన్ లేఅవుట్ లో కూడా చిన్న చిన్న మార్పులు చేసి లగ్జరీగా మార్చబోతున్నారు. ఫీచర్ల విషయానికొస్తే 360-డిగ్రీ కెమెరా, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి మోడరన్ ఫీచర్లు ఇందులో ఉంటాయి. సేఫ్టీ విషయంలో హోండా ఎప్పుడూ ముందుంటుంది కాబట్టి, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లు ఉంటాయి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో హై బీమ్ అసిస్ట్ వంటి ఫీచర్లు డ్రైవింగ్ ను మరింత సురక్షితం చేస్తాయి.

ఇంజిన్ ,పోటీ..

హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ లో పాత 1.5 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌నే కొనసాగించనున్నారు. ఇది 121 hp పవర్, 145 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. దీనికి సిక్స్-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సివిటి (CVT) గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉంటాయి. అలాగే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలనుకునే వారి కోసం హైబ్రిడ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ కారు హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా, వోక్స్‌వ్యాగన్ వర్టస్ వంటి బలమైన పోటీదారులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సెడాన్ లవర్స్ కోసం హోండా తీసుకొస్తున్న ఈ అప్‌డేటెడ్ ప్యాకేజీ ఖచ్చితంగా మార్కెట్లో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది.

Frequently Asked Questions

కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌లో ఎలాంటి డిజైన్ మార్పులు ఆశించవచ్చు?

కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌లో ముందు భాగంలో LED హెడ్‌ల్యాంప్స్, ఇంటిగ్రేటెడ్ DRLs, కొత్త గ్రిల్ డిజైన్, మరియు షార్ప్ బంపర్ వంటి మార్పులు ఉంటాయి. అలాయ్ వీల్స్ డిజైన్ కూడా అప్‌డేట్ అవుతుంది.

కొత్త హోండా సిటీ ఇంటీరియర్‌లో ఎలాంటి ఫీచర్లు ఉంటాయి?

ఇంటీరియర్‌లో కొత్త అప్‌హోల్స్టరీ, పెద్ద టచ్‌స్క్రీన్ డిస్ప్లే, 360-డిగ్రీ కెమెరా, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మరియు కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఆధునిక ఫీచర్లు ఉంటాయి.

కొత్త హోండా సిటీలో భద్రతా పరమైన అంశాలు ఏమిటి?

కొత్త హోండా సిటీలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్లు ఉంటాయి. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో హై బీమ్ అసిస్ట్ వంటివి డ్రైవింగ్‌ను సురక్షితం చేస్తాయి.

కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌లో ఏ ఇంజిన్‌ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి?

పాత 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ హైబ్రిడ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ పెట్రోల్ ఇంజిన్‌ 121 hp పవర్‌ను అందిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget