అన్వేషించండి

Ducati Watches: డుకాటీ మోటార్‌ సైకిల్ స్టైల్‌ ఇప్పుడు వాచ్‌ల్లో కూడా - ధర ఎంతంటే?

Ducati Watches Launched: Ducati & Titan కలిసి భారత్‌లో కొత్త వాచ్‌ల కలెక్షన్‌ను లాంచ్ చేశాయి. మోటార్‌ సైకిల్ డిజైన్ స్పూర్తితో వచ్చిన ఈ ప్రీమియం వాచ్‌లు రూ.14,799 నుంచి అందుబాటులోకి వచ్చాయి.

Ducati Watches India: భారత్‌లో డుకాటీ అభిమానులకు ఇప్పుడు మరో ప్రత్యేక అనుభూతి అందుబాటులోకి వచ్చింది. రైడింగ్‌ థ్రిల్‌ కోసం పేరుగాంచిన Ducati, ఇప్పుడు తన రేసింగ్‌ స్టైల్‌, అగ్రెసివ్‌ డిజైన్‌ & శక్తిమంతమైన పనితీరును వాచ్‌ల రూపంలోనూ భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త వాచ్‌ల కలెక్షన్‌ను టైటన్‌ (Titan Company Limited) డిస్ట్రిబ్యూట్‌ చేస్తోంది. డిసెంబర్‌ 3న అధికారికంగా లాంచ్ అయిన ఈ సిరీస్‌లో మొత్తం 43 మోడళ్లు ఉన్నాయి. వాటి ధరలు రూ.14,799 నుంచి రూ.27,999 వరకు ఉన్నాయి.

ప్రత్యేకమైన డిజైనింగ్‌
ఈ వాచ్‌లను పూర్తిగా డుకాటీ మోటార్‌ సైకిళ్ల నుంచి తీసుకున్న డిజైన్‌ స్పూర్తితోనే రూపొందించారు. ప్రత్యేకంగా ఇన్‌స్ట్రుమెంటేషన్‌-లుక్‌ ఉన్న డయల్స్‌, ఆకర్షణీయమైన రెడ్‌ యాక్సెంట్స్‌, షార్ప్‌ ఎడ్జ్‌లు, వైమానిక ప్రేరణతో చేసిన కేసింగ్‌, మోటార్‌ స్పోర్ట్స్‌ టెక్స్చర్‌లు... డుకాటీ రేసింగ్‌ ప్రపంచాన్ని గుర్తు చేస్తాయి. డుకాటీ రైడర్లు, మోటార్‌ సైకిల్‌తో కలిగే ఆ పెద్ద థ్రిల్‌ను చేతిపైన కూడా అనుభూతి చెందేలా ఈ వాచ్‌లను ప్రత్యేకంగా డిజైన్‌ చేశారని బ్రాండ్ చెబుతోంది.

ఎక్కడ కొనవచ్చు?
భారత్‌లో డుకాటీ మర్చండైస్‌ కోసం చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ అవసరాన్ని గుర్తించిన Ducati... Titan‌ను తన ప్రత్యేక లైసెన్సింగ్‌ & డిస్ట్రిబ్యూషన్‌ భాగస్వామిగా ప్రకటించింది. అంటే ఈ వాచ్‌లు టైటన్‌ తయారీ కాదు; కానీ Titan మాత్రమే వాటి భారత మార్కెట్‌ డిస్ట్రిబ్యూటర్‌. Titan‌ Helios, Titan World & ప్రముఖ మల్టీ-బ్రాండ్‌ స్టోర్లతో పాటు ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఇవి అందుబాటులో ఉంటాయి.

Ducati బ్రాండ్ లైసెన్సింగ్ హెడ్ Alessandro Cicognani మాట్లాడుతూ - “Ducati అంటే ఎమోషన్‌. రైడర్‌ బైక్‌తో కలిసిపోయే ఆ క్షణాన్ని మేము ఈ వాచ్‌లలోకి తీసుకొచ్చాం. ప్రతి డుకాటీ ఫ్యాన్‌ కోసం ఇది ప్రత్యేకంగా రూపొందించిన కలెక్షన్‌” అని చెప్పారు.

Titan Watches CEO Kuruvilla Markose మాట్లాడుతూ - “డుకాటీ మర్చండైస్‌ కోసం భారత రేసింగ్‌ కమ్యూనిటీ చాలా కాలంగా ఎదురు చూసింది. ఈ ప్రీమియం వాచ్‌లతో ఆ లోటు ఇప్పుడు తీరిపోయింది” అన్నారు.

స్పెషల్‌ కలెక్షన్‌
డుకాటీ అభిమానులు ఇప్పుడు తమ రోజు వారీ జీవితంలో కూడా బ్రాండ్‌ స్పూర్తిని అనుభూతి చెందగలిగేలా ఈ వాచ్‌లు రూపొందించడం ప్రత్యేకత. మోటార్‌ స్పోర్ట్ ప్రేమికులు, స్టైల్‌ను ప్రాధాన్యంగా చూసే యువత & ప్రీమియం యాక్ససరీస్‌ ఇష్టపడే వారికి ఇవి ఒక ప్రత్యేక ఎంపికగా నిలుస్తాయి.

భారత్‌లో మోటార్‌ సైకిల్‌ సంస్కృతికి భారీ ఆదరణ ఉన్న తరుణంలో Ducati Watches లాంచ్‌ కావడాన్ని, లైఫ్‌ స్టైల్‌ సెగ్మెంట్‌లో డుకాటీ ప్రారంభించిన కీలక అడుగుగా చూస్తున్నారు పరిశ్రమ నిపుణులు. టైటన్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ ఉండటంతో, ఈ వాచ్‌లు దేశవ్యాప్తంగా సులభంగా అందుబాటులోకి వస్తాయి.

డుకాటీ స్టైల్‌ను ఇప్పుడు రోడ్డుమీద కాదు, చేతిపైన కూడా ధరించొచ్చు అనేది ఈ కలెక్షన్‌ ప్రత్యేకత.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

Hybrid SUV: 1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
1000 కిలోమీటర్ల రేంజ్‌, మంచి మైలేజీతో వస్తున్న 4 హైబ్రిడ్ SUVలు! 
Car Coolant: కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
కారులో కూలెంట్ అయిపోతే ఏం చేయాలి? లేకుంటే జరిగే నష్టమేంటి?
Top Car Exports From India 2026: భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాహనాల గురించి తెలుసా? 
భారత్‌లో తయారై, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాహనాల గురించి తెలుసా?
Alloy Wheel or Steel Wheel: అల్లాయ్ వీల్స్ లేదా స్టీల్ వీల్స్: ఏది మంచిది? ప్రతి విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి!
అల్లాయ్ వీల్స్ లేదా స్టీల్ వీల్స్: ఏది మంచిది? ప్రతి విషయాన్ని ఇక్కడ తెలుసుకోండి!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget