అన్వేషించండి

West Asia Conflict: ప్రపంచ ఇంధన సంక్షోభం! భారత్ అప్రమత్తం! మైలేజీ పెంచుకోవడానికి నిపుణుల కీలక సూచనలు !

West Asia Conflict: ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిణామం ఇంధన ధరలపై ప్రభావం చూపవచ్చు. కాని ఒక బాధ్యతాయుతమైన వాహనదారుడిగా మన డ్రైవింగ్ అలవాట్లను మార్చుకోవడం ద్వారా మన జేబుపై భారాన్ని తగ్గించుకోవచ్చు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పశ్చిమాసియా ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన భద్రతపై ప్రభావం చూపుతున్నాయి.
  • ప్రధాని మోదీ కరోనా నాటి పరిస్థితులను గుర్తుచేసి అప్రమత్తతతో ఉండాలన్నారు.
  • పొరుగు దేశాలు ఇంధన కొరతతో విద్యాలయాలు, ఆఫీసులు మూసివేస్తున్నాయి.
  • ఇంధన ఖర్చు తగ్గించుకోవడానికి డ్రైవింగ్, వాహన నిర్వహణలో మార్పులు చేయాలి.

West Asia Conflict: పశ్చిమాసియాలో నెలకున్న తీవ్ర ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌లో కొనసాగుతున్న అస్థిరత వెరసి ఇంధన భద్రత అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి. ఇరాన్- ఇజ్రాయెల్- అమెరికా మధ్య నడుస్తున్న సుదీర్ఘ పోరు ప్రభావం ఇప్పటికే ప్రపంచ సప్లైపై పడింది. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన తాజా వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా కరోనా కాలం నాటి పరిస్థితులను ప్రస్తుత యుద్ధ పరిణామాలతో పోలుస్తూ ఆయన చేసిన హెచ్చరికలు సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల పట్ల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. 

లాక్‌డౌన్ పుకారులు- ప్రధాని మోదీ స్పష్టత !

ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభం వల్ల ప్రపంచవ్యాప్తంగా సఫరా వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రధానమంత్రి మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో మనం ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేస్తూ, ఇప్పుడు కూడా అటువంటి క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే ఉందని, అయితే ప్రజలు ఐకమత్యంతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచ పరిస్థితులు సుదీర్ఘ కాలంపాటు క్లిష్టంగా ఉండొచ్చని, కాబట్టి మనం సిద్ధంగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలి. కొందరు వ్యక్తులు ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని పుకార్లు వ్యాప్తి చేసే అవకాశం ఉంది. అటువంటి వారిని ఏ మాత్రం నమ్మొద్దు అని ప్రధాని స్పష్టం చేశారు. దేశంలో లాక్‌డౌన్ వంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ, ఇంధన లభ్యత, ధరల పెరుగుదల పట్ల ఆందోళనలు వాస్తవమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

విలవిలలాడుతున్న దేశాలు 

భారత్ ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ మన పొరుగు దేశాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. చమురు ధరల పెరుగుదల, ఇంధన కొరత కారణంగా పలు దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. శ్రీలంకలో విద్యాలయాలు, అత్యవసరం కానీ ప్రభుత్వం ఆఫీస్‌లకు సెలవులు ప్రకటించింది. బంగ్లాదేశ్‌లో విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ మోడ్‌లోకి మార్చడమే కాకుండా, షెడ్యూల్డ్‌ విద్యుత్ కోతలను అమలు చేస్తోంది. పాకిస్తాన్‌, ఫిలిప్పీన్స్‌లో ప్రభుత్వం ఉద్యోగుల కోసం వారానికి నాలుగు రోజులు పన దినాలను అమలు చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఏకంగా పీఎస్ఎల్ ప్రారంభ వేడుకలను రద్దు చేసింది. ప్రజల తమ ప్రయాణాలను తగ్గించుకోవాలని సూచించింది. 

ఇంధన పొదుపే శ్రీరామరక్ష

అంతర్జాతీయ పరిస్థితులు మన చేతుల్లో లేకపోయినా మన వాహనం ఇచ్చే మైలేజీ పెంచుకోవడం ద్వారా ఇంధన ఖర్చులను తగ్గించుకోవడం సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు. ప్రతి లీటర్ ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవడానికి అనుసరించాల్సిన ముఖ్యమైన పద్ధతులను ఇవే 

డ్రైవింగ్ శైలీలో మార్పు- చాలా మంది వాహనదారులు ట్రాఫిక్‌లో అకస్మాత్తుగా వేగాన్ని పెంచడం లేదా సడన్ బ్రేక్‌లు వేయడం చేస్తుంటారు. దీని వల్ల ఇంజిన్‌పై ఒత్తిడి పెరిగి ఎక్కువ ఇంధనం ఖర్చు అవుతుంది. దీనికి బదులుగా, క్రమంగా వేగాన్ని పెంచడం, ట్రాఫిక్ గమనాన్ని ముందుగా అంచనా వేసి ప్రశాంతంగా డ్రైవ్ చేయడం వల్ల మైలేజీ గణనీయంగా పెరుగుతుంది. 

స్థిరమైన వేగం-  వేగంలో తరచుగా మార్పులు చేయడం వల్ల ఇంజిన్ వేగాన్ని పుంజుకోవడానికి అదనపు ఇంధనం ఖర్చు అవుతుంది. సాధ్యమైనంత వరకు హైవేలపై లేదా ఖాళీ రోడ్లపై స్థిరమైన వేగంతో డ్రైవ్ చేయాలి. సిటీ ట్రాఫిక్‌లో కూడా అవసరమైన వేగంలో మార్పులు చేయాలి. 

వాహన నిర్వహణ -  సరిగ్గా మెయింటైన్ చేయని కారు మైలేజీని తగ్గిస్తుంది. టైర్‌లో గాలి తక్కువగా ఉంటే రోలింగ్ రెసిస్టెన్స్‌ పెరిగి ఇంజిన్ ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. పాడైపోయిన ఎయిర్‌ ఫిల్టర్లు, లేదా నాణ్యత లేని ఇంజిన్‌ ఆయిల్ కూడా మైలేజీని దెబ్బ తీస్తాయి. అందుకే క్రమం తప్పకుండా సర్వీసింగ్‌ చేయడం ముఖ్యం. 

అదనపు బరువును తగ్గించడం- కారు డిక్కీలో అనవసరమైన వస్తువులను ఉంచడం మంచిది కాదు. ఈ బరువును లాగడానికి ఇంజిన్ ఎక్కువ ఇంధనాన్ని వాడుకుంటుంది. అలాగే ఉపయోగించని రూఫ్ క్యారియర్లు కూడా గాలి నిరోధకతను పెంచి మైలేజీని తగ్గిస్తాయి. 

స్మార్ట్ ప్లానింగ్  - ఒక్కో పని కోసం ఒక్కోసారి బయటకు వెళ్లే కంటే పనులన్నింటినీ కలిపి ఒకే ప్రయాణంలో పూర్తి చేయడం వల్ల దూరం, ఇంధనం ఆదా అవుతాయి. సాధ్యమైనంత వరకు రద్దీ సమయంలో ప్రయాణాలను నివారించడం వల్ల ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా ఉండొచ్చు. 

ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిణామం ఇంధన ధరలపై ప్రభావం చూపవచ్చు. కాని ఒక బాధ్యతాయుతమైన వాహనదారుడిగా మన డ్రైవింగ్ అలవాట్లను మార్చుకోవడం ద్వారా మన జేబుపై భారాన్ని తగ్గించుకోవచ్చు. 

Frequently Asked Questions

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంధన భద్రతను ఎలా ప్రభావితం చేస్తున్నాయి?

ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య నడుస్తున్న పోరు ప్రపంచ చమురు మార్కెట్లో అస్థిరతను సృష్టించి, ఇంధన భద్రతను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇది ప్రపంచ సరఫరాపై ప్రభావం చూపుతోంది.

ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభం గురించి ప్రధానమంత్రి మోదీ ఏమి హెచ్చరించారు?

ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్త సరఫరా వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉందని, కరోనా కాలం నాటి పరిస్థితులు మళ్లీ ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పుకార్లను నమ్మవద్దని సూచించారు.

ఇంధన కొరతను ఎదుర్కోవడానికి ఇతర దేశాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి?

శ్రీలంక విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించింది. బంగ్లాదేశ్ విద్యాసంస్థలను ఆన్‌లైన్‌లోకి మార్చి, విద్యుత్ కోతలు అమలు చేస్తోంది. పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ ఉద్యోగులకు వారానికి నాలుగు రోజులు పని దినాలుగా మార్చాయి.

ఇంధన ఖర్చులను తగ్గించుకోవడానికి ఇంట్లో మనం ఏమి చేయవచ్చు?

వాహన నిర్వహణ మెరుగుపరచడం, అదనపు బరువును తగ్గించడం, డ్రైవింగ్ శైలిని మార్చుకోవడం, స్థిరమైన వేగంతో ప్రయాణించడం, పనులను ఒకే ప్రయాణంలో పూర్తి చేయడం వంటివి ఇంధన ఖర్చులను తగ్గిస్తాయి.

టాప్ హెడ్ లైన్స్

Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు
Honda Elevate Facelift.. హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టే సత్తా ఉందా? ఏ SUVని కొనడం లాభదాయకం?
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ vs హ్యుందాయ్ క్రెటా.. ఫీచర్లు, భద్రతలో తేడాలేంటి? ఏది కొనడం బెటర్‌?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget