అన్వేషించండి

స్లిప్పర్లు వేసుకుని కార్ డ్రైవ్ చేస్తే చలాన్ రాస్తున్నారా? మోటార్ వెహికల్స్ చట్టంలో ఏం ఉంది?

స్లిప్పర్లు లేదా ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకుని కార్ డ్రైవ్ చేస్తే జరిమానా పడుతుందా? మోటార్ వెహికల్స్ చట్టం ప్రకారం నిజం ఏంటి?, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఏం చెప్పారు? - తెలుసుకోండి.

Driving With Slippers In India: మన దేశంలో ట్రాఫిక్ నిబంధనల గురించి చాలా మందికి పూర్తిగా అవగాహన ఉండదు. ముఖ్యంగా కొన్ని రూల్స్ విషయంలో అనుమానాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి ఒక అనుమానం - స్లిప్పర్లు లేదా ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకుని కార్ డ్రైవ్ చేస్తే పోలీస్‌లు చలాన్ రాస్తారా?

చాలా ఏళ్లుగా ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంతమంది ట్రాఫిక్ సిబ్బంది కూడా ఇది నిబంధనలకు విరుద్ధమని చెబుతుంటారు. దీంతో సాధారణ ప్రజల్లో గందరగోళం నెలకొంది.

చట్టం ఏమంటోంది?

భారతదేశంలో అమల్లో ఉన్న Motor Vehicles Act ప్రకారం, స్లిప్పర్లు లేదా ఫ్లిప్ ఫ్లాప్స్ వేసుకుని డ్రైవ్ చేయడాన్ని నేరంగా పేర్కొన్న ఎలాంటి నిబంధన లేదు. డ్రైవర్ షూస్ వేసుకున్నా, స్లిప్పర్లు వేసుకున్నా లేదా ఉత్త కాళ్లతో బండి నడిపినా చలాన్ విధించాలన్న నిబంధన చట్టంలో ఎక్కడా ప్రస్తావించలేదు. దీని అర్ధం - స్లిప్పర్లు వేసుకుని డ్రైవ్ చేశారనే కారణంతో మాత్రమే జరిమానా విధించడం చట్టబద్ధం కాదు.

కేంద్ర మంత్రి స్పష్టీకరణ

చాలా ఏళ్ల క్రితమే, కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) అధికారికంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. స్లిప్పర్లు వేసుకుని కార్‌ లేదా ఏదైనా వెహికల్‌ డ్రైవ్ చేయడం నేరం కాదని ఆయన తెలిపారు.

జాగ్రత్తలు అవసరమే

స్లప్పర్లు వేసుకుని కారు నడపడం చట్టపరంగా నేరం కాకపోయినా, భద్రత దృష్ట్యా మాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి కారణం... షూస్‌తో పోలిస్తే స్లిప్పర్లు లేదా సాండల్స్ పెడల్స్‌పై సరైన గ్రిప్ ఇవ్వవు. అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు కాలు జారిపోవడం లేదా కింద ఇరుక్కుపోవడం వంటి రిస్క్‌లు చోటు చేసుకోవచ్చు.

డ్రైవింగ్‌ చేసే వ్యక్తి షూస్ ధరిస్తే:

పెడల్స్‌పై మంచి నియంత్రణ ఉంటుంది

బ్రేక్, యాక్సిలరేటర్‌పై సమాన ఒత్తిడి పెట్టగలుగుతారు

ఆకస్మిక పరిస్థితుల్లో వేగంగా స్పందించగలుగుతారు

స్లిప్పర్లు అయితే:

సులభంగా జారిపోతాయి

కాలు నుంచి విడిపోవచ్చు

పెడల్ కింద అవి ఇరుక్కునే ప్రమాదం ఉంది

ఇలాంటి చిన్న తప్పిదాలు కూడా పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చు.

ఫైనల్‌గా చెప్పాలంటే... స్లిప్పర్లు వేసుకుని కార్ డ్రైవ్ చేయడం చట్టపరంగా నేరం కాదు. కేవలం ఈ కారణంతో పోలీసులు చలాన్ విధించలేరు. అయితే భద్రత పరంగా చూస్తే సరైన షూస్ వేసుకుని డ్రైవ్ చేయడం మంచిది.

ట్రాఫిక్ నిబంధనలపై సరైన అవగాహన ఉండటం ప్రతి డ్రైవర్ బాధ్యత. అపోహలు కాకుండా, నిజమైన చట్టాన్ని తెలుసుకుని సురక్షితంగా డ్రైవింగ్ చేయడం అవసరం. కాబట్టి, చట్టం అనుమతిస్తుందనే కారణంతో నిర్లక్ష్యం చేయకుండా, మీ భద్రతను ముందు ప్రాధాన్యంగా తీసుకోండి. 

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

టాప్ హెడ్ లైన్స్

భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Road Accident: హైదరాబాద్- విజయవాడ హైవేపై థార్ బీభత్సం.. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లు మృతి!
హైదరాబాద్- విజయవాడ హైవేపై థార్ బీభత్సం.. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లు మృతి!
Punganur Elections: ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పోలీసుల నోటీసులు.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్!
Tirupati Municipal Elections: తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
తిరుపతి మేయర్ ఎన్నికల్లో చిల్లర నామినేషన్లు.. సంచులతో వచ్చిన అభ్యర్థులు
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Rayachoti Murder Plot: రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
రాయచోటిలో తీవ్ర కలకలం.. మంత్రి రాంప్రసాద్‌రెడ్డి హత్యకు కుట్ర.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Embed widget