అన్వేషించండి

Bajaj Chetak 3501 vs River Indie comparison: బజాజ్ చేతక్ 3501 vs రివర్ ఇండీ! ఎలక్ట్రిక్ టూ-వీలర్ల మధ్య అసలైన పోటీలో మీకు ఏది ఉత్తమం?

బజాజ్ చేతక్ 3501, రివర్ ఇండీ ఇప్పుడు టూవీలర్ మార్కెట్‌లో పోటీ పడుతున్నాయి. ఒకటి క్లాసిక్ స్టైల్‌తో ఆకట్టుకుంటుంటే, రెండోది స్కూటర్ల SUVగా ఆకర్షిస్తోంది. వీటిలో ఏది మీకు సింక్ అవుతోందో తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పెట్రోల్ ధరల పెరుగుదలతో ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఆదరణ పెరుగుతోంది.
  • బజాజ్ చేతక్ 3501, రివర్ ఇండీ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి వచ్చాయి.
  • ధర, డిజైన్, బ్యాటరీ సామర్థ్యం, ఫీచర్లలో ఈ స్కూటర్లు విభిన్నంగా ఉన్నాయి.
  • నగర ప్రయాణానికి చేతక్, రఫ్ రోడ్లకు రివర్ ఇండీ అనుకూలంగా ఉంటాయి.

Bajaj Chetak 3501 vs River Indie comparison: పెట్రోల్ ధరల సెగ నుంచి తప్పించుకోవడానికి సగటు భారతీయ వినియోగదారులు వేగంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు షిప్టు అవుతున్నారు. దీన్ని గమనించిన కంపెనీలు భారీగా సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. అలాంటి వాటిలో బజాజ్‌ నుంచి చేతక్‌, రివర్ కంపెనీ నుంచి ఇండీ రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. అయితే ఈ రెండింటిలో ఈ రెండింటిలో ఏది మీ డబ్బుకు సరైన విలువను ఇస్తుందో లోతుగా పరిశీలిద్దాం.

భారత్‌ ఆటోమొబైల్ మార్కెట్‌లో నిశ్శబ్ద విప్లవం నడుస్తోంది. పెట్రోల్ సంక్షోభం సామాన్యుడి ఆలోచనలు మార్చేస్తోంది. ఆ సెగ నుంచి తప్పించుకోవడానికి ఎలక్ట్రిక్ వాహనాల (EV) వైపు మొగ్గు చూపుతున్నాడు. దీన్ని గమనించిన కంపెనీలు భారీగానే మోడల్స్‌ను మార్కెట్‌లోకి డంప్ చేస్తున్నాయి. ఈ డంప్‌లో ఏది ఎంచుకోవాలో అనేది చాలా మందికి అంతుపట్టడం లేదు. ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్లో ఒక మోడల్‌ పిక్ చేయాలంటే మాత్రం చాలా అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. భారీగా అందుబాటులో ఉన్న మోడల్స్‌లో బజాజ్ చేతక్ 3501, రివర్ ఇండి గట్టి పోటీ ఇస్తున్నాయి. అయితే ఈ రెండింటిలో ఒకటి ఎంచుకోవాలంటే మాత్రం చాలా రివ్యూలు చూడాల్సి వస్తోంది. 

బజాజ్ చేతక్ అంటే నేటి తరానికి పెద్దగా పరిచయం లేదు కానీ నాటి తరం వారికి ఇదో ఎమోషన్. దశాబ్దాల కాలంగా మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ రూపంలో నియో-రెట్రో స్టైల్‌తో మార్కెట్‌లోకి పునఃప్రవేశం చేసింది. రివర్ అనే స్టార్టప్ తన ఇండీ మోడల్‌ రోడ్లపైకి తీసుకొచ్చింది. ఇది వచ్చీరాగానే  స్కూటర్లలో SUVగా పేరు తెచ్చుకుంది. ఈ రెండు ఈవీలు కూడా ఒకే ధర మోడ్‌లోకి వస్తాయి. కానీ వినియోగదారులు, ఒకటి స్టైల్‌గా కనిపిస్తే, మరొకటి యుటిలటీపై ఫోకస్ చేసింది. మీరు ముందుగా వ్యత్యాసాలు అర్థం చేసుకుంటే డబ్బుకు సరైన విలువనిచ్చే వాహనాన్ని మీరు ఎంచుకోవచ్చు.

Bajaj Chetak 3501 vs River Indie comparison: బజాజ్ చేతక్ 3501 vs రివర్ ఇండీ! ఎలక్ట్రిక్ టూ-వీలర్ల మధ్య అసలైన పోటీలో మీకు ఏది ఉత్తమం?

ధరలో వ్యత్యాసం ఎంత 

బజాజ్ చేతక్ 3501ధర రూ. 1,44,305, రివర్ ఇండీ రూ.1,52,399లకు లభిస్తుంది. రివర్ ఇండీతో పోలిస్తే బజాజ్ చేతక్ సుమారు రూ. 8,000 తక్కువ ధరకే లభిస్తోంది. వారంటీ విషయానికి వస్తే చేతక్ 3 ఏళ్లు లేదా 50,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తోంది. రివర్ 3 ఏళ్లు లేదా 30,000 కిలోమీటర్లకే వారంటీ ఇస్తోంది. అంతేకాకుండా తన వినియోగదారుల కోసం 8 ఏళ్లు లేదా 80,000 కిలోమీటర్ల వరకు పొడిగించిన వారంటీ ప్లాన్ ఒకటి రివర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.  

Bajaj Chetak 3501 vs River Indie comparison: బజాజ్ చేతక్ 3501 vs రివర్ ఇండీ! ఎలక్ట్రిక్ టూ-వీలర్ల మధ్య అసలైన పోటీలో మీకు ఏది ఉత్తమం?

డిజైన్, నిర్మాణంలో ఉన్న తేడాలు 

బజాజ్ చేతక్ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ మెటల్ బాడీతో బజాజ్ చేతక్ 3501ను తీసుకొచ్చింది. అంతే కాకుండా లేటెస్ట్ ఫినిషింగ్‌ను కూడా అందిస్తోంది. ఈ బండి సీటు ఎత్తు 775mm. పొట్టిగా ఉన్న వాళ్లకి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది.  

Bajaj Chetak 3501 vs River Indie comparison: బజాజ్ చేతక్ 3501 vs రివర్ ఇండీ! ఎలక్ట్రిక్ టూ-వీలర్ల మధ్య అసలైన పోటీలో మీకు ఏది ఉత్తమం?

రివర్ ఇండీ పూర్తిగా భిన్నమైన బాక్సీ డిజైన్‌తో ఉంటుంది. దీనిని రగ్గడ్ లుక్ యూత్‌ను ఆకట్టుకుంటుంది. 14-అంగుళాల పెద్ద చక్రాలు, విశాలమైన బాడీతో ఇది ఒక SUV మాదిరి ఫీలింగ్ ఇస్తుంది. దీని బరువు 143 కేజీలు కాగా, చేతక్ 134 కేజీలే. అంటే ట్రాఫిక్‌లో చేతక్ సులభంగా నడపవచ్చు. హైవేలపై మాత్రం రివర్ ఇండీ మంచి పెర్ఫార్మెన్స్ చూపిస్తోంది.  

Bajaj Chetak 3501 vs River Indie comparison: బజాజ్ చేతక్ 3501 vs రివర్ ఇండీ! ఎలక్ట్రిక్ టూ-వీలర్ల మధ్య అసలైన పోటీలో మీకు ఏది ఉత్తమం?

పర్ఫార్మెన్స్ -బ్యాటరీ సామర్థ్యం  

టెక్నాలజీ విషయానికి వస్తే రివర్ ఇండీ ముందంజలో ఉంటుంది. ఇది 6.7kW పీక్ పవర్‌ను ఉత్పత్తి చేసే ఇంజిన్‌కు కలిగి ఉంది. చేతక్ 3501 కేవలం 4.2kW వరకు మాత్రమే వెళ్లగలదు. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లాలంటే మాత్రం ఇండీని మీ ఇంటికి తెచ్చుకోవాలి. చేతక్ వేగం కేవలం గంటకు 80 కిలోమీటర్లే. రివర్ ఇండీలోని 4kWh బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేస్తే 163కిలోమీటర్లు ఆగకుండా సాగిపోవచ్చు. చేతక్ 3.5kWh బ్యాటరీతో వస్తోంది. దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే 153 కిలోమీటర్లు దూసుకెళ్లొచ్చు.  

Bajaj Chetak 3501 vs River Indie comparison: బజాజ్ చేతక్ 3501 vs రివర్ ఇండీ! ఎలక్ట్రిక్ టూ-వీలర్ల మధ్య అసలైన పోటీలో మీకు ఏది ఉత్తమం?

ఛార్జింగ్ పరంగా చూస్తే చేతక్ చాసా స్పీడ్ చార్జింగ్ కెపాసిటీ కలిగి ఉంది. ఇది ఇంట్లో 3 గంటల్లో 0-80% ఛార్జ్ అవుతుంది. రివర్ ఇండీ DC ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇది లాంగ్ జర్నీలో ఉపయోగకరంగా ఉంటుంది. బజాజ్ చేతక్ 3501లో TFT టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే కలిగి ఉంది. గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, మ్యూజిక్ కంట్రోల్ ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. స్టోరేజీ విషయంలో రివర్ ఇండీ ముందంజలో ఉంది. దీని స్టోరేజ్ 43 లీటర్లు, ముందు భాగంలో మరో 12 లీటర్ల గ్లోవ్‌బాక్స్ ఉంది. చేతక్‌లో స్టోరేజ్ కేవలం 35 లీటర్లే. రివర్ ఇండీ డిస్క్ బ్రేకులతో వస్తుంది. చేతక్‌లో వెనుక చక్రాలకే డ్రమ్ బ్రేక్స్‌ ఉన్నాయి.  

Bajaj Chetak 3501 vs River Indie comparison: బజాజ్ చేతక్ 3501 vs రివర్ ఇండీ! ఎలక్ట్రిక్ టూ-వీలర్ల మధ్య అసలైన పోటీలో మీకు ఏది ఉత్తమం?

ఎవరికి ఏది సెట్ అవుతుంది? 

రోజూ ఆఫీసుకి వెళ్లేవాళ్లకు, సిటీ ట్రాఫిక్‌లో సులభంగా వెళ్లేందుకు ఒక స్టైలిష్, మెటల్ బాడీ స్కూటర్ కావాలనుకుంటే బజాజ్ చేతక్ 3501 సరైన ఎంపిక అవుతుంది. ఎక్కువ సామాన్లు మోయాల్సి ఉన్నా, రఫ్ అండ్ టఫ్ రోడ్లపై ప్రయాణించేందుకు పవర్‌ఫుల్ స్కూటర్ కావాలంటే రివర్ ఇండీ సరిపోతుంది.  

Bajaj Chetak 3501 vs River Indie comparison: బజాజ్ చేతక్ 3501 vs రివర్ ఇండీ! ఎలక్ట్రిక్ టూ-వీలర్ల మధ్య అసలైన పోటీలో మీకు ఏది ఉత్తమం?

Frequently Asked Questions

బజాజ్ చేతక్ 3501 మరియు రివర్ ఇండీ ధరలలో తేడా ఎంత?

రివర్ ఇండీ రూ.1,52,399లకు లభిస్తుండగా, బజాజ్ చేతక్ 3501 సుమారు రూ.8,000 తక్కువ ధరకే, రూ.1,44,305లకు లభిస్తుంది.

ఈ రెండు స్కూటర్ల వారంటీ వివరాలు ఏమిటి?

బజాజ్ చేతక్ 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తుంది. రివర్ ఇండీ 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వరకు వారంటీతో వస్తుంది, కానీ 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వరకు పొడిగించిన వారంటీ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది.

పనితీరు మరియు బ్యాటరీ సామర్థ్యం పరంగా ఏది మెరుగైనది?

రివర్ ఇండీ 6.7kW పీక్ పవర్ తో, గంటకు 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది, 4kWh బ్యాటరీతో 163 కిలోమీటర్లు ప్రయాణించగలదు. చేతక్ 4.2kW పవర్, గంటకు 80 కిలోమీటర్ల వేగం, 3.5kWh బ్యాటరీతో 153 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

ఛార్జింగ్ మరియు ఫీచర్ల విషయంలో తేడాలు ఏమిటి?

చేతక్ ఇంట్లో 3 గంటల్లో 0-80% ఛార్జ్ అవుతుంది. రివర్ ఇండీ DC ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చేతక్ లో TFT టచ్‌స్క్రీన్, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి, రివర్ ఇండీలో ఎక్కువ స్టోరేజీ (43 లీటర్లు) మరియు డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

ఏ స్కూటర్ ఎవరికి సరిపోతుంది?

స్టైలిష్, సిటీ ట్రాఫిక్‌కు అనువైన మెటల్ బాడీ స్కూటర్ కావాలంటే బజాజ్ చేతక్ 3501 మంచిది. ఎక్కువ సామాన్లు మోయాల్సిన వారికి, రఫ్ అండ్ టఫ్ రోడ్లపై ప్రయాణించే వారికి పవర్‌ఫుల్ రివర్ ఇండీ సరిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
కొత్త ఎలక్ట్రిక్ స్కూటీ VLF Strada లాంచ్.. లాంగ్ రేంజ్ EV, బైక్ లాంటి స్పీడ్
ఖరీదైన కార్లలోనే ADAS ఉంటుందని అనుకుంటున్నారా? మీ బడ్జెట్‌లోనే అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు
ఖరీదైన కార్లకు దీటుగా ADAS ఉన్న 'బడ్జెట్‌ కార్లు'.. రూ.9.39 లక్షలకే సొంతం చేసుకోవచ్చు!
Best selling car: దేశవ్యాప్తంగా జనం ఈ కారు కోసం షోరూమ్‌ ముందు క్యూ కట్టారు, మీ బడ్జెట్‌లోనే వస్తుంది!September 2026 best selling cars in India Maruti Baleno price
సేల్స్‌లో దేశంలోనే నంబర్ 1 ఈ మారుతి కారు.. ధర రూ.6 లక్షల లోపే!
ఎలక్ట్రిక్ కార్లతో జర జాగ్రత్త.. చిన్న పొరపాటుతో భారీ ప్రమాదం! EV వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన భద్రత సూచనలు!
విజయవాడలో నలుగురి ప్రాణాలు తీసిన EV ప్రమాదం! ఎలక్ట్రిక్ కార్లలో మంటలు రాకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget