Discount On Maruti Fronx: మారుతి ఫ్రాంక్స్ పై భారీ ఆఫర్.. GST తగ్గింపుతో మరింత ఎక్కువ ఆదా చేసుకోండి
Maruti Fronx Discount Price | సెప్టెంబర్ 2025 వరకు Maruti Fronx SUV పై 83,000 వరకు డిస్కౌంట్ ఉంది. ఈ క్రమంలో GST సైతం తగ్గించడంతో మారుతీ ఫ్రాంక్స్ ఇప్పుడు మరింత చౌకగా కొనుగోలు చేయవచ్చు.

Maruti Suzuki తన Nexa డీలర్‌షిప్‌లలో విక్రయించే Fronx SUVపై అద్భుతమైన ఆఫర్‌ను తీసుకువచ్చింది. సెప్టెంబర్ 2025లో ఈ కారును కొనుగోలు చేసే కస్టమర్‌లకు ఏకంగా రూ. 83,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వచ్చే కొత్త GST స్లాబ్‌లతో కొనుగోలుదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది.
ముఖ్యంగా ప్రీ-మైనర్ టర్బో వేరియంట్‌లో అత్యధికంగా 70,000 రూపాయలు తగ్గింపు లేదా రూ. 40,000 నగదు ప్రయోజనంతో పాటు రూ. 43,000 విలువైన వెలాసిటీ కిట్ ఆప్షన్ లభిస్తుంది. అదే సమయంలో నాన్-టర్బో మరియు CNG వేరియంట్‌లపై రూ. 15,000 నుంచి రూ. 30,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. టర్బో వేరియంట్‌లపై కొనుగోలుదారులకు రూ. 30,000 నగదు తగ్గింపు లేదా వెలాసిటీ కిట్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం Maruti Fronx ధర స్టార్టింగ్ వేరియంట్ రూ. 7.59 లక్షల నుండి రూ. 13.11 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి.
Maruti Fronx ఇంజిన్, పనితీరు
Fronx రెండు రకాల ఇంజిన్ ఎంపికలతో వచ్చింది. మొదటిది 1.0-లీటర్ టర్బో బూస్టర్‌జెట్ ఇంజిన్, కాగా ఇది 5.3 సెకన్లలో 0 నుంచి 60 km/h వేగాన్ని అందుకుంటుంది. రెండవది అధునాతన 1.2-లీటర్ K-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజిన్, ఇది స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో మార్కెట్లోకి వచ్చింది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ప్యాడిల్ షిఫ్టర్‌లతో అమర్చారు. ఇందులో ఆటో గేర్ షిఫ్ట్ ఛాయిస్ కూడా ఇచ్చారు. మారుతి Fronx మైలేజ్ 22.89 km/l వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది
Maruti Fronx ఆకారం, ఫీచర్లు, టెక్నాలజీ
Maruti Fronx కారు పొడవు 3995 మి.మీ, వెడల్పు 1765 మి.మీ మరియు ఎత్తు 1550 మి.మీ. దీని వీల్‌బేస్ 2520 మి.మీ, 308 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఈ SUV ప్రీమియం ఫీచర్లతో మీకు లభిస్తుంది. ఇందులో హెడ్-అప్ డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్, లెదర్ చుట్టిన స్టీరింగ్ వీల్, 16-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, వైర్‌లెస్ ఛార్జర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ లభిస్తున్నాయి. ఈ సిస్టమ్ Android Auto, Apple CarPlayలకు సపోర్ట్ చేస్తుంది. దీనితో పాటు 6-స్పీకర్ సౌండ్ సిస్టమ్, 9 ఇంచ్ టచ్‌స్క్రీన్, రియర్ AC వెంట్స్, ఫాస్ట్ USB ఛార్జింగ్ తో పాటు కనెక్టెడ్ కార్ ఫీచర్లు ఉన్నాయి.
సేఫ్టీ ఫీచర్లు
Maruti Fronx భద్రత పరంగా బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు (Airbags), సైడ్ - కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-హోల్డ్ అసిస్ట్, ABSతో పాటు EBD వంటి స్టాండర్డ్ ఫీచర్లు ఉన్నాయి. ఎంచుకున్న వేరియంట్‌లలో 360 డిగ్రీల కెమెరా, ఆటో-డిమ్మింగ్ IRVM, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి అధునాతన ఫీచర్లు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి.






















