అన్వేషించండి

E20 Fuel Mileage: E20 పెట్రోల్ మీ వాహనం మైలేజీని ప్రభావితం చేస్తుందా? మీ ప్రతి ప్రశ్నకు సమాధానం తెలుసుకోండి

E20 Fuel Effect On Cars: E20 పెట్రోల్ అంటే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం ద్వారా తయారవుతుంది. ఇది దాని పేరులోనే స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఇంధనానికి సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.

E20 Fuel Impact On Bikes: భారత ప్రభుత్వం, ముడి చమురు దిగుమతులను తగ్గించడానికి & వాహనాల నుంచి విడుదలయ్యే CO2 లేదా కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించడానికి E20 ఇంధనాన్ని ప్రోత్సహిస్తోంది. వాస్తవానికి, E20 పెట్రోల్‌ను అందుబాటులోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం 2030 వరకు గడువు పెట్టుకున్నా, అది చాలా ముందే అందుబాటులోకి వచ్చింది. 2030 గడువుకు ముందే భారతదేశం అంతటా E20 ఇంధనం అందుబాటులో ఉందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ పరిస్థితిలో, E20 గురించి ప్రజల నుంచి, ముఖ్యంగా కార్‌ & బైకుల యజమానుల నుంచి చాలా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ కథనంలో, అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. 

E20 పెట్రోల్‌ అంటే కూడా పెట్రోలే. అయితే, పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడం (Blending 20 percent ethanol into petrol) ద్వారా దానిని తయారు చేస్తారు. ఈ విషయం "E20 పెట్రోల్‌" పేరులోనే స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు E10 ఇంధననాన్ని మన కార్లు, బైకులు, ఇతర వాహనాల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నాం, ఈ పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ కలిసి ఉంటుంది. 

కొత్త కార్లకు సురక్షితమేనా? 
చాలా కార్ల తయారీ కంపెనీలు, ఇప్పటికే E20 కంప్లైంట్ కార్లను తయారు చేయడం ప్రారంభించాయి. 01 ఏప్రిల్ 2023 తర్వాత తయారైన అన్ని కార్లు E20కి అనుకూలంగా ఉంటాయి & అంతకు ముందు తయారు చేయబడిన కొన్ని కార్లు కూడా దీనికి అనుకూలంగా ఉంటాయి. కాబట్టి మీ కారు కొత్తది  లేదా & 01 ఏప్రిల్ 2023 తర్వాత ఉత్పత్తి అయినది అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇంకా మీకు ఏదైనా సందేహం ఉంటే, మీ కారు మాన్యువల్‌లో కంపెనీ పేర్కొన్న ఇంధన సిఫార్సులను చెక్‌ చేయవచ్చు. 

నా కారు పాతదైతే పరిస్థితి ఏంటి, E20 పెట్రోల్‌ పోయవచ్చా?
2012 తర్వాత & 2023 కి ముందు తయారైన వాహనాలు సాధారణంగా E10 ఇంధనానికి అనుకూలంగా ఉంటాయి & ఇక్కడే సమస్య ప్రారంభమవుతుంది. సోషల్ మీడియాలో చాలా మంది వినియోగదారులు E20 ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల మైలేజ్‌లో స్వల్ప తగ్గుదల ఉందని ఫిర్యాదు చేశారు. ARAI ప్రకారం, మైలేజీలో స్వల్ప తగ్గుదల ఉండవచ్చు కానీ అది వాహనానికి పెద్దగా హాని కలిగించదు. సరళంగా చెప్పాలంటే, E20 ఇంధనాన్ని జోడించడం వల్ల మీ కారుకు వెంటనే నష్టం జరగదు, కానీ దీర్ఘకాలంలో ఇంజిన్ తరుగుదలకు కారణమవుతుంది. అయితే, ఇది మీ కారు వయస్సుపై కూడా ఆధారపడి ఉంటుంది. అందువల్ల, ఆడిటివ్స్‌ లేదా ఇథనాల్ లేకుండా హై ఆక్టేన్ ఫ్యూయల్‌ను ఉపయోగించడం మంచిది. అయితే,  హై ఆక్టేన్ ఫ్యూయల్‌ కొంచం ఖరీదు ఎక్కువ. 

కారు వారంటీకి ఏమి జరుగుతుంది?
ఇది పెద్ద సమస్య కావచ్చు. కంపెనీ సిఫార్సు చేసిన ఇంధనాన్ని కారులో ఉపయోగించకపోతే వారంటీ రద్దు చేయవచ్చని టయోటా స్పష్టం చేసింది.

ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? 
E10 & E20 ఇంధనాలను అందించడం మంచి విషయమే కావచ్చు. దీనితో పాటు, E10 కార్లను E20 కోసం కూడా సిద్ధంగా ఉంచడం కూడా ఒక పరిష్కారం కావచ్చు. అంటే, కార్‌ తయారీ కంపెనీలు E20 అప్‌గ్రేడ్ సొల్యూషన్స్‌ను కూడా అందించవచ్చు. కానీ, ఇది మనం అనుకున్నంత సులభమైతే కాదు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Siddaramaiah Controversy: జర్మనీ చాన్సలర్‌కు అగౌరవం - రాహుల్‌కే గౌరవం - మరో వివాదంలో సిద్ధరామయ్య!
జర్మనీ చాన్సలర్‌కు అగౌరవం - రాహుల్‌కే గౌరవం - మరో వివాదంలో సిద్ధరామయ్య!
Republic Day 2026: రిపబ్లిక్‌డే ముందు ఢిల్లీలో డేగలకు 'చికెన్ పార్టీ'! ప్రభుత్వం ఎందుకిలా చేస్తోంది?
రిపబ్లిక్‌డే ముందు ఢిల్లీలో డేగలకు 'చికెన్ పార్టీ'! ప్రభుత్వం ఎందుకిలా చేస్తోంది?
Pongal 2026: కేంద్రమంత్రి ఇంట్లో పొంగల్ వండిన మోదీ! తమిళ ప్రజలకు పండగ శుభాకాంక్షలు చెప్పిన పీఎం!
కేంద్రమంత్రి ఇంట్లో పొంగల్ వండిన మోదీ! తమిళ ప్రజలకు పండగ శుభాకాంక్షలు చెప్పిన పీఎం!
Kamareddy Crime News: తెలంగాణలో 600 కుక్కలను విషం పెట్టి చంపేశారు! ఎన్నికల్లో ఇచ్చిన హామీ కోసం దారుణం!
తెలంగాణలో 600 కుక్కలను విషం పెట్టి చంపేశారు! ఎన్నికల్లో ఇచ్చిన హామీ కోసం దారుణం!

వీడియోలు

Mumbai Indians vs Gujarat Giants WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం!
Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
Jitesh Sharma Being Dropped from T20 World Cup | వరల్డ్ కప్ జితేష్ సంచలన వ్యాఖ్యలు!
India vs New Zealand 2nd ODI | టీమిండియాలో భారీ మార్పులు ?
Anil Ravipudi on Social Media Trolls | మీమర్స్ ట్రోల్స్ వేసుకుంటే వేసుకోండి..నేను ఎంజాయ్ చేస్తా |ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Siddaramaiah Controversy: జర్మనీ చాన్సలర్‌కు అగౌరవం - రాహుల్‌కే గౌరవం - మరో వివాదంలో సిద్ధరామయ్య!
జర్మనీ చాన్సలర్‌కు అగౌరవం - రాహుల్‌కే గౌరవం - మరో వివాదంలో సిద్ధరామయ్య!
Republic Day 2026: రిపబ్లిక్‌డే ముందు ఢిల్లీలో డేగలకు 'చికెన్ పార్టీ'! ప్రభుత్వం ఎందుకిలా చేస్తోంది?
రిపబ్లిక్‌డే ముందు ఢిల్లీలో డేగలకు 'చికెన్ పార్టీ'! ప్రభుత్వం ఎందుకిలా చేస్తోంది?
Pongal 2026: కేంద్రమంత్రి ఇంట్లో పొంగల్ వండిన మోదీ! తమిళ ప్రజలకు పండగ శుభాకాంక్షలు చెప్పిన పీఎం!
కేంద్రమంత్రి ఇంట్లో పొంగల్ వండిన మోదీ! తమిళ ప్రజలకు పండగ శుభాకాంక్షలు చెప్పిన పీఎం!
Kamareddy Crime News: తెలంగాణలో 600 కుక్కలను విషం పెట్టి చంపేశారు! ఎన్నికల్లో ఇచ్చిన హామీ కోసం దారుణం!
తెలంగాణలో 600 కుక్కలను విషం పెట్టి చంపేశారు! ఎన్నికల్లో ఇచ్చిన హామీ కోసం దారుణం!
The Raja Saab : మెగాస్టార్‌తో మూవీ - 'ది రాజా సాబ్' డైరెక్టర్ మారుతి రియాక్షన్... ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్
మెగాస్టార్‌తో మూవీ - 'ది రాజా సాబ్' డైరెక్టర్ మారుతి రియాక్షన్... ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్
Anaganaga Oka Raju Review - 'అనగనగా ఒక రోజు' రివ్యూ: పండక్కి పల్లెటూరి కథతో వచ్చిన నవీన్ పోలిశెట్టి - సినిమా హిట్టేనా?
'అనగనగా ఒక రోజు' రివ్యూ: పండక్కి పల్లెటూరి కథతో వచ్చిన నవీన్ పోలిశెట్టి - సినిమా హిట్టేనా?
Vedavyas Movie : సరికొత్త కాన్సెప్ట్‌తో 'వేదవ్యాస్' - మీ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి... హీరో ఎవరో తెలుసా?
సరికొత్త కాన్సెప్ట్‌తో 'వేదవ్యాస్' - మీ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి... హీరో ఎవరో తెలుసా?
Iran vs US: ఇరాన్‌లో పెద్దగానే ప్లాన్ చేసిన ట్రంప్‌? అమెరికా పౌరులు వెంటనే ఖాళీ చేయాలని సూచన!
ఇరాన్‌లో పెద్దగానే ప్లాన్ చేసిన ట్రంప్‌? అమెరికా పౌరులు వెంటనే ఖాళీ చేయాలని సూచన!
Embed widget