HF Deluxe లేదా Passion Plus.. అతి తక్కువ ధరలో లభించే, ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్ ఏది
Hero Passion Plus | హీరో హెచ్ఎఫ్ డీలక్స్, హీరో ప్యాషన్ ప్లస్ బైకులలో తక్కువ ధరకు లభించే బైక్ ఏది. ఫీచర్లు, లుక్ పరంగా మీకు ఏది కావాలో వివరాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe), హీరో ప్యాషన్ ప్లస్ (Passion Plus) భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లు. ఈ రెండు బైక్‌లు రోజువారీ ఆఫీసు, కాలేజీ లేదా పనికి వెళ్లడానికి చవకైన, మన్నికైన బైక్స్. ఎక్కువ మైలేజీని అందించే బైక్‌లను కోరుకునే వారు ఈ బైకులను కొనుగోలు చేస్తారు. తక్కువ బడ్జెట్, సులభమైన మెయింటెనెన్స్, నమ్మదగిన ఇంజిన్ ఈ రెండు బైక్‌లకు ప్లస్ పాయింట్. ఈ రెండు బైక్‌ల రైవల్స్, ఫీచర్ల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం. ఆ విషయాలు తెలుసుకున్నాక మీకు కావాల్సిన బైక్ కొనుక్కోండి.
ధర విషయానికి వస్తే.. Hero HF Deluxe చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 55,992 నుండి ప్రారంభమవుతుంది. Hero Passion Plus బైక్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 76,691 గా ఉంది. అంటే HF Deluxe కంటే Passion Plus సుమారు రూ. 20,000 ఎక్కువ ధరకు లభిస్తుంది.
ఇంజిన్, పనితీరు
ఈ రెండు బైక్‌లలో 97.2cc ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ 8.02 PS శక్తిని, 8.05 Nm టార్క్‌ను అందిస్తుంది. రెండింటిలోనూ 4 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది. BS6 2.0 నిబంధనల ప్రకారం తయారయ్యాయి. సిటీ, గ్రామాల రోడ్లు రెండింటిలోనూ, ఈ బైక్‌లు సులభంగా నడుస్తాయి. HF Deluxe కొంచెం సాధారణంగా ఉండగా, Passion Plus ఇంజిన్ కొంచెం స్మూత్‌గా ఉంటుంది.
బైక్ ఎంత మైలేజ్ ఇస్తుంది?
మైలేజ్ విషయానికి వస్తే 2 బైక్‌లు దాదాపుగా ఒకేలా ఉంటాయి. కంపెనీ ప్రకారం రెండు 70 kmpl వరకు మైలేజ్ ఇస్తాయి. HF Deluxe నగరంలో సుమారు 65 నుండి 70 kmpl ఇస్తుంది. Passion Plus లో i3S టెక్నాలజీ ట్రాఫిక్‌లో ఇంధనాన్ని ఆదా చేయడానికి సహాయపడుతుంది. Passion Plus ఇంధన ట్యాంక్ పెద్దది. దీనితో ఒక సారి ఫుల్ ట్యాంక్‌తో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.
ఎటువంటి బైక్‌లతో పోటీ పడుతుంది?
Hero HF Deluxe 100cc సెగ్మెంట్ ఎంట్రీ-లెవెల్ బైక్‌లకు నేరుగా పోటీనిస్తుంది. ఇందులో Honda Shine 100, బజాజ్ ప్లాటినా 100 (Bajaj Platina 100), టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport), టీవీఎస్ రేడియన్ (TVS Radeon) వంటి బైక్‌లు ఉన్నాయి. ఈ బైక్‌లన్నీ మంచి మైలేజ్, తక్కువ ధర వల్ల విక్రయాల్లో దూసుకెళ్తున్నాయి. HF Deluxe తో నేరుగా పోటీ పడతాయి. Hero Passion Plus 100cc బైక్‌లకు నేరుగా పోటీనిస్తుంది. ఇందులో Honda Shine 100, TVS Radeon, బజాబ్ ప్లాటినా 100 (Bajaj Platina 100), హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus) వంటి బైక్‌లు ఉన్నాయి.
ఫీచర్లు, లుక్ వివరాలు
Hero HF Deluxe డిజైన్ సాధారణంగా ఉన్నా, అవసరమైన ఫీచర్‌లను కలిగి ఉంటుంది. అదే సమయంలో Hero Passion Plus కొంచెం ప్రీమియంగా కనిపిస్తుంది. ఇందులో మంచి గ్రాఫిక్స్, అల్లాయ్ వీల్స్, ఎక్కువ కంఫర్ట్ లభిస్తుంది. మీకు లుక్, కొంచెం ఎక్కువ సౌకర్యం కావాలంటే, Passion Plus మంచిది. మీ బడ్జెట్ తక్కువగా ఉండి ఎక్కువ మైలేజ్ ఇచ్చే చవకైన బైక్ కావాలనుకుంటే Hero HF Deluxe మీకు సరైనది. కొంచెం ఎక్కువ బడ్జెట్, కొంచెం ప్రీమియం లుక్ కోరుకుంటే Hero Passion Plus బెటర్. అయితే రోజువారీ ప్రయాణానికి రెండు బైక్‌లు బాగుంటాయి.






















