Hero Vida VX2 Go కొత్త 3.4 kWh వేరియంట్ వచ్చేసింది - మరింత ఎక్కువ రేంజ్, రూ.60 వేలు మాత్రమే!
హీరో Vida VX2 Go కొత్త 3.4 kWh వేరియంట్ లాంచ్ అయింది. ఒక్క ఛార్జ్‌తో 100 కి.మీ. రేంజ్ ఇస్తుంది. Battery-as-a-Service స్కీమ్‌తో దీని ధర కేవలం రూ.60,000 మాత్రమే.

Hero Vida VX2 Go 3.4 kWh electric scooter: హీరో మోటోకార్ప్ ఆధ్వర్యంలోని VIDA, తన ఎలక్ట్రిక్ స్కూటర్ల లైనప్‌లో మరో కొత్త ఎంట్రీ తీసుకొచ్చింది. తాజాగా, ఈ కంపెనీ, Vida VX2 Go 3.4kWh వేరియంట్‌ను మన మార్కెట్లో లాంచ్ చేసింది. స్కూటర్ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తోంది దీని కోసమే. బెటర్ రేంజ్, అందుబాటు ధరతో హీరో తీసుకొచ్చిన గేమ్‌చేంజర్ ఇది.
పెద్ద బ్యాటరీ, పెద్ద రేంజ్
ఇప్పటివరకు Vida VX2 Go కేవలం 2.2 kWh బ్యాటరీతో మాత్రమే అందుబాటులో ఉండేది. కానీ ఈ కొత్త వేరియంట్‌లో 3.4 kWh డ్యూయల్ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు. రెండు బ్యాటరీలు కలిపి 142 కి.మీ. IDC రేంజ్ ఇస్తుంది. నిజ జీవితంలో సుమారు 100 కి.మీ. రేంజ్ దాకా అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు ఒక రోజు మొత్తం రైడ్ చేసేయొచ్చు.
పవర్ & పనితీరు
Vida VX2 Go 3.4 kWh వేరియంట్‌లో ఉన్న 6 kW (8 హార్స్‌పవర్) ఎలక్ట్రిక్ మోటార్ 26 Nm టార్క్ ఇస్తుంది. ఇది నగర రైడింగ్‌కు పర్ఫెక్ట్ ఆప్షన్. టాప్ స్పీడ్ గంటకు 70 కి.మీ.. అలాగే రెండు రైడింగ్ మోడ్‌లు - Eco & Ride - ఉన్నాయి. ఎకో మోడ్‌లో బ్యాటరీ ఎక్కువ సేపు నడుస్తుంది, రైడ్ మోడ్‌లో పికప్ షార్ప్‌గా ఉంటుంది.
ధర & BaaS ఆఫర్
వాస్తవానికి, ఈ కొత్త వేరియంట్ ధర రూ. 1.02 లక్షలు (ఎక్స్-షోరూమ్). కానీ ఇక్కడ హీరో ఇచ్చిన ట్విస్ట్ - బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) ఆప్షన్. మీరు ఈ ఆప్షన్‌తో స్కూటర్ కొనుగోలు చేస్తే, ముందుగా కేవలం రూ. 60,000 మాత్రమే చెల్లించాలి. ఆ తరువాత స్కూటర్‌లోని బ్యాటరీలను రెంట్‌కు తీసుకోవాలి. మీరు ప్రయాణించే దూరం మేరకు బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ చార్జ్ చెల్లిస్తారు, సగటున కిలోమీటరుకు రూ.0.90 మాత్రమే ఖర్చవుతుంది.
రోజూ తక్కువ దూరాలు ప్రయాణించే యువత, డెలివరీ రైడర్లు, ఆఫీస్ కమ్యూటర్లు అందరికీ సౌకర్యమైన ఆప్షన్ ఇది. అంటే, బ్యాటరీ కోసం ముందే పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఫీచర్లు & స్మార్ట్ కనెక్టివిటీ
Vida VX2 Go 3.4 kWhలో 4.3-ఇంచ్ డిజిటల్ డిస్‌ప్లే, My VIDA యాప్ కనెక్టివిటీ, నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్, కాల్ అలర్ట్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఫుల్ LED లైటింగ్, రీజెనరేటివ్ బ్రేకింగ్, రిమూవబుల్ బ్యాటరీలు - ఇవన్నీ యూత్-ఫ్రెండ్లీగా డిజైన్ చేశారు. ఇంట్లోనే బ్యాటరీని సులభంగా ఛార్జ్ చేయొచ్చు.
మొత్తం మూడు వేరియంట్లు
ఇప్పుడు VIDA VX2 సిరీస్‌లో మొత్తం మూడు ఆప్షన్లు ఉన్నాయి:
1. VX2 Go 2.2 kWh
2. VX2 Go 3.4 kWh (కొత్తది)
3. VX2 Plus
మీకు రేంజ్ కావాలా? లేక ఖర్చు తక్కువగా ఉండాలా? అన్నదానికి అనుగుణంగా ఒక వేరియంట్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
Hero Vida VX2 Go 3.4 kWh వేరియంట్ యూత్ రైడర్లకు పర్‌ఫెక్ట్‌గా సరిపోతుంది, స్టైల్ పెంచుతుంది. శక్తిమంతమైన మోటార్, ఎక్కువ రేంజ్, తక్కువ ముందస్తు ఖర్చు.. అన్నీ కలిసి ఇది ఇప్పుడు మార్కెట్లోని బెస్ట్ ఆఫర్‌లలో ఒకటిగా నిలుస్తోంది. హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు నగరాల్లోని డీలర్‌షిప్‌ల్లో ఈ కొత్త స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ స్కూటర్‌ను కొనే ముందు ఒకసారి టెస్ట్ రైడ్ చేయడం మరిచిపోకండి.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















