Hero Xtreme 160R 2V: రూ.10 వేలు తక్కువ ధరతో హీరో కొత్త బైక్ - ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 2వీ వచ్చేసింది!
Hero Xtreme 160R 2V Price: హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 2వీ అప్‌డేటెడ్ వెర్షన్ రూ.10 వేల తక్కువ ధరతో మార్కెట్లో లాంచ్ అయింది. దీని ఎక్స్ షోరూం ధర రూ.1.11 లక్షలుగా ఉంది.
Hero Xtreme 160R 2V Launch: హీరో మోటోకార్ప్ ఇటీవల భారత మార్కెట్లో కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. అదే అప్‌డేటెడ్ హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 2వీ. ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీలో చేసిన మార్పులు ఇప్పుడు ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 2వీలో కూడా చేశారు. ఢిల్లీలో ఈ కొత్త మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.11 లక్షలుగా నిర్ణయించారు. ఇది దాని మునుపటి మోడల్ కంటే దాదాపు రూ. 10,000 తక్కువ కావడం విశేషం.
సరికొత్త ఫీచర్లను పొందిన హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 2వీ...
హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 2వీని కంపెనీ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. గత మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త బైక్‌లో కొన్ని మార్పులు చేశారు. ఈ బైక్ వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు అందించారు. దీనితో పాటు సింగిల్ ఛానెల్ ఏబీఎస్ కూడా ఇన్‌స్టాల్ చేశారు. ఈ బైక్ సింగిల్ పీస్ సీటుతో వస్తుంది. కొత్త సీటు డిజైన్ మరింత సౌకర్యవంతంగా ఉంటుందని, మునుపటి మోడల్‌తో పోలిస్తే సీటు ఎత్తు గణనీయంగా తగ్గిందని హీరో కంపెనీ అంటోంది.
హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 2వీ ఇప్పుడు 4వీ నుంచి కొత్త, అధునాతన ఫీచర్‌లను పొందింది. ఇందులో కొత్త డిజైన్, అప్‌డేట్ చేసిన టెయిల్ లైట్, మెరుగైన టెక్నలాజికల్ ఫీచర్లు ఉన్నాయి. హీరో బైక్ లాంచ్ చేసిన ఈ మోడల్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ బైక్‌లో కొత్త టెయిల్‌లైట్ అందించారు.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే
హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 2వీ ప్రత్యేకత ఏమిటి?
ఈ బైక్ 4.7 సెకన్లలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని హీరో పేర్కొంది. ఈ బైక్ కొత్త ఎడిషన్ స్టెల్త్ బ్లాక్ కలర్‌లో లాంచ్ అయింది. ఈ బైక్ సింగిల్ బ్రేక్ వేరియంట్‌తో మాత్రమే వస్తుంది. ఈ బైక్ ఫ్రంట్ బ్రేక్‌గా 276 మిల్లీమీటర్ల పెటల్ డిస్క్‌ను అందించారు. వెనుక బ్రేక్‌గా 220 మిల్లీమీటర్ల పెటల్ లేదా 130 మిల్లీమీటర్ల డ్రమ్‌ని చూడవచ్చు.
హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 2వీ ఇంజిన్
హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 2వీ ఇంజిన్‌లో ఎటువంటి మార్పు లేదు. ఈ కొత్త బైక్ ఇంజన్ మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఈ హీరో బైక్‌లో ఎయిర్ కూల్డ్, 163.2 సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 8,500 ఆర్పీఎం వద్ద 15 హెచ్‌పీ పవర్‌ని ఇస్తుంది. 6,500 ఆర్పీఎం వద్ద 14 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Also Read: రూ.ఆరు లక్షల్లోనే సెవెన్ సీటర్ కారు - పెద్ద ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్!
Don’t hesitate. Don’t fear. Don’t hold yourself back. Get ready to take a leap and win it all. Here comes the all new Xtreme 160R Stealth. Now go 0-60km/hr in just 4.7 seconds. Are you game? #GoBoomInStealthMode #HeroMotoCorp #100Million #Xtreme160RStealth #Xtreme160R #GoBoom #ad pic.twitter.com/VsmJtfZM2A
— Virat Kohli (@imVkohli) February 27, 2022