అన్వేషించండి

Top 5 Two Wheelers: టాప్ 5 టూ వీలర్లలో హీరో Splendor హవా! అమ్మకాల్లో దుమ్మురేపిన రాయల్ ఎన్‌ఫీల్డ్

Hero Splendor On Top Check out the list | సెప్టెంబర్ 2025లో ద్విచక్ర వాహనాల మార్కెట్ జోరుగా సాగింది. హీరో స్ప్లెండర్ అగ్రస్థానం నిలబెట్టుకోగా, హోండా, బజాజ్ మార్కెట్లో రాణించాయి.

భారత్‌లోని టూవీలర్ మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్దది. సెప్టెంబర్ 2025లో ఇందులో అద్భుతమైన వృద్ధి కనిపించింది. GST 2.0 సంస్కరణలు, పండుగల సీజన్ ప్రారంభం కారణంగా మొత్తం అమ్మకాల్లో 10-15% వరకు పెరుగుదల కనిపించింది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల వాటా నిరంతరం పెరుగుతోంది. టాప్ బ్రాండ్లు Hero MotoCorp, హోండా, TVS, Bajaj, Royal Enfield సేల్స్‌లో సత్తా చాటాయి. అదే సమయంలో Royal Enfield మొదటిసారిగా Suzuki ని అధిగమించి టాప్ 5 లో చోటు దక్కించుకుంది. 

టాప్‌లో దూసుకెళ్తున్న Splendor

భారత మార్కెట్లో వరుసగా 24 సంవత్సరాలుగా నంబర్ వన్ స్థానంలో ఉన్న Hero MotoCorp సెప్టెంబర్ నెలలో కూడా తన హవాను కొనసాగించింది. కంపెనీ ఈ నెలలో మొత్తం 6,47,582 యూనిట్ల దేశీయ విక్రయాలను నమోదు చేసింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 5% వృద్ధి సాధించింది. ఎగుమతులను కలిపి మొత్తం అమ్మకాలు 6,87,220 యూనిట్లకు చేరాయి. ఇందుకు అతిపెద్ద కారణం Hero Splendor Plus, దీని 2.5 లక్షలకు పైగా యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఇందులో 97.2cc ఇంజిన్ ఉండగాా, 80–85 kmpl మైలేజీ ఇస్తుంది. రూ. 73,764 ప్రారంభ ధరతో ఈ బైక్ తక్కువ మెయింటనెన్స్, స్ట్రాంగ్ బాడీతో గ్రామీణ ప్రాంతాలవారు, రోజువారీ పనులకు ఈ బైక్ ఫస్ట్ ఛాయిస్ గా ఉంది.

Honda టూవీలర్స్

Honda Two-Wheelers ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. ఇది కూడా సెప్టెంబర్ నెలలో అద్భుతమైన విక్రయాలతో ఆకట్టుకుంది. హోండా సెప్టెంబర్ 2025లో 5,05,693 యూనిట్ల దేశీయ విక్రయాలను నమోదు చేసింది. హోండా 5.1% వృద్ధిని నమోదు చేసింది. ఎగుమతులను కలిపి మొత్తం అమ్మకాలు 5,68,164 యూనిట్లకు చేరాయి.  Honda ప్రధానంగా స్కూటర్లపై ఫోకస్ చేసింది. మొత్తం అమ్మకాల్లో దాదాపు 60% వాటా కలిగి ఉంది. FY26 మొదటి రెండు త్రైమాసికాల్లో కంపెనీ 29.91 లక్షల యూనిట్లను విక్రయించి మార్కెట్లో తన వాటాను పెంచుకుంటుంది. 

టీవీఎస్ మోటార్ (TVS Motor)

మూడవ స్థానంలో ఉన్న TVS Motor Company ఈ ఏడాది సంచలనం సృష్టించింది. దేశీయ విక్రయాలు 4,13,279 యూనిట్లుగా ఉన్నాయి. అంటే ఈ ఏడాది సంస్థ 12% వృద్ధి నమోదు చేసింది.  FY26 రెండవ త్రైమాసికంలో TVS 15.07 లక్షల యూనిట్లను విక్రయించి ఇప్పటివరకు తన అత్యుత్తమ త్రైమాసికాన్ని నమోదు చేసింది. TVS పోర్ట్‌ఫోలియో చాలా సమతుల్యంగా ఉంది. టీవీఎస్ కంపెనీ బైక్‌లు, స్కూటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు మూడింటిలోనూ అద్భుతమైన పనితీరు కనబరిచింది. ఎగుమతుల్లో కూడా కంపెనీ 30% వృద్ధిని నమోదు చేసింది.

బజాజ్ ఆటో (Bajaj Auto) 

సెప్టెంబర్ నెలలో అత్యధిక విక్రయాల జాబితాలో 4వ స్థానంలో ఉన్న Bajaj Auto దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. బజాజ్ దేశీయ విక్రయాలు 2,73,188 యూనిట్లుగా ఉండగా, మొత్తం అమ్మకాలు 5,10,504 యూనిట్లకు చేరుకున్నాయి. ఎగుమతుల్లో బజాజ్ కంపెనీ 12% వార్షిక వృద్ధిని సాధించి మొత్తం 1,57,665 యూనిట్లను పంపింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield)

గత నెలలో విక్రయాలలో ఐదవ స్థానంలో ఉన్న Royal Enfield సెప్టెంబర్ 2025లో చరిత్ర సృష్టించింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ దేశీయ విక్రయాలు 1,13,573 యూనిట్లుగా ఉన్నాయి, ఇది 43% వృద్ధి నమోదు చేయడం విశేషం. మొత్తం అమ్మకాలు 1,24,328 యూనిట్లకు పెరిగాయి. ఇది ఇప్పటివరకు Royal Enfield నెలవారీ అతిపెద్ద రికార్డు. GST కోత, పండుగల సీజన్ డిమాండ్ పెరగడం Royal Enfield అమ్మకాలను భారీగా పెంచింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు Suzuki ని అధిగమించి దేశంలోని టాప్ 5 ద్విచక్ర వాహన కంపెనీలలో చేరింది, ఇది బ్రాండ్ అతిగొప్ప  విజయంగా చెప్పవచ్చు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
Embed widget