City e:HEV Hybrid Vs Nexon EV: ఎలక్ట్రిక్ కారు బాగుందా - హైబ్రిడ్ కారుకు ఓటేయాలా - నెక్సాన్ ఈవీ, సిటీ హైబ్రిడ్‌ల్లో ఏది బెస్ట్?
హోండా సిటీ ఈ:హెచ్ఈవీ హైబ్రిడ్, టాటా నెక్సాన్ ఈవీల్లో ఏది బెస్ట్?
ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల మధ్య పోటీ మనదేశంలో రోజురోజుకూ పెరుగుతోంది. హోండా సిటీ ఈ:హెచ్ఈవీ (Honda City e:HEV Hybrid), టాటా నెక్సాన్ ఈవీలు (Tata Nexon EV) ప్రస్తుతం ఒకే ధరలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి కొనుగోలుదారులకు ఈ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే సిటీ హైబ్రిడ్ ధరలు ఇంకా తెలియరాలేదు. అలాగే నెక్సాన్‌లో కూడా ఎక్కువ రేంజ్ ఉన్న వెర్షన్ త్వరలో రిలీజ్ కానుంది.
ఏది పెద్దగా ఉంది?
హోండా సిటీ హైబ్రిడ్, నెక్సాన్ ఈవీల మధ్య చాలా తేడాలు ఉన్నాయి. వీటిలో సైజు విషయానికి వస్తే... నెక్సాన్ ఈవీ పొడవు కొంచెం తక్కువగానూ, వెడల్పు ఎక్కువగానూ ఉంది. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయంలో నెక్సాన్ ఈవీ ముందంజలో ఉంది. డిజైన్ విషయంలో మాత్రం రెండూ బాగున్నాయి.
దేని స్పెసిఫికేషన్లు బాగున్నాయి?
సిటీ హైబ్రిడ్‌లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. రెండు ఎలక్ట్రిక్ మోటార్స్ ఉన్నాయి. సిటీ హైబ్రిడ్ బూట్ స్పేస్‌లో లిథియం ఇయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. 124 బీహెచ్‌పీ, 253 ఎన్ఎం టార్క్‌ను ఇది అందించనుంది. నెక్సాన్ ఈవీలో 30.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. దీని ఇంజిన్ సామర్థ్యం 127 బీహెచ్‌పీగానూ, పీక్ టార్క్ 245 ఎన్ఎంగానూ ఉండనుంది. ఈ రెండిట్లోనూ రెగ్యులర్ గేర్ బాక్స్‌లు లేవు. హోండా సిటీ హైబ్రిడ్‌లో స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉన్నాయి. హోండా సిటీ హైబ్రిడ్, ఇంజిన్ మోడ్స్‌లో పనిచేయనుంది. ఇక నెక్సాన్ ఈవీ పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్ మీదనే పనిచేయనుంది.
రేంజ్, మైలేజ్ ఎలా ఉంది?
నెక్సాన్ ఈవీ 312 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. ఇక హోండా సిటీ ఈ:హెచ్ఈవీ 26.5 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుందని కంపెనీ అంటోంది. నెక్సాన్ ఈవీ బ్యాటరీ పూర్తిగా చార్జ్ కావడానికి 8-9 గంటల సమయం పడుతుంది. అయితే సిటీ హైబ్రిడ్‌కి మాత్రం చార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు.
ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
నెక్సాన్ ఈవీలో ప్రీమియం ఆడియో సిస్టం, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, సన్‌రూఫ్, ఆటో హెడ్‌ల్యాంప్స్, క్లైమెట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సిటీ హైబ్రిడ్‌లో కూడా సన్‌రూఫ్, టచ్ స్క్రీన్, ప్రీమియం ఆడియో సిస్టం, లేన్ వాటర్ టెక్ ఉన్నాయి. అయితే సిటీ హైబ్రిడ్‌లో అదనంగా ఏడీఏఎస్ ఫీచర్ కూడా అందించారు.
ఏది కొంటే బెటర్?
ప్రస్తుతం నెక్సాన్ ఈవీ ధర రూ.14.54 లక్షల నుంచి రూ.17.15 లక్షల మధ్య ఉంది. సిటీ హైబ్రిడ్ ఎంట్రీ లెవల్ మోడల్ కంటే నెక్సాన్ ఈవీ టాప్ ఎండ్ మోడల్ ధర తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మీకు చార్జింగ్ నెట్‌వర్క్ అందుబాటులో లేకపోతే సిటీ హైబ్రిడ్ తీసుకోవడం మంచిది. ఒకవేళ నెక్సాన్ ఈవీ తీసుకుంటే మీరు పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించాల్సిన అవసరం లేదు. అయితే పూర్తిగా నగరాల్లో మాత్రమే ఉపయోగించవచ్చు. మీ అవసరాలకు సరిపోయే కారును ఎంచుకోవచ్చు.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?